Jump to content

కురాన్ భావామృతం/సాద్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

38. సాద్‌
(అవతరణ: మక్కా; సూక్తులు: 88)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
సాద్‌! హితబోధలతో కూడిన ఖుర్‌ఆన్‌ సాక్షి! (మాప్రవక్త బోధిస్తున్నది పరమసత్యం) కాని (ఇలాంటి) సత్యవాణిని తిరస్కరించినవారు అహంకారంతో మొండికేసి కూర్చు న్నారు. వారికి పూర్వం మేము (సత్యాన్ని తిరస్కరించిన) ఎన్నో జాతుల్ని తుడిచిపెట్టాం. (మాశిక్ష వచ్చిపడుతున్న సూచనలు చూడగానే) వారు గగ్గోలుపెట్టారు. కాని (సమయం మించిపోయింది.) ఇది ప్రాణాలతో బయటపడే సమయం కాదు. (1-3)
తమ నుండే ఒకతను భయపెట్టేందుకు రావడంపట్ల వారికి ఆశ్చర్యం కలిగింది. వారు “ఇతను మాంత్రికుడు, అబద్ధాలకోరు. దేవుళ్ళందరినీ తీసేసి ఆ స్థానంలో ఒకే ఒక దేవుడ్ని తెచ్చిపెట్టాడే! చాలా విచిత్ర విషయమిది” అని అంటున్నారు. (4-5)
(వారి)జాతి నాయకులు (మరోఅడుగు ముందుకుపోయి) “పదండి, మన దైవాల్నే మనం ఆరాదిస్తూ వాటినే అంటిపెట్టుకొని ఉందాం. ఇతనీ మాట మరేదో ఉద్దేశ్యంతో చెబుతున్నాడు. ఇలాంటి (చిత్రమైన) మాట మనం ఏ మతస్థుల నోటా ఎన్నడూ విన లేదు. ఇది ఒట్టి అభూతకల్పన తప్ప మరేమీకాదు. మనం ఇంతమంది (గొప్పగొప్ప వాళ్లు) ఉండగా ఇతనొక్కడి మీదే దైవగ్రంథం అవతరించిందా?” అని చెప్పసాగారు.
ప్రవక్తా! వీరసలు (నిన్ను కాదు,) నా హితోపదేశాన్ని అనుమానిస్తున్నారు. నా శిక్షను వీరింకా చవిచూడలేదు కదా (అందుకే ఇలాంటి కారుకూతలు కూస్తున్నారు). సర్వశక్తి మంతుడు, గొప్పప్రదాత అయిన నీ ప్రభువు ప్రసాదించిన అనుగ్రహ నిక్షేపాలేమైనా వారి దగ్గర ఉన్నాయా? పోనీ, వారు భూమ్యాకాశాలకు, వాటిమధ్య ఉన్న వాటికి యజమా నులా? అలాగైతే ఓ తాడు కట్టి విశ్వశిఖరాలపై ఎక్కి చూడమను వారిని. (6-10)
అనేక గుంపులలో ఇదొక గుంపు. ఈగుంపు ఈ ప్రదేశం (మక్కా)లోనే పరాజయం పాలౌతుంది. వారికిపూర్వం నూహ్‌జాతి, ఆద్‌జాతి, మేకులవాడైన ఫిరౌన్‌, సమూద్‌జాతి, లూత్‌ జాతి, అయికావారు తిరస్కరించారు. ఇవే (తిరస్కరించిన) గుంపులు. వాటిలో ప్రతిగుంపూ దైవప్రవక్తల్ని తిరస్కరించింది. కనుక నాశిక్ష వాటిపై వచ్చిపడింది. (11-14)
(అలాగే) వీరు కూడా భయంకర విస్ఫోటం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత మరో విస్ఫోటం సంభవించదు. వారు (మా శిక్షను పరిహసిస్తూ) “ప్రభూ! తీర్పుదినానికి ముందే మాకు రావలసిన భాగమేదో మాకు త్వరగా ఇచ్చెయ్యి” అంటున్నారు. (15-16)
ప్రవక్తా! వారు చెబుతున్న మాటలను నీవు అట్టే పట్టించుకోకు. సహనం వహించు. వారి ముందు మా దాసుడు దావూద్‌ వృత్తాంతం ప్రస్తావించు. అతను చాలా బల వంతుడు, పరాక్రమశాలి. ప్రతి విషయంలోనూ అతను దేవుని (ధర్మం) వైపు మరలే వాడు. మేము కొండలను అతని అదుపులో ఉంచాము. అవి ఉదయం, సాయంత్రం అతనితో పాటు (దైవనామం) జపిస్తూ ఉంటాయి. పక్షులు కూడా (అతని) దగ్గరకు చేరుతాయి. సమస్తం అతనితో పాటు దైవస్తోత్రంలో లీనమైపోతాయి. మేమతని సామ్రా జ్యాన్ని పటిష్ఠపరిచాం. అతనికి వివేకం, వ్యవహార దక్షతలను కూడా ప్రసాదించాం.
