Jump to content

కురాన్ భావామృతం/అజ్-జారియా

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

51. జారియాత్‌ (గాలి దుమారం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 60)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
దుమారాన్ని లేపే గాలుల సాక్షి! తరువాత నీటితో నిండిన మేఘాలను పైకెత్తేవి, ఆతర్వాత నెమ్మదిగా నడిచేవి, ఆపై ఓ మహాకార్యాన్ని (వర్షాన్ని) విభజించేవి!! ఏవిష యాన్ని గురించి మిమ్మల్ని భయపెట్టడంజరుగుతున్నదో అది నగ్నసత్యం. కర్మ విచా రణ తప్పక జరుగుతుంది. విభిన్నరూపాలలో కన్పించే ఆకాశం సాక్షి! మీ అభిప్రాయాలు విభిన్నరకాలుగా ఉన్నాయి. సత్యానికి విముఖుడైనవాడే దాన్ని తిరస్కరిస్తాడు. (1-9)
అనుమానాలతో కూడిన నిర్ణయాలు తీసుకునేవారు నాశనంగాను! వారు అజ్ఞా నాంధకారంలో తచ్చాడుతూ ఏమరుపాటుకు లోనైఉన్నారు. పైగా అసలీ విచారణ దినం ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. వారిని నరకాగ్నిలో పడేసి మాడ్చివేసే దినం వస్తుంది (అని చెప్పు. అప్పుడు దైవదూతలు వారితో) “ఇక చవిచూడండి మీ దురాగతాల రుచిని. మీరు తొందరపెడ్తుండిన విషయం ఇదే” (అని అంటారు). (10-14)
ఆరోజు దైవభీతిపరులు స్వర్గవనాలలో చెలమల మధ్య (హాయిగా) ఉంటారు. వారు తమ ప్రభువు ప్రసాదించినదాన్ని అమిత సంతోషంతో స్వీకరిస్తుంటారు. వారు ఈ రోజు రాకపూర్వం నీతిమంతులుగా ఉండేవారు. రాత్రివేళల్లో చాలా తక్కువగా నిద్రించే వారు. ప్రతి రోజూ తెల్లవారుజామున లేచి (తమ ప్రభువును) క్షమాపణ కోరుకునేవారు. వారి సంపదలో అర్థించేవారికి, అర్థించనివారికి కూడా హక్కుండేది. (15-19)
విశ్వసించేవారికి ధరణిపై అనేక నిదర్శనాలున్నాయి. స్వయంగా మీ (అస్తిత్వం)లో కూడా ఉన్నాయి. మీరీ విషయాన్ని గురించి యోచించరా? (20-21)
మీ ఉపాధి సామగ్రి, మీకు వాగ్దానం చేయబడుతున్న సమస్తం ఆకాశంలోనే ఉన్నాయి. కనుక భూమ్యాకాశాల ప్రభువు సాక్షి! ఇది సత్యం. మీరు మాట్లాడగలుగు తున్నంత నిజంగా ఇది సత్యం. (22-23)
ఇబ్రాహీం గౌరవనీయ అతిథుల సంగతి నీకేమైనా చేరిందా? వారతని దగ్గరికొచ్చి సలాం అన్నప్పుడు అతను “మీక్కూడా సలాం, వీళ్లెవరో కొత్తవాళ్లులా ఉన్నారే!”అన్నాడు.
అతను మెల్లిగా తన గృహస్థుల దగ్గరికెళ్ళాడు. తర్వాత ఒక బలిసిన ఆవుదూడను కాల్చి తెచ్చి అతిథుల ముందుంచాడు. (అతిథులు దాన్ని ముట్టుకోకపోవడం చూసి) “మీరు తినరేమిటీ?” అనడిగాడతను. తరువాత అతను అతిథుల (వింత ప్రవర్తన) పట్ల మనసులో భయపడ్డాడు. అప్పుడు వారు భయపడకండని ధైర్యం చెప్పారు. (ఆ తర్వాత) వారతనికి బుద్ధి కౌశల్యంగల కొడుకు పుడ్తాడని శుభవార్త విన్పించారు. (24-28)
అతని భార్య ఈమాట విని నెత్తీ నోరు బాదుకుంటూ “ముసలిదాన్ని, గొడ్రాలిని (నాకు సంతానమేమిటీ!)” అన్నది. దానికా అతిథులు “నీ ప్రభువు ఇలాగే అన్నాడు. ఆయన ఎంతో వివేకవంతుడు, సర్వం ఎరిగినవాడు” అన్నారు. (29-30)
“దైవదూతలారా! మీరు ఏ మహాకార్యం కోసం వచ్చారు?” అనడిగాడు ఇబ్రాహీం. అప్పుడు దైవదూతలు “మేమొక అపరాధ జాతి వైపు పంపగా వచ్చాం. ఆజాతి మీద కాల్చిన మట్టిరాళ్ళు కురిపించాలని ఆజ్ఞ అయింది. నీ ప్రభువు దృష్టిలో హద్దుమీరిన వారికోసం ఇవి ప్రత్యేకంగా ముద్రలు వేయబడిన రాళ్ళు” అని చెప్పారు. (31-34)
