Jump to content

కురాన్ భావామృతం/అద్-దహ్ర్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

76. దహ్ర్‌ (సమయం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 31)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
నిరాఘాటంగా సాగుతున్న కాలవాహినిలో మానవునికి తానొక గడ్డిపోచ విలువ కూడా లేనివాడిగా ఉండిన సమయం ఎప్పుడైనా ఎదురయిందా? మేము మానవుడ్ని పరీక్షించడానికి ఒక మిశ్రమబిందువుతో పుట్టించాం. దానికోసం మేమతడ్ని వినేవాడిగా, చూసేవాడిగా రూపొందించాం. అతనికి మేము సన్మార్గం కూడా చూపించాం. అతను సన్మార్గం అవలంబించి (మాపట్ల) కృతజ్ఞుడై ఉన్నా లేక (అవిశ్వాస వైఖరి అవలంబించి) కృతఘ్నుడైపోయినా (అంతా అతని ఇష్టాయిష్టాలపై వదలిపెట్టాము). (1-3)
అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళు, గుదిబండ, భగభగమండే అగ్ని సిద్ధపరచి ఉంచాం. (సత్యాన్ని విశ్వసించిన) సజ్జనులు (స్వర్గంలో) కర్పూరజలం కలిపిన మద్య పానం సేవిస్తారు. ఇదొక సెలయేరు. దైవభక్తులు దీని నీటితోపాటు మద్యం సేవిస్తారు. వారు తాము కోరినచోట (కూర్చొని) సులభంగా దాని శాఖను తీసుకుంటారు. (4-6)
(ఆ సజ్జనుల లక్షణాలు ఇలాఉంటాయి:) వారు తమ మొక్కుబడులు నెరవేరుస్తారు. నలుదిశలా ఆపద వ్యాపించే రోజుపట్ల వారు భయపడుతుంటారు. దేవుని మీద ఉండే ప్రేమపారవశ్యంతో నిరుపేదలకు, అనాథలకు, ఖైదీలకు అన్నదానం చేస్తారు. (వారు అన్నార్తులతో అంటారు:) “మేము దేవుని కోసం అన్నదానం చేస్తున్నాం. అంతేగాని మీనుండి ప్రతిఫలంగాని, కృతజ్ఞతలుగాని ఆశించడం లేదు. మేమసలు ఘోరమైన ఆపద తెచ్చిపెట్టే సుదీర్ఘ దినం గురించి దేవునికి భయపడుతున్నాం.” (7-10)
కనుక దేవుడు వారిని ఆరోజు కీడునుండి కాపాడి ఉల్లాసం, ఉత్సాహాలను అనుగ్ర హిస్తాడు. (కష్టాల్లో) సహనం వహించినందుకు ప్రతిఫలంగా వారికి స్వర్గవనాలు, పట్టు వస్త్రాలు ప్రసాదిస్తాడు. వారక్కడ అద్భుతమైన ఆసనాలపై మెత్తటి దిండ్లకానుకొని కూర్చొనిఉంటారు. వారికి ఎండబాధగాని, చలిబెడదగాని ఉండదు. స్వర్గవృక్షాలు వారికి నీడనిస్తాయి. వాటిపండ్లు వారికి అనుక్షణం అందుబాటులో ఉంటాయి. (11-14)
వారిముందు వెండిపాత్రలు, గాజుగ్లాసులు తెచ్చిపెడ్తారు. గాజుగ్లాసులు కూడా వెండిలా మెరిసిపోతుంటాయి. అవన్నీ సరైనలెక్క ప్రకారం నింపబడిఉంటాయి. వారికి అక్కడ సొంటి కలిపిన మధుపాత్రలు అందించబడతాయి. ఇదికూడా స్వర్గంలో పారే ఒక సెలయేరు. దీన్ని సల్‌సబీల్‌ (సుమధుర మద్యపానం) అంటారు. (15-18)
వారిసేవ కోసం నిత్యబాలలు అటూఇటూ పరుగిడుతుంటారు. నీవా పిల్లల్ని చూస్తే చెదరిన ఆణిముత్యాల్లా కన్పిస్తారు. నీకక్కడ ఎటుచూసినా రంగ రంగ భోగ భాగ్యాలు, మహోన్నత సామ్రాజ్య వైభవాలు కన్పిస్తాయి. వారి దేహాలపై పల్చటి పట్టుపీ తాంబరాలు, బంగారు జల్తారువస్త్రాలు ఉంటాయి. వారు వెండి కంకణాలు ధరించి ఉంటారు. వారి ప్రభువు వారికి ఎంతో పరిశుద్ధమైన మద్యం ప్రసాదిస్తాడు. “ఇదీ మీ ప్రతిఫలం. మీ కృషికి తగిన విలువ, ఆదరణలు లభించాయి.” (19-22)
(ముహమ్మద్‌!) మేమే ఈ ఖుర్‌ఆన్‌ని (సందర్భానుసారం) కొద్దికొద్దిగా చేసి నీపై అవతరింపజేశాం. కనుక (ఈమార్గంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమిస్తూ) నీ ప్రభు వాజ్ఞతో సహనం వహించు. వారిలో ఏ దురాత్ముడు లేక సత్యతిరస్కారి చెప్పే మాటలు ఏమాత్రం వినకు. ఉదయం, సాయంత్రం నీ ప్రభువు నామం స్మరిస్తూ ఉండు. రాత్రివేళ కూడా ఆయన సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉండు. రాత్రివేళ చాలా పొద్దుపోయే వరకు సుదీర్ఘంగా ఆయన (పవిత్రతను) స్మరిస్తూ ఉండు. (23-26)
వీరు త్వరగా లభించే ఐహిక వస్తువులపై అమితమైన వ్యామోహం పెంచు కున్నారు. ముందు రాబోయే భారమైన (సంకట) దినాన్ని విస్మరించారు. మేమే వారిని పుట్టించి వారి శరీరాలను పటిష్ఠపరిచాము. మేము తలచుకుంటే వారిని (హత)మార్చి వారి స్థానంలో ఇతరుల్ని తీసుకురాగలం ఇదొక హితోపదేశం. ఇష్టమైనవారు (దీనిద్వారా) తమ ప్రభువు వైపు వెళ్ళేమార్గం అవలంబించవచ్చు. దేవుడు తలచుకోనంతవరకు, మీరు తలచుకున్నంత మాత్రాన ఏమీకాదు. దేవుడు సర్వంఎరిగినవాడు, మహా వివేకవంతుడు. ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యఛాయలోకి తీసుకుంటాడు. దుర్మార్గుల కోసం ఆయన దుర్భర (నరక) యాతనలు సిద్ధపరచి ఉంచాడు. (27-31)