గోడెక్కి అతని రాజమందిరంలో చొరబడినవారి జగడం గురించి నీకు తెలుసా? అలా వారు అక్రమంగా చొరబడి తన దగ్గరకు రావడంచూసి దావూద్‌ భయపడ్డాడు. అప్పుడు వారిలో ఒకడిలా అన్నాడు: “భయపడకండి. మేమిద్దరం ఒక వ్యాజ్యానికి సంబంధించిన వాది, ప్రతివాదులం. మాలో ఒకడు రెండోవాడిపై అన్యాయానికి పాల్ప డ్డాడు. మీరు మా ఇద్దర్ని గురించి న్యాయంగా తీర్పుచేయండి. అన్యాయం చేయకండి. మాకు సరైన మార్గం చూపండి. ఇతను నా సోదరుడు. ఇతని దగ్గర తొంభై తొమ్మిది గొర్రెలున్నాయి. నాదగ్గర ఒకే గొర్రె ఉంది. ఆ ఒక్కదాన్ని కూడా తనకివ్వమని అంటున్నా డితను. ఇతను మాటలతో (వాదించి) నన్ను లోబరచుకున్నాడు.” (17-23)
దావూద్‌ ఇలా చెప్పాడు:“ఇతను తన గొర్రెల్లో నీ గొర్రెను కూడా కలుపుకుంటాను ఇవ్వమని అడిగి, నిజంగా నీకు చాలా అన్యాయం చేశాడు. కలసిమెలసి పనిచేసేవాళ్ళు సాధారణంగా ఒకరికొకరు అన్యాయానికి పాల్పడతారు. కాని సత్యాన్ని విశ్వసించి సత్కా ర్యాలు చేసేవారు అలా చేయరు. అలాంటి నిజాయితీపరులు (లోకంలో) బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు.”ఇలా చెబుతూ దావూద్‌, తనను మేము పరీక్షిస్తున్నామని గ్రహించాడు. వెంటనే అతను తన ప్రభువుని క్షమాపణ కోరుకున్నాడు. ఆ తర్వాత నేల మీద సాగిలపడి (మావైపు) మరలాడు. అప్పుడు మేమతని పొరపాట్లు క్షమించాం. అతని కోసం మా దగ్గర తప్పక దివ్యసాన్నిధ్యం, మంచి పర్యవసానం ఉన్నాయి. (24-25)
అతనితో మేమిలా అన్నాం: “దావూద్‌! మేము నిన్ను ప్రపంచంలో (మా)ప్రతినిధిగా నియమించాం. కనుక నీవు ప్రజలను న్యాయంగా పాలించు. మనోవాంఛలకు బానిస కాకు. అవి నిన్ను దైవమార్గం నుండి తప్పిస్తాయి. దైవమార్గం తప్పి పరలోక తీర్పుదినాన్ని మరచి పోయేవారికి ఘోరమైన శిక్ష పడుతుంది.” (26)
భూమ్యాకాశాలను, వాటి మధ్య ఉన్నవాటిని మేము లక్ష్యరహితంగా సృష్టించ లేదు. ఇది అవిశ్వాసుల అభిప్రాయం మాత్రమే. అలాంటివారికి నరకం కీడు తప్పదు. (సత్యాన్ని) విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని మేము ప్రపంచంలో అరాచకం సృష్టించే వారితో కలిపి ఒకటిగా చేస్తామా? భయభక్తులుకలవారిని, దుర్మార్గుల్ని సమానంగా చేస్తామా? (27-28)
ఈ గ్రంథం శుభదాయకమైనది. ప్రజలు ఇందులోని సూక్తుల్ని గురించి యోచించ డానికి, బుద్ధిమంతులు గుణపాఠం గ్రహించడానికి మేము దీన్ని నీవద్దకు పంపాం. (29)
దావూద్‌కు మేము సులైమాన్‌ (అనే సుపుత్రుడి)ని ప్రసాదించాము. అతను ఎంతో మంచిదాసుడు, తన ప్రభువుని అత్యధికంగా స్మరిస్తూ ఆయన వైపు మరలేవాడు. (30)
