Jump to content

కురాన్ భావామృతం/అబస

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

80. అబస (భృకుటి ముడిచాడు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 42)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అతను తన దగ్గరకు అంధుడొచ్చాడని భృకుటి ముడిచి ముఖం తిప్పుకున్నాడు. నీకేం తెలుసు? ఆ అంధుడు తననుతాను సంస్కరించుకుంటాడేమో; లేదా హితోపదే శాన్ని శ్రద్ధగా ఆలకిస్తాడేమో; హితోపదేశం అతనికి ప్రయోజనం కలిగిస్తుందేమో! (1-4)
(సత్యాన్ని) ఖాతరు చేయనివాడి పట్ల నీవంతగా ఆసక్తి చూపుతున్నావా? అతను దారికి రాకపోతే అందులో నీ దోషం ఏముంటుందని? (దేవునికి) భయపడుతూ నీ దగ్గరకు పరుగెత్తుకొచ్చిన వాడ్ని చూసి నీవు ముఖం తిప్పుకుంటున్నావు. (5-10)
(అలా) ఎంతమాత్రం (చేయ)కూడదు. ఇది హితోపదేశం. ఇష్టమైనవాడు దీన్ని స్వీకరిస్తాడు. ఇది మహోన్నతమైన, ప్రతిష్ఠాత్మకమైన, పవిత్రమైన పుటలలో లిఖించబడి ఉంది. అవి గౌరవనీయులైన పరిశుద్ధ లేఖకుల హస్తాలలో ఉంటాయి. (11-16)
మానవుడు నాశనమైపోను, ఎంతటి కృతఘ్నుడు! తనను దేవుడు ఎలాంటి పదార్థం తో పుట్టించాడో అతనికి తెలియదా? వీర్యబిందువుతో!
దేవుడు అతడ్ని సృష్టించి అతనికి ఒక జాతకం నిర్ణయించాడు. తర్వాత అతని కోసం జీవనపథాన్ని సులభతరం చేశాడు. చివరికి మృత్యువు కలిగించి అతడ్ని సమాధికి చేర్చుతున్నాడు. ఆ తరువాత దేవుడు తాను తలచుకున్నప్పుడు అతడ్ని మళ్ళీ బ్రతికించి లేపుతాడు. (17-22)
(అలా) ఏమాత్రం (చేయ)కూడదు. అతను దేవుడు ఆదేశించిన విధి నెరవేర్చ లేదు. మానవుడు తన ఆహారం వైపు దృష్టి సారించాలి. మేము నీటిని పుష్కలంగా కురిపించాము. తద్వారా నేలను చిత్రమైన రీతిలో చీల్చి అందులో నుంచి ధాన్యం, ద్రాక్ష, కూరగాయలు, ఆలివ్‌, ఖర్జూర చెట్లు, దట్టమైన తోటలు, రకరకాల పండ్లు, పచ్చిక మొలకెత్తించాం. మీకు, మీపశువులకు జీవనసామగ్రిగా, ప్రాణాధారంగా ఈ ఏర్పాట్లన్నీ చేశాం. (23-32)
చివరికి గూబలు పగలగొట్టే (ప్రళయశంఖా) రావం ఉధృతమైనప్పుడు... ఆరోజు మానవుడు (అదిరిపోయి) తన సోదరులు, తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని వదలి పరుగు లంకించుకుంటాడు. ప్రతి ఒక్కడిపై భయంకరమైన ఆపద వచ్చి పడుతుంది. అప్పుడు ఏ ఒక్కడికీ తన గురించి తప్ప ఇతరుల గురించిన ఆలోచనే రాదు. (33-38)
ఆరోజు కొందరి ముఖాలు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి. ఆ ముఖాలలో చిరునవ్వులు, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. (వీరు సత్యాన్ని విశ్వసించిన సజ్జనులై ఉంటారు.) మరికొందరి ముఖాలు మట్టి కొట్టుకొని, నల్లగా మాడిపోయి ఉంటాయి. వీరు సత్యాన్ని నిరాకరించిన దురాత్ములయి ఉంటారు. (39-42)