Jump to content

కురాన్ భావామృతం/అల్-ముల్క్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

67. ముల్క్‌ (సార్వభౌమత్వం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 30)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
యావత్తు విశ్వసార్వభౌమత్వం కలిగివున్న దేవుడు ఎంతో శుభదాయకుడు. ఆయన ప్రతి వస్తువుపై, ప్రతి విషయంపై సర్వాధికారం కలిగి ఉన్నాడు. మీలో ఎవరు మంచి పనులు చేస్తారో (మరెవరు చెడ్డపనులు చేస్తారో) పరీక్షించడానికి ఆయన జీవన్మరణాలు సృష్టించాడు. ఆయన మహా శక్తిమంతుడు, గొప్ప క్షమాశీలి. (1-2)
ఆయన ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలు నిర్మించాడు. (చూడండి) కరుణామ యుని సృష్టి నిర్మాణంలో మీకేదైనా క్రమరాహిత్యం కన్పిస్తుందా? కన్పించదు. మరోసారి చూడండి. ఎక్కడైనా మీకేదైనా లోపం కన్పిస్తుందా? (కావాలంటే) మళ్ళీమళ్ళీ చూడండి. (చివరికి) మీచూపులే అలసిసొలసి అవమానభారంతో వెనక్కి మరలుతాయి. (3-4)
మీకు సమీపంలో ఉన్న ఆకాశాన్ని మేము అద్భుతమైన (తారా)దీపాలతో తీర్చిదిద్ది వాటిని పిశాచశక్తుల్ని తరిమికొట్టే సాధనాలుగా చేశాం. ఈ పిశాచశక్తుల కోసం మేము భగభగ మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము. (అలాగే) విశ్వప్రభువును తిరస్కరించిన వారి కోసం నరకశిక్ష కాచుకొని ఉంది. నరకం పరమ చెడ్డ నివాసం. అందులో విసరి వేయబడేటప్పుడు వారు దాని భయంకరమైన గర్జనలు వింటారు. అది మండిపడుతూ తీవ్రమైన ఆగ్రహోద్రేకాలతో బ్రద్దలయిపోతున్నట్లు గోచరిస్తుంది.
అందులో (దుష్ట)మూకలను విసరివేసినప్పుడల్లా దాని నిర్వాహకులు వారిను ద్దేశించి “మీ దగ్గరకు హెచ్చరించేవారెవరూ రాలేదా?” అని అడుగుతారు. దానికి వారు “ఎందుకు రాలేదు, వచ్చాడొకతను. కాని మేమతడ్ని తిరస్కరించాం. అతనితో ‘దేవుడు ఏదీ పంపలేదు. నీవు చాలా అపమార్గంలో పడిపోయావు అన్నాం” అనంటారు. (5-9)
“అయ్యో! మా పాడుగాను!! మేము (ప్రవక్త మాటలు) విని అర్థం చేసుకొనివుంటే ఈరోజు (మాకీ దుర్గతి పట్టేదికాదు.) మేము అగ్ని శిక్షకు గురైన వారిలో చేరి వుండేవారం కాము” అని కూడా అంటారు వారు. ఈవిధంగా వారు తమ తప్పు ఒప్పుకుంటారు. ఈ నరకవాసులు నాశనం గాను! (ఇప్పుడా వీరు తప్పు ఒప్పుకునేది?) (10-11)
ఎవరు తమ ప్రభువును (ప్రత్యక్షంగా) చూడకుండానే ఆయనకు భయపడతారో వారి కోసం పాపమన్నింపు, గొప్ప సుకృతఫలం ఉన్నాయి. మీరు మెల్లగా మాట్లాడినా, బిగ్గరగా మాట్లాడినా ఒకటే; ఆయనకు (మీ) అంతరంగాల్లో మెదిలే నిగూఢ విషయాలు సయితం తెలుసు. సృష్టించినవాడికి (తన దాసుల సంగతి) తెలియదా మరి? ఆయన ఎంతో సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు. మీరు భూమి ఉపరితలంపై (నిశ్చింతగా) తిరిగేందుకు ఆయనే దాన్ని అదుపులో ఉంచాడు. దేవుడు ప్రసాదించిన ఉపాధి (ఒనరులు) అనుభవించండి. చివరికి మీరు (మరణానంతరం) ఆయన సన్నిధికే పునర్జీవులయి పోవలసి ఉంది. (12-15)