ఓరోజు సాయంత్రం సులైమాన్‌ ముందు మేలుజాతి చలాకీ గుఱ్ఱాలు కొన్ని తీసుకురాబడ్డాయి. “నాప్రభువు స్మరణ కారణంగానే నేనీ అశ్వసంపదను అభిమాని స్తున్నాను” అన్నాడతను. తర్వాత ఆ గుఱ్ఱాలు కనుమరుగైపోయాయి. (సులైమాన్‌ సేవ కుల్ని పిలిచి) “వాటిని మరోసారి నాదగ్గరకు తీసుకురండి” (అన్నాడు). (గుఱ్ఱాలు వచ్చిన తర్వాత) అతను (ప్రేమగా) వాటి మెడలు, కాళ్ళు నిమిరాడు. (31-33)
సులైమాన్‌ని కూడా మేము పరీక్షకు గురిచేశాం. అతని సింహాసనం మీద ఒక మొండెం తెచ్చిపడేశాం. సులైమాన్‌ (దాని మర్మం గ్రహించి) తన నిర్ణయాన్ని మార్చు కున్నాడు. “ప్రభూ! నన్ను క్షమించు. నా తరువాత మరెవ్వరికీ శోభించనటువంటి గొప్ప సామ్రాజ్యం ప్రసాదించు నాకు. నిస్సందేహంగా నీవే దాతవు, అనుగ్రహమూర్తివి” అని మమ్మల్ని వేడుకున్నాడు. అప్పుడు మేము గాలిని అతని అదుపులో ఉంచాము. ఆ గాలి అతని ఆజ్ఞతో అతను కోరుకున్న వైపు మెల్లిగా వీస్తుంది. (34-36)
అలాగే మేము భూతాలను కూడా అతని అదుపాజ్ఞలలో ఉంచాం. వాటిలో కట్టడాలను నిర్మించేవి, గజఈతలో ఆరితేరినవి, కట్టుబానిసల్లా పనిచేసేవి... ఇలా రక రకాల పనులు నిర్వహించే భూతాలున్నాయి. (మేమతనితో) “ఇదంతా మా అనుగ్రహం. నీవు కోరినవారికి వాటిని ఇవ్వచ్చు, లేదా ఇవ్వకుండా నీ దగ్గరే పెట్టుకోవచ్చు. దాన్ని గురించి నిన్ను లెక్క అడగటం జరగదు” (అన్నాం). అతని కోసం మాదగ్గర తప్పకుండా ప్రత్యేక సాన్నిధ్యం, మంచి పర్యవసానం ఉన్నాయి. (37-40)
మా దాసుడు అయ్యూబ్‌ గాధ ప్రస్తావించు. అతను తన ప్రభువుని ప్రార్థిస్తూ “షైతాన్‌ నన్ను తీవ్రబాధకు, యాతనలకు గురిచేశాడ”ని అన్నాడు. “నీ కాళ్ళతో నేలమీద తట్టు. ఈ చన్నీళ్ళు స్నానం చేయడానికి, త్రాగడానికి నీకు ఇస్తున్నాం” (అన్నాం మేము). మేమతనికి అతని బంధువర్గాన్ని తిరిగి రప్పించిఇచ్చాం. వారితోపాటు అంతే మరికొంద రిని కూడా ఇచ్చాము. ఇదంతా మా అనుగ్రహంగా ప్రసాదించాము. విజ్ఞత, వివేచనలు కలవారికి గుణపాఠంగా మేమీ వృత్తాంతం పేర్కొంటున్నాము. (అతనితో) “ఈనెలకట్ట తీసుకొని కొట్టు, ప్రమాణాన్ని భంగపరచకు” అన్నాం. మేమతడ్ని సహనశీలిగా, మంచి దాసునిగా, తన ప్రభువు వైపు మాటిమాటికి మరలే వానిగా గుర్తించాం. (41-44)
మా దాసులు ఇబ్రాహీం, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌లను గురించి కూడా ప్రస్తావించు. వీరంతా గొప్ప క్రియాశీలురు; సునిశితదృష్టి, శక్తిసామర్థ్యాలు కలవారు. మేము ఓ ప్రత్యేక లక్షణం కారణంగా వారిని పావనం చేశాం. అదే పరలోకగృహానికి సంబంధించిన చింతన. వారు మేము ఎన్నుకున్న దాసులు, గొప్ప పుణ్యపురుషులు. (45-47)
