Jump to content

కురాన్ భావామృతం/అస్-సజ్దా

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

32. సజ్దా (సాష్టాంగప్రణామం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 30)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లామ్‌-మీమ్‌. ఈ గ్రంథం సర్వలోక ప్రభువు నుండి అవతరించింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. (1-2)
(ఇలాటి గ్రంథం గురించి) వీరు “దీన్ని ఇతను కల్పించుకున్నాడ”ని అంటున్నారా? కాదు. ఇది నీ ప్రభువు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించే వారెవరూ రానటువంటి జాతిని నీవు హెచ్చరించేందుకు పంపబడిన సత్యమిది. దీని ద్వారా ఆ జాతిప్రజలు రుజుమార్గంలోకి వస్తారన్న లక్ష్యంతో అవతరించిన (పరమ)సత్యం. (3)
భూమ్యాకాశాలను, వాటిమధ్య ఉన్న సమస్త సృష్టిరాసుల్ని ఆరు రోజుల్లో సృష్టించి, ఆ తర్వాత అధికార సింహాసనంపై అధిష్ఠించినవాడు (ఆ) దేవుడే. ఆయన తప్ప మీకు మరెవరూ సహాయకుడూ, సంరక్షకుడూ లేరు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా సిఫారసు చేసేవారు కూడా ఎవరూ లేరు. (మరి ఇప్పుడైనా) మీరు స్పృహలోకి వస్తారా? (4)
నింగి నుండి నేల వరకు సమస్త విశ్వవ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు ఆయనే తీసుకుంటాడు. వాటి వివరాలు మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైన ఒక దినంలో ఆయన సన్నిధికి చేరుతాయి. (5)
ఆయనే అంతర్‌బాహ్య విషయాలన్నీ ఎరిగినవాడు. ఆయన మహా శక్తిమంతుడు, అమిత దయామయుడు. ఆయన ప్రతిదాన్నీ సముచితరీతిలో అద్భుతంగా సృష్టించాడు. ఆయన మానవ సృష్టిని మన్నుతో ఆరంభించాడు. తరువాత ఒక నీచమైన (వీర్య) బిందువుతో అతని సంతతిని ఉత్పత్తి చేయసాగాడు. ఆపై అతడ్ని పరిపూర్ణ మానవుడిగా రూపొందించి అతని (శరీరం)లో తన ఆత్మను ఊదాడు. (ఒక్కసారి ఆలోచించండి.) ఆయన మీకు చెవులిచ్చాడు, కళ్ళిచ్చాడు, హృదయాన్నిచ్చాడు. కాని మీరు మాత్రం (ఆయనకు) చాలా తక్కువగా కృతజ్ఞత చూపుతున్నారు. (6-9)
వీరు (నీమాటలు విని) “మేము మట్టిలో కలసిపోయాక మళ్ళీ సృజించబడ తామా?” అని అడుగుతున్నారు. కాని వీరసలు తమ ప్రభువును కలుసుకునే విషయాన్నే నమ్మడం లేదు. వారికి చెప్పు: “మీకోసం నియమించబడిన మృత్యుదూత మీప్రాణాలు తీస్తాడు. తర్వాత మిమ్మల్ని మీ ప్రభువు సన్నిధికి తీసుకుపోవడం జరుగుతుంది.”
ఈ పాపాత్ములు తమ ప్రభువు ముందు తలవంచి నిలబడినప్పుడు నీవు వారి పరిస్థితి చూడగలిగితే బాగుండు. అప్పుడు వారు (పశ్చాత్తాపపడుతూ) “ప్రభూ! మేము అంతా చూసుకున్నాం, విన్నాం. మమ్మల్ని వెనక్కిపంపించు. మేము సత్కార్యాలు చేస్తాం. ఇప్పుడు మాకు (బుద్ధొచ్చింది.) పూర్తిగా నమ్మకం కలిగింది” అనంటారు. (10-12)
“మేము తలచుకుంటే ప్రతి మనిషికీ సన్మార్గావలంబన బుద్ధి ప్రసాదించేవాళ్ళం. కాని నేను నరకాన్ని మానవులతో, జిన్నులతో నింపేస్తానని అన్నాను. నామాట నెర వేరింది. కనుక మీ చేష్టల పర్యవసానం చవిచూసుకోండిప్పుడు. ఈ దినం రాకను మీరు బుద్ధిపూర్వకంగానే విస్మరించారు. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని విస్మరిస్తున్నాం. ఇక మీరు చేజేతులా చేసుకున్న కర్మలకు ఫలితంగా శాశ్వత యాతనలు చవిచూడండి.”#
