కురాన్ భావామృతం/అల్-బురూజ్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
85. బురూజ్ (ఆకాశ బురుజులు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 22)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
దృఢమైన బురుజులుకల ఆకాశం సాక్షి! వాగ్దానం చేయబడిన (ప్రళయ)దినం సాక్షి! చూసేదాని, చూడబడేదాని సాక్షి! ‘గుంట’మనుషులు నాశనమయ్యారు. ఆ గుంట లో ఇంధనంతో బాగా మండించిన అగ్ని ఉంది. వారా అగ్నిగుండం చుట్టూ కూర్చొని, తాము విశ్వాసులపట్ల ఎలా(ఘోరంగా) ప్రవర్తిస్తున్నది చూస్తున్నారు. వారా విశ్వాసుల పై అంత కసి పెంచుకోవడానికి కారణం, ఆ విశ్వాసులు సర్వశక్తిమంతుడు, స్వతహాగా ప్రశంసనీయుడైన దేవుడ్ని విశ్వసించడం తప్ప మరేమీ కాదు. ఆ దేవుడు భూమ్యా కాశాల సామ్రాజ్యానికే చక్రవర్తి. ఆయన సమస్త విషయాలు గమనిస్తున్నాడు. (1-9)
విశ్వసించిన స్త్రీపురుషులను పీడించి దుర్భర కష్టాలకు గురిచేసినవారు తమ అకృ త్యాల పట్ల పశ్చాత్తాపం చెందకపోతే, దేవుడు వారికి తప్పకుండా నరకశిక్ష విధిస్తాడు. వారికోసం దహనశిక్ష కాచుకొని ఉంది. ఇక విశ్వసించి సత్కర్మలు చేసినవారికి సెల యేరులు పారే స్వర్గవనాలు ఉన్నాయి. ఇదే ఘనవిజయం, పరమమోక్షం. (10-11)
నీ ప్రభువు పట్టు చాలా కఠినంగా ఉంటుంది. ఆయనే (మిమ్మల్ని) మొదటిసారి పుట్టించినవాడు. ఆయనే తిరిగి (మిమ్మల్ని మరణానంతరం) బ్రతికిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత వాత్సల్యుడు, సింహాసనాధీశుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు, తాను తలచిన కార్యం సాధించగల శక్తిమంతుడు. (12-16)
నీకు సైన్యాలు గురించిన సమాచారం అందిందా? ఫిరౌన్, సమూద్‌ల సైన్యా లను గురించి? (వారి సైనికశక్తి, అధికారం, పటాటోపాలేవీ వారిని దైవశిక్ష నుండి కాపా డలేక పోయాయి. కనువిప్పు కోసం ఈ రెండు సంఘటనలు చాలు.) (17-18)
ఈ అవిశ్వాసులు తిరస్కారతిమిరంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. దేవుడు వారిని చుట్టుముట్టి ఉన్నాడు. (ఆ సంగతి గ్రహించకుండా ఖుర్‌ఆన్‌ని తిరస్కరిస్తున్నారు.) ఈ ఖుర్‌ఆన్ మహిమాన్వితమైనది, “సురక్షిత” గ్రంథంలో ఉంది. (19-22)