(అలాగే) ఇస్మాయీల్‌, అల్‌యసా, జుల్‌కిఫల్‌లను గురించి కూడా ప్రస్తావించు. వీరు కూడా పుణ్యపురుషులే. (48)
ఇదొక జ్ఞాపిక (హితబోధ). కనుక భయభక్తులు కలవారికి తప్పకుండా శ్రేష్ఠమైన హోదా, శాశ్వతమైన స్వర్గవనాలు లభిస్తాయి. దైవభీతిపరాయణుల కోసం స్వర్గద్వారాలు ఎప్పుడూ తెరిచేఉంటాయి. వారా ఉద్యానవనాలలో మెత్తటి దిండ్లకు ఆనుకొని కూర్చొని, హాయిగా తినడానికి, త్రాగడానికి రకరకాల పండ్లు, పానీయాలు తెప్పించుకుంటారు. వారిదగ్గర సిగ్గులొలికించే సమవయస్కులైన సుందరీమణులు కూడా ఉంటారు. ఇవన్నీ విచారణ రోజు ఇవ్వబడతాయని మీకు వాగ్దానం చేస్తున్నాం. ఇదీ మేము ప్రసాదించే ఉపాధి; (ఎంత అనుభవించినా) ఎన్నటికీ తరగని శాశ్వత నిధి. (49-54)
ఇదీ (దైవభీతిపరుల పర్యవసానం). పోతే హద్దుమీరిన దుర్మార్గుల కోసం అతి చెడ్డ నివాసముంది. అదే నరకం. అందులో వారు మలమల మాడిపోతారు. అది పరమ నీచమైన నివాసస్థలం. అదే వారికి లభించేది. కనుక (అక్కడ) సలసల కాగేనీరు, చీము, నెత్తురు, వగైరా అనేక జుగుప్సాకరమైన పదార్థాలను రుచిచూడమను వారిని (55-58)
(వారు నరకంలోకి వస్తున్న) తమ అనుచరమూకను చూసి “ఈగుంపు మన దగ్గరికి చొరబడి వస్తోంది. వారికి ఎలాంటి స్వాగతం లేదు. వారు కూడా అగ్నిలో పడి మాడవలసిన వారే” (అంటారు). కొత్తగా వచ్చినవారు వీరి మాటలు విని “కాదు, మీరే (మాకన్నా ముందు) కాలిపోతున్నారు. మీక్కూడా ఎలాంటి స్వాగతం లేదు. మీరేకదా మాకీ దుర్గతి తెచ్చి పెట్టింది! ఎంత చెడ్డ నివాస స్థలమిది!!” అంటారు. (59-60)
ఆతర్వాత “ప్రభూ! మాకీ దుర్గతి పట్టించినవాడికి రెట్టింపు నరకయాతనలు పెట్టు” అంటారు వారు. తిరిగి మాట్లాడుకుంటూ “మనం ప్రపంచంలో దుర్జనులుగా భావించిన వారు ఇక్కడెక్కడా కన్పించడం లేదేమిటీ? మనం వాళ్ళను ఊరికే హేళన చేశామా? లేక మనకు కనపడకుండా ఎక్కడైనా ఉన్నారా?” అంటారు (ఆశ్చర్యపోతూ). (61-63)
ఇది యదార్థం. నరకవాసుల మధ్య ఇలాగే పోట్లాటలు జరుగుతాయి. (64)
వారికిలా చెప్పు: “నేను (సత్యతిరస్కార పర్యవసానం గురించి) హెచ్చరించేవాడ్ని మాత్రమే. ఏకేశ్వరుడైన అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన సర్వాధికుడు; భూమ్యాకాశాలకు, వాటిమధ్య ఉన్నవాటికి యజమాని, ప్రభువు. ఆయన అపార శక్తి సంపన్నుడు, గొప్ప క్షమాశీలి కూడా.” ఇంకా చెప్పు: “ఇది అసాధారణమైన వార్త. ఇలాంటి వార్త విని మీరు (కాస్తయినా చలించకుండా) నిర్లక్ష్యం చేస్తున్నారు.” (65-68)
