Jump to content

కురాన్ భావామృతం/అల్-హదీద్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

57. హదీద్‌ (ఇనుము)
(అవతరణ: మదీనా; సూక్తులు: 29)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
భూమ్యాకాశాల్లో ఉన్న అణువణువూ దేవుని ఔన్నత్యాన్ని, ఆయన పవిత్రతను ప్రశంసిస్తోంది. ఆయన మహా శక్తిమంతుడు, అసామాన్య వివేకవంతుడు. ఆయనే భూమ్యాకాశాల సామ్రాజ్యాధినేత. జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన ప్రతి పనీ చేయగల సర్వశక్తిమంతుడు. ఆయనే మొదటివాడు, చివరివాడు కూడా. ఆయనే బాహ్యశక్తి, నిగూఢశక్తి కూడా. ఆయనే సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. (1-3)
ఆయన భూమ్యాకాశాల్ని ఆరు రోజుల్లో సృష్టించి, ఆ తర్వాత అధికార సింహాసనం అధిష్టించాడు. భూలోకానికి చేరుతున్నదేమిటో, భూలోకం నుండి బయటికి వెళ్తున్నదే మిటో, ఆకాశం నుండి అవతరిస్తున్నదేమిటో, ఆకాశంలోకి అధిరోహిస్తున్నదేమిటో అంతా ఆయనకు తెలుసు. మీరెక్కడున్నా ఆయన మీవెన్నంటే ఉంటాడు. మీరు చేసే ప్రతిపనీ ఆయన చూస్తున్నాడు. ఆయనే భూమ్యాకాశాల సామ్రాజ్యాధినేత. సమస్త వ్యవహారాలు నిర్ణయంకోసం ఆయన దగ్గరికే వెళ్తాయి. ఆయనే రాత్రిని పగటిలోనికి, పగటిని రాత్రిలో నికి జొన్పిస్తున్నాడు. ఆయనకు (మీ)హృదయాల్లోని రహస్యాలు సైతం తెలుసు. (4-6)
దేవుడ్ని, ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఏసంపద గురించి ఆయన మీపై ప్రాతి నిధ్య బాధ్యతను మోపాడో, దాన్నుండి (కొంత దైవమార్గంలో) ఖర్చుపెట్టండి. సత్యాన్ని విశ్వసించి (దైవమార్గంలో) ధనవ్యయం చేసేవారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. (7)
దైవప్రవక్త మిమ్మల్ని తన ప్రభువును విశ్వసించమని హితవుచేసి మీచేత ప్రమాణం చేయించినా మీరు దేవుడ్ని విశ్వసించరెందుకు? మీరు నిజంగా విశ్వసించిన వారయితే (ఈ విశ్వాసరాహిత్య వైఖరేమిటీ?) మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకురావడానికి తన దాసునిపై నిర్దిష్ట సూక్తులు అవతరింపజేస్తున్నవాడు దేవుడే కదా! మీ విషయంలో దేవుడు ఎంతో దయార్ద్ర హృదయుడు, గొప్ప క్షమాశీలి. (8-9)
భూమ్యాకాశాల్లోని సర్వస్వం దేవునిదే. ఆయనే వాటికి వారసుడు. అలాంటప్పుడు మీరు దైవమార్గంలో సంపద ఎందుకు ఖర్చుపెట్టరు? విజయానికి పూర్వం ధనత్యాగం చేసి యుద్ధం చేసినవారితో, విజయానంతరం సంపద ఖర్చుపెట్టి సమరంలో పాల్గొనే వారు ఎన్నటికీ సమానులు కాలేరు. దేవుడు ఉభయులకూ (ప్రతిఫలం విషయంలో) మంచి వాగ్దానం చేసినప్పటికీ హోదా, అంతస్తులలో వీరికంటే విజయానికి పూర్వం ధన త్యాగంచేసి యుద్ధం చేసినవారే అధికులు. మీరు చేసేదంతా దేవునికి తెలుసు. (10)
మీలో దేవునికి రుణమిచ్చే వారెవరైనా ఉన్నారా? శ్రేష్ఠమైన రుణం? అలాంటి వారికి దేవుడు ఆ రుణాన్ని అనేక రెట్లు పెంచి తిరిగిచ్చివేస్తాడు.[2] పైగా వారికి అత్యంత శ్రేష్ఠమైన ప్రతిఫలం కూడా లభిస్తుంది. (11)
ఆరోజు (అంతిమ దినాన) విశ్వసించిన స్త్రీపురుషుల ముందు, వారి కుడివైపు వారి జ్యోతి పరుగిడుతూ ఉండటం నీకు కన్పిస్తుంది. “ఈరోజు మీకో గొప్ప శుభవార్త!” అని వారికి చెప్పబడుతుంది. (అదే) సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలు. ఆ స్వర్గవనా లలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇదే గొప్పవిజయం, అపూర్వ సాఫల్యం. (12)