కొందరు మా సూక్తులు విన్పించి హితోపదేశం చేయగానే వారు (అప్రయత్నంగా) సాష్టాంగపడతారు. ఆపై తమ ప్రభువును స్తుతిస్తూ స్మరిస్తారు. అహంకారంతో విర్రవీగరు. వారు రాత్రిళ్ళు మేల్కొని దైవారాధనలో గడుపుతారు. ఆశతో, భయంతో తమ ప్రభువును వేడుకుంటారు. మేమిచ్చిన ఉపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు పెడ్తారు. ఇలాంటి (సుగుణాలుకల)వారే మా సూక్తులు విశ్వసిస్తారు. వారు చేసుకున్న సత్కర్మలకు ప్రతి ఫలంగా వారి కళ్లను చల్లబరిచే అపూర్వసామగ్రి వారికోసం దాచబడిఉంది. దాన్ని గురించి ఏ మనిషికీ తెలియదు. (అది ఊహాతీతమైన అద్భుతమహాభాగ్యం.) (13-17)
సత్యాన్ని విశ్వసించినవాడు, దుర్మార్గుడైన వ్యక్తిలాంటి వాడు కాగలడా? వీరిద్దరు ఎన్నటికీ సమానులు కాలేరు. సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులయినవారికి వారి సత్కర్మలకు ప్రతిఫలంగా స్వర్గవనాల రూపంలో గొప్ప ఆతిథ్యం లభిస్తుంది. దుష్కార్యా లలో కూరుకుపోయినవారికి మాత్రం నరక నివాసమే గతవుతుంది. ఆ నరకం నుండి బయటపడేందుకు ప్రయత్నించినప్పుడల్లా వారిని మళ్ళీ అందులోకే నెట్టివేయడం జరుగుతుంది. అప్పుడు (దైవదూతలు) వారితో “మీరు నరకాన్ని తిరస్కరిస్తుండేవారు కదూ! ఆ నరక శిక్షనే ఇప్పుడు చవిచూడండి” అంటారు. (18-20)
ఘోరమైన ఆ శిక్షకు పూర్వం ఇహలోకంలో కూడా మేము (ఏదో ఒక స్థాయిలో) వారికి శిక్షను చవిచూపిస్తూ ఉంటాము. దీని ద్వారానయినా వారు (తమ ద్రోహబుద్ధి) మానుకుంటారేమో చూడాలి. విశ్వప్రభువు సూక్తులు పఠించి హితోపదేశం చేస్తుంటే, వాటిని వినకుండా ముఖం తిప్పుకునేవాడికంటే పరమ దుర్మార్గుడు ఎవరుంటారు? ఇలాంటి పాపాత్ములకు మేము తప్పకుండా ప్రతీకారం చేస్తాము. (21-22)
పూర్వం మేము మూసాకు గ్రంథం ప్రసాదించాము. కనుక ఇప్పుడు అలాంటి వస్తువే లభించడం పట్ల నీవు అనుమానానికి గురికాకు. ఆ గ్రంథాన్ని మేము ఇస్రాయీల్‌ సంతతివారికి మార్గదర్శినిగా చేశాము. వారు (కష్టాలు ఎదురైనప్పుడు) సహనంవహిస్తూ, మా సూక్తులు విశ్వసిస్తున్నంత కాలం మేము వారిలో మా ఆజ్ఞల ప్రకారం వారికి మార్గ దర్శకత్వం వహించే నాయకుల్ని ఉద్భవింపజేశాం. వారు పరస్పరం విభేదించుకుంటున్న విషయాల్ని గురించి ప్రళయదినాన నీ ప్రభువు తప్పక తీర్పుచేస్తాడు. (23-25)
వీరికి పూర్వం మేము ఎన్ని జాతుల్ని నాశనం చేశామో (ఆ చారిత్రక సంఘటనల నుండి) వీరు గుణపాఠం నేర్చుకోలేదా? ఆ జాతులవారు నివసించిన ప్రాంతాల్లోనే వీరీ నాడు తిరుగుతున్నారు కదా? ఇందులో గొప్ప నిదర్శనాలు ఉన్నాయి. వీరు (మామాట) వినరా? మేము బంజరు నేలపై నీటిని తెచ్చి వర్షింపజేసి, ఆ నేల నుండి పంటలు పండిస్తూ ఉండటాన్ని వీరు ఏనాడూ గమనించలేదా? ఆ పంటల నుండి (ధాన్యం) స్వయంగా వీరూ తింటున్నారు; వీరి పశువులకూ మేత లభిస్తుంది కదా? మరి వీరికి (దీని ద్వారా) ఏమీ తట్టడం లేదా? (26-27)
“నీవు చెప్పేది నిజమైతే (శిక్ష గురించిన) ఈ నిర్ణయం ఎప్పుడు అమల్లోకి వస్తుందీ?” అంటారు వీరు. “ఆ నిర్ణయం అమల్లోకి వచ్చేరోజు తిరస్కారులు సత్యాన్ని విశ్వసించడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరోఅవకాశం లభించదు” అని చెప్పు. సరే (తిరస్కారవైఖరి మానుకోకపోతే) వారిమానాన వారిని వదలి (నిర్ణయం కోసం) ఎదురుచూస్తుండు. వారు కూడా ఎదురుచూస్తుంటారు. (28-30)