(చెప్పు:) “ఊర్థ్వలోక సదస్సులో తలెత్తిన వివాదం సంగతి నాకు తెలియదు. నాకీ విషయాలు దివ్యావిష్కృతి ద్వారా తెలుస్తున్నాయి. నేను ఉన్నది వున్నట్లు స్పష్టంగా తెలియజేసి హెచ్చరించడానికే నాకీ సమాచారం అందజేయబడుతోంది.” (69-70)
నీ ప్రభువు దైవదూతలతో “నేను మట్టితో ఒక మానవుడ్ని సృజించబోతున్నాను. నేనతడ్ని పూర్తిగా సృజించి అతని (దేహం)లో నా ఆత్మ ఊదిన తరువాత మీరతనికి గౌరవ సూచకంగా అభివాదం చేయాలి” అని అన్నాడు. (71-72)
ఈ ఆజ్ఞ ప్రకారం దైవదూతలంతా (మానవుని ముందు) వంగి అభివాదం చేశారు. కాని ఇబ్లీస్‌ మాత్రం గర్విష్ఠుడయి బిర్రబిగిసి కూర్చున్నాడు. (ఆ విధంగా) వాడు సత్య తిరస్కారులలో చేరిపోయాడు. (73-74)
అప్పుడు విశ్వప్రభువు “ఇబ్లీస్‌! ఏమయింది నీకు? నేను నా స్వహస్తాలతో సృజిం చిన మానవునికి అభివాదం చేయనీయకుండా నిన్నే విషయం నిరోధించింది? నువ్వు స్వతహాగా గొప్పవాడయి పోయావా? లేక నువ్వసలు ఏదైనా అగ్రస్థాయి ప్రముఖుల కోవకు చెందిన వాడవని అనుకుంటున్నావా?” అని అడిగాడు. (75)
“నేను అతని కన్నా శ్రేష్ఠుడ్ని. మీరు నన్ను అగ్నితో సృజించారు. అతడ్ని (ఎలాంటి విలువలేని) మట్టితో సృజించారు” అన్నాడు ఇబ్లీస్‌. (76)
“అట్లాగానా, అయితే నువ్విక్కడ నుంచి దిగిపో. నువ్వు భ్రష్టుడివి, పరమ దౌర్భా గ్యుడివి. తీర్పుదినందాకా నీపై అభిశాపం ఉంటుంది” అన్నాడు దేవుడు. (77-78)
“ప్రభూ! అలాగైతే వీరు (మానవులు) తిరిగి లేపబడేవరకు నాకు గడువునివ్వు” అన్నాడు ఇబ్లీస్‌ (కంగారుపడుతూ). (79)
“సరే అలాగే నిర్ణీతసమయం వరకు గడువిస్తున్నా, పో” అన్నాడు దేవుడు. (80,81)
“నీ గౌరవప్రతిష్ఠల సాక్షి! (ఆరోజుదాకా) నీతిమంతులైన నీ దాసుల్ని తప్ప అందర్నీ నేను దారితప్పిస్తూ ఉంటాను” అన్నాడు ఇబ్లీస్‌. (82-83)
“అయితే విను. నేను యదార్థమే చెబుతున్నాను. నిన్ను, నిన్ను అనుసరించే మానవుల్నందర్నీ నరకంలో వేసి దాన్ని నింపివేస్తాను” అన్నాడు దేవుడు. (84-85)
ముహమ్మద్‌ (సల్లం)! వారికిలా చెప్పు: “నేనీ (ధర్మ) ప్రచారం కోసం మీ నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు. అదీగాక నేను పగటివేషాలు వేసే మోసగాడ్ని కూడా కాను. ఈ ఖుర్‌ఆన్‌ యావత్‌మానవాళి కోసం అవతరించిన హితోపదేశం. అనతి కాలంలోనే మీకు దీని వాస్తవికత ఏమిటో తెలుస్తుంది.” (86-88)