కురాన్ భావామృతం/అల్-ఫాతిహా
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
1. ఫాతిహా (ప్రారంభం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 7)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ఈ అధ్యాయాన్ని “ఫాతిహా” (ప్రారంభం) అంటారు. అంటే దివ్యఖుర్‌ఆన్‌కు ఇది ప్రారంభ అధ్యాయం అని అర్థం. ఇది మహనీయ ముహమ్మద్ (సల్లం) దైవప్రవక్తగా నియమించబడిన ప్రారంభకాలంలో అవతరించింది. ఈ అధ్యాయం (సూరా)లో భక్తుడు తన ప్రభువును స్తుతించి తనకు రుజుమార్గం చూపమని విన్నవించుకుంటాడు. దానికి సమాధానంగా దేవుడు, నీవు కోరుతున్న రుజుమార్గం ఇదేనంటూ మొత్తం ఖుర్‌ఆన్‌ని భక్తుని ముందు ఉంచుతాడు.
- కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం.
- సమస్త లోకాలకు స్వామి, ప్రభువు అయిన అల్లాహ్‌కే సకల విధాల ప్రశంసలు శోభిస్తాయి.
- ఆయన కరుణామయుడు, కృపాసాగరుడు.
- పరలోక విచారణ దినానికి అధిపతి కూడా ఆయనే.
- దేవా! మేము నిన్నే ఆరాధిస్తున్నాము. నీ సహాయమే అర్థిస్తున్నాము.
- మాకు రుజు మార్గం చూపు.
- నీ ఆగ్రహానికి గురయి దారితప్పినవారి మార్గం కాకుండా, నీ అనుగ్ర హానికి పాత్రులయినవారి మార్గమే మాకు చూపించు.