కురాన్ భావామృతం/అల్-అలఖ్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
96. అలఖ్(గడ్డకట్టిన రక్తం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 19)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
(ముహమ్మద్!) సర్వసృష్టికర్త అయిన నీప్రభువు పేరు స్మరించి పఠించు. ఆయనే మానవుడ్ని గడ్డకట్టిన రక్తంతో సృజించాడు. చదువు. నీ ప్రభువు మహోన్నతుడు. ఎంతో ఉదారుడు. ఆయన మానవునికి కలం ద్వారా అతను ఎరగని జ్ఞానం నేర్పాడు. (1-5)
(కనుక మానవుడు అజ్ఞానిగా ప్రవర్తిస్తూ అపమార్గం పట్టడానికి) ఎంతమాత్రం వీల్లేదు. మానవుడు తననుతాను గొప్పవాణ్ణని, నిరపేక్షాపరుణ్ణని భావించి విర్రవీగు తున్నాడు. (కాని) అతను చివరికి నీ ప్రభువు సన్నిధికే మరలిపోవలసి ఉంది. (6-8)
ఒక దాసుడు ప్రార్థన చేస్తుంటే అతడ్ని నిరోధిస్తున్నవాడ్ని చూశావా? (ఆ దాసుడు) సన్మార్గంలో ఉంటే లేదా దైవభీతి గురించి ఉపదేశిస్తుంటే, దానిపై నీ అభిప్రాయం ఏమిటి? సత్యాన్ని నిరాకరించి ముఖం తిప్పుకుంటే, దాన్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి? దేవుడు (ఇదంతా) గమనిస్తున్నాడని అతనికి తెలియదా? (9-14)
(అతను ఎంత బెదిరించినా ఆ దాసునికి నష్టం కలిగించే శక్తి అతనికి) ఏమాత్రం లేదు. ఆ పాపాత్ముడు పచ్చి అబద్ధాలకోరు. (ఈ దుశ్చర్యలు) మానుకోకపోతే మేమతని ముంగురులు పట్టి ఈడుస్తాం.
అతను తన మద్దతుదారుల మూకను పిలుచుకోమను. మేము కూడా మా నరకదూతలను పిలుస్తాం. వద్దు. అతని మాట వినవద్దు. సాష్టాంగ పడి నీ ప్రభువు సాన్నిధ్యం కోసం కృషిచెయ్యి. (15-19)