ఆరోజు కపటవిశ్వాసులైన స్త్రీపురుషుల పరిస్థితి (దయనీయంగా ఉంటుంది). వారు (చీకటిలో తచ్చాడుతూ) “కాస్త మావైపు చూడండి. మీజ్యోతి వల్ల మాకూ కొంచెం ప్రయోజనం కలుగుతుంది” అంటారు విశ్వాసులతో. కాని “వెనక్కివెళ్ళి మీజ్యోతి ఎక్క డుందో వెతుక్కోండి” అని సమాధానం లభిస్తుంది వారికి. తర్వాత వారుభయుల మధ్య ఒక అడ్డుగోడ ఏర్పడుతుంది. దానికి ఒక తలుపుంటుంది. ఆ తలుపు వెనుక లోపలి వైపున (దైవ)కారుణ్యం ఉంటుంది. దాని వెలుపల (నరక)యాతనలుంటాయి. (13)
వారు విశ్వాసుల్ని కేకలుపెట్టి పిలుస్తూ “మేము (ప్రపంచంలో) మీతోపాటు లేమా?” అంటారు. దానికి విశ్వాసులు ఇలా అంటారు: “ఉన్నారు, కాని మిమ్మల్నిమీరు పరీక్షకు గురి చేసుకొని ప్రమాదం కొనితెచ్చుకున్నారు. గోడమీది పిల్లివాటంగా వ్యవహ రించారు. అనుమానంలో పడిపోయారు. లేనిపోని ఆశలు పెంచుకొని ఆత్మవంచనకు పాల్పడ్డారు. దేవుని ఆజ్ఞ వచ్చేదాకా మీరు అదే స్థితిలో ఉన్నారు. పరమ మోసగాడు (షైతాన్‌) మిమ్మల్ని దేవుని విషయంలో చివరి క్షణం వరకూ మోసగిస్తూనే ఉన్నాడు. (వాడి వలలో నుంచి మీరు బయట పడలేక పోయారు.) అందువల్లనే ఈరోజు (మీకీ దుర్గతి పట్టింది. ఇక) మీనుండి ఎలాంటి పరిహారం స్వీకరించడం జరగదు. బహిరంగం గా (సత్య) తిరస్కారానికి పాల్పడినవారి నుండి కూడా (పరిహారం స్వీకరించబడదు). కనుక మీకిక నరకమే నివాసస్థలం. అక్కడే మీకు తగిన శాస్తి జరుగుతుంది. అది అత్యంత ఘోరమైన దుష్పర్యవసానం.” (14-15)
విశ్వాసుల హృదయాలు దేవుని ప్రస్తావనతో ద్రవించే సమయమింకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నంకాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తర్వాత వారి హృదయాలు కఠినమై పోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులైఉన్నారు. మీరలా కాకూడదు సుమా! వినండి! భూమి మృతప్రాయమైన తర్వాత దేవుడు దానికి తిరిగి జీవంపోస్తు న్నాడు. (అలాగే మృతప్రాయమైన మానవతక్కూడా ప్రవక్తల ద్వారా జీవం పోస్తున్నాడు.) మీరు విషయం గ్రహిస్తారని మాసూక్తులు మీకు విడమరచి చెబుతున్నాం. (16-17)
చిత్తశుద్ధితో దానధర్మాలు చేసే, దేవునికి శ్రేష్ఠమైన రుణం అందజేసే స్త్రీ పురుషు లకు దేవుడు తప్పక (వారి సత్కార్యాన్ని) అనేక రెట్లు పెంచి తిరిగిస్తాడు. ఆపై వారికి అత్యంత శ్రేష్ఠమైన ప్రతిఫలం కూడా లభిస్తుంది. దేవుడ్ని, దైవప్రవక్తను మనస్ఫూర్తిగా విశ్వసించినవారే తమ ప్రభువు దృష్టిలో సత్యసంథులు, ధర్మసాక్షులు. వారి కోసం తగిన ప్రతిఫలం, జ్యోతి ఉన్నాయి. దీనికిభిన్నంగా అవిశ్వాస వైఖరి అవలంబించి, మా సూక్తులు నిరాకరించినవారు మాత్రం నరకానికి పోతారు. (18-19)
వినండి, ఇహలోక జీవితం ఒకఆట, తమాషా, బాహ్యపటాటోపం, పరస్పరం బడాయి చెప్పుకొని గర్వించడం, సంతానం, సిరిసంపదలలో ఒకర్నొకరు మించిపోవడా నికి ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు. ఐహికజీవితాన్ని ఇలా పోల్చవచ్చు: వర్షంతో ఎదిగిన మొలకల్ని చూసి రైతులు సంబరపడిపోతారు. తర్వాత ఆ పొలం పంటకు వచ్చి ఎర్రబారడం కన్పిస్తుంది. ఆ తర్వాత తుప్పగా (గడ్డిపరకలుగా) మారిపోతుంది.