ఆకాశంలో ఉన్నవాడు మిమ్మల్ని హఠాత్తుగా భూమిలోకి దిగబడేలా చేయడని, భూమి తీవ్ర ప్రకంపనలతో ఊగిపోదని మీరు నిర్భయంగా ఉన్నారా? (లేక) ఆకాశంలో ఉన్నవాడు మీపైకి రాళ్ళ తుఫాన్‌ని పంపడని నిశ్చింతగా ఉన్నారా? (ఆ విపత్తు వచ్చి పడగానే) అప్పుడు తెలుస్తుంది మీకు నా హెచ్చరికలు ఎలాంటివో. (16-17)
వీరికి పూర్వం గతించినవారు కూడా (ప్రవక్తలను) తిరస్కరించారు. ఇక నా పట్టు ఎంత కఠినంగా ఉండేదో చూడు. వీరు తమమీద రెక్కలు జాపుతూ, ముడుస్తూ ఎగిరే పక్షుల్ని పరికించి చూడలేదా? వాటిని (ఏ ఆధారం లేకుండా) పట్టిఉంచేవాడు కరుణా మయుడు తప్ప మరెవరూ లేరు. ఆయన ప్రతి సృష్టిరాసినీ పర్యవేక్షిస్తున్నాడు. (18-19)
కరుణామయునికి వ్యతిరేకంగా మీవద్ద మిమ్మల్ని ఆదుకోగలిగే సైన్యం ఏముందో కాస్త చూపండి (మాకు). వీరసలు పెద్ద మోసానికి గురైఉన్నారు. పోని, కరుణామయుడు తన ఉపాధి (మార్గం) మూసేస్తే ఇక మీకు ఉపాధినిచ్చే వారెవరో చెప్పండి మాకు. (ఎవరూ లేరు.) వీరసలు తమ తలబిరుసుతనం, సత్యతిరస్కారాల నుండి బయట పడటానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. (20-21)
(సరే,) తల వంచుకొని (మూగెద్దులా) నడిచేవాడు సరైన దారిలో నడుస్తాడా, లేక తల పైకెత్తి సూటిగా చూస్తూ చదునైన బాటపై నడిచేవాడు సరైన దారిలో ఉంటాడా? చెప్పు: దేవుడే మిమ్మల్ని పుట్టించాడు. ఆయనే మీకు వినే, చూసే శక్తినిచ్చి ఆలోచించే, అర్థం చేసుకునే మేధ కూడా ప్రసాదించాడు. కాని మీరు చాలా తక్కువగా కృతజ్ఞత చూపుతున్నారు. చెప్పు: “మిమ్మల్ని భూమండలంపై విస్తరింపజేసినవాడు దేవుడే. ఆయన సన్నిధిలోనే మీరు (మరణానంతరం) సమీకరించి ప్రవేశపెట్టబడతారు.” (22-24)
వారు “నీవు చెప్పేది నిజమైతే (ప్రళయ సంభవం గురించిన) వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది?” అని అంటారు. వారికిలా చెప్పు: “ఆ సంగతి దేవునికి మాత్రమే తెలుసు. నేను విషయాన్ని అందజేసి హెచ్చరించేవాడ్ని మాత్రమే.” ఆ సమయం సమీపించినప్పుడు దాన్ని చూడగానే సత్యతిరస్కారుల ముఖాలు (భయాందోళనలతో) ముడుచుకుపోతాయి. అప్పుడు వారికి “ఇదే మీరు (ఎప్పుడు సంభవిస్తుందని) అడుగు తుండిన విషయం” అని చెప్పడం జరుగుతుంది. (25-27)
వారిని అడుగు: “మీరెప్పుడైనా ఆలోచించారా? దేవుడు నన్ను, నా అనుచరుల్ని చంపినా లేక కరుణించినా (దానివల్ల మీకు ఒరిగేదేమీ లేదు. కాని) సత్యతిరస్కారులను దుర్భర శిక్ష నుండి ఎవరు కాపాడగలరు?” వారికిలా చెప్పు: “ఆయన ఎంతో కరుణా మయుడు, ఆయన్నే మేము విశ్వసిస్తున్నాము; ఆయన్నే నమ్ముకొని ఉంటాము. (కాని) పూర్తిగా మార్గభ్రష్టత్వంలో పడినవారెవరో మీకు త్వరలోనే తెలిసిపోతుంది.” (28-29)
వారిని అడుగు: “మీ బావులు, కుంటల్లోని నీరు నేలలోకి ఇంకిపోతే ఇక ఆ నీటి ఊటల్ని మీకెవరు తీసిస్తారు? దీన్ని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?” (30)