అయితే పరలోకంలో (అవిశ్వాసుల కోసం) తీవ్రమైన యాతనలు, (విశ్వాసుల కోసం) దేవుని మన్నింపు- ఆయన ప్రసన్నతలు ఉంటాయి. ప్రపంచజీవితం ఒక మాయ, భ్రాంతి తప్ప మరేమీ కాదు. దేవుడ్ని, ఆయన ప్రవక్తలను విశ్వసించినవారి కోసం స్వర్గ సీమ సిద్ధంగా ఉంది. (కనుక) దేవుని మన్నింపు వైపు, భూమ్యాకాశాలంత విశాలమైన ఆ స్వర్గసీమ వైపు పోటీపడి పరుగెత్తండి. ఇది దేవుని అనుగ్రహం. ఆయన దాన్ని తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. దేవుడు గొప్ప అనుగ్రహశాలి. (20-21)
భూమిపైగాని లేదా మీపైగాని వచ్చిపడే ఏఆపదైనా దాన్ని సృష్టించడానికి పూర్వమే మేము దాన్ని గురించి గ్రంథంలో రాసిపెట్టాము. ఇలా చేయడం దేవునికి చాలా తేలిక. మీమీద ఏఆపద వచ్చినా మీరు బాధపడకుండా (సహనంతో) ఉండాలని, దేవుడు మీకు ఏభాగ్యం అనుగ్రహించినా దాన్ని చూసుకొని మీరు మిడిసిపడకూడదని (ఆయన ఈ ఏర్పాటు చేశాడు). తమనుతాము ఏదో గొప్పవాళ్ళమని భావించి విర్రవీగేవాళ్ళను దేవుడు ఏమాత్రం ప్రేమించడు. అలాగే తాము పిసినారితనం వహించడమే గాకుండా ఇతరుల్ని కూడా పిసినారితనం నూరిపోసే వారిని కూడా దేవుడు ప్రేమించడు. (ఇదంతా తెలిసి కూడా) ఎవరైనా సత్యానికి విముఖులైపోతే దేవుడు కూడా వారిని ఖాతరు చేయడు. ఆయన నిరపేక్షాపరుడు, స్వతహాగా ప్రశంసనీయుడు. (22-24)
మేము మా ప్రవక్తలకు నిర్దిష్టమైన సూచనలు, నిదర్శనాలిచ్చి పంపాము. వాటితో పాటు దివ్యగ్రంథాలను, జనం న్యాయానికి కట్టుబడి ఉండేందుకు కొలమానాన్ని కూడా అవతరింపజేశాము. అలాగే ఇనుముని కూడా అవతరింపజేశాం. ఇందులో చాలా శక్తి, ప్రజలకు ప్రయోజనాలున్నాయి. దేవుడు ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి కారణం, ఎవరు తనను చూడకుండా తనకు, తన ప్రవక్తలకు సహాయం చేస్తాడో అతడ్ని ఆయన పరీక్షించదలిచాడు. దేవుడు ఎంతో బలాఢ్యుడు, మహా శక్తిమంతుడు. (25)
మేము నూహ్‌ను, ఇబ్రాహీంను (ప్రవక్తలుగా నియమించి) పంపాము. వారిద్దరి సంతతిలో ప్రవక్తృత్వాన్ని, దివ్యగ్రంథాన్ని ఉంచాము. అయితే వారి సంతానంలో కొందరే సన్మార్గం అవలంబించారు. చాలామంది (దారితప్పి) దుర్మార్గులై పోయారు. వారి తర్వాత మేము ఒకరి తర్వాత మరొకరు చొప్పున అనేకమంది ప్రవక్తలను పంపాము.
వారందరి తరువాత మర్యం కుమారుడు ఈసాను పంపి, అతనికి ఇన్జీల్‌ గ్రంథం ప్రసాదించాం. అతడ్ని అనుసరించినవారి హృదయాలలో మేము దయా, సానుభూతులు కలిగించాం. అయితే వైరాగ్యాన్ని వారే సృష్టించుకున్నారు. మేము దాన్ని వారికి విధిగా చేయలేదు. దైవప్రసన్నత కోసం వారీ కొత్త సంప్రదాయం ప్రారంభించారు. సరే దానికైనా కట్టుబడిఉన్నారా అంటే అదీలేదు. వారిలో (సత్యాన్ని) విశ్వసించినవారికి మేము తగిన ప్రతిఫలం ప్రసాదించాం. కాని చాలామంది దుర్జనులైపోయారు. (26-27)
విశ్వసులారా! దేవునికి భయపడండి. ఆయన ప్రవక్తను విశ్వసించండి. దేవుడు మీకు రెట్టింపు కారుణ్యం ప్రసాదిస్తాడు. (అంటే మిమ్మల్ని ఎంతగానో కరుణిస్తాడు.) మీకు జ్యోతి అనుగ్రహిస్తాడు; దాని వెలుగులో మీరు (సన్మార్గంలో) నడుస్తారు. ఆయన మీ పొరపాట్లు క్షమిస్తాడు. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (28)
గ్రంథప్రజలకు దేవుని అనుగ్రహంపై ఎలాంటి గుత్తాధిపత్యం లేదు. దేవుని అను గ్రహం ఆయన చేతిలోనే ఉంది. ఆయన తాను కోరినవారికి దాన్ని ప్రసాదిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహశీలి. వారీ విషయం తెలుసుకోవాలి. (29)