ఆ తర్వాత మేమా పట్నంలో ఉన్న విశ్వాసుల్ని బయటికి తీశాం. అక్కడ మాకు ముస్లింలకు చెందిన ఒక్క ఇల్లు మాత్రమే కనిపించింది. ఆ తర్వాత మేము ఘోరమైన శిక్షకు భయపడేవారి కోసం అక్కడ ఒక చిహ్నం (అవశేషాలు) వదలిపెట్టాం. (35-37)
మూసా గాధలో (కూడా గుణపాఠం ఉంది). మేమతనికి స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఫిరౌన్‌ దగ్గరకు పంపినప్పుడు, అతను అధికారగర్వంతో విర్రవీగుతూ “ఇతనేదో మాంత్రికుడై ఉంటాడు. లేదా పిచ్చివాడై ఉంటాడు” అన్నాడు. చివరికి మేము అతడ్ని, అతని సైన్యాన్ని పట్టుకొని సముద్రంలో విసిరేశాం. అతడు నిందితుడై (చరిత్రలో) నిలచి పోయాడు. ఆద్‌జాతి (చరిత్రలోనూ గుణపాఠముంది). మేమా జాతిప్రజల పైకి అశుభకర మైన గాలి పంపాం. అది ప్రతివస్తువునూ సర్వనాశనం చేస్తూ వీచింది. (38-42)
సమూద్‌జాతి (చరిత్రలోనూ). “(మీరు సత్యం స్వీకరించడానికి సిద్ధంగాలేకపోతే) ఒక నిర్ణీతకాలం వరకు భోగభాగ్యాలు అనుభవించండి. (తర్వాత మా శిక్ష కోసం ఎదురు చూడండి)” అని వారిని హెచ్చరించాం. కాని వారీ హెచ్చరిక ఖాతరు చేయకుండా తమ ప్రభువాజ్ఞను ధిక్కరించారు.
చివరికి వారు చూస్తుండగానే హఠాత్తుగా విరుచుకుపడే విపత్తు వచ్చి వారిని చుట్టుముట్టింది. దాంతో వారికి మళ్ళీ లేచేశక్తి కూడా లేకుండా పోయింది. వారు తమనుతాము కాపాడుకోలేక పోయారు. వారికి పూర్వం మేము నూహ్‌ జాతిని కూడా తుదముట్టించాం. కారణం వారు పరమ దుర్మార్గులైపోయారు. (43-46)
మేము మా స్వశక్తితోనే ఆకాశాన్ని నిర్మించాం. మాకా సామర్థ్యం ఉంది. భూమిని కూడా మేమే (మీకు నివాసయోగ్యంగా) పరిచాము. (మీకు అనువైనదిగా) పరచడంలో మేమెంత నిపుణులమో చూడండి. మీరు గుణపాఠం నేర్చుకుంటారని మేము ప్రతి వస్తువునీ (జీవినీ) జంటలు జంటలుగా సృష్టించాము. (47-49)
“కనుక దేవుని (మార్గం) వైపునకు పరుగెత్తండి. నేను ఆయన తరఫున మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చిన సందేశహరుడ్ని. దేవునితో పాటు ఇతర శక్తుల్ని దైవాలుగా ఆరాధించకండి. నేనాయన తరఫున మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చిన సందేశహరుడ్ని.” (50-51)
వీరికి పూర్వం గతజాతులక్కూడా తమవద్దకు వచ్చిన దైవప్రవక్తను మాంత్రికుడనో, పిచ్చివాడనో ఆరోపించారు. ఇది పూర్వంనుంచీ ఇలాగే సాగుతూవస్తోంది. ఈవిషయంలో వీరంతా పరస్పరం రాజీకివచ్చారా ఏమిటి? లేదు. వీరసలు తలబిరుసు జనం. (52)
కనుక ప్రవక్తా! నీవు వారినుండి ముఖం తిప్పుకుంటే నీ దోషం ఏమీలేదు. అయితే హితబోధ చేస్తూఉండు. విశ్వసించేవారికి హితబోధ ప్రయోజనం కల్గిస్తుంది. (53-55)
నేను మానవుల్ని, జిన్నుల్ని నన్ను ఆరాధించడానికి తప్ప మరే లక్ష్యంతో పుట్టించ లేదు. నేను వారినుండి ఉపాధి కోరడంలేదు. నాకు తిండి పెట్టమని అడగడం లేదు. దేవుడే అందరి ఉపాధిప్రదాత. ఆయన మహాబలుడు, అద్భుత శక్తిసంపన్నుడు. (56-58)
కనుక దుర్మార్గానికి పాల్పడినవారి భాగానిక్కూడా వారి మిత్రులభాగానికి లభించిన నటువంటి యాతనే సిద్ధంగాఉంది. దానికోసం వీరు తొందరపడనవసరం లేదు. చివరికి అవిశ్వాసులకు తమకు భయపెట్టబడుతున్న రోజు సర్వనాశనం తప్పదు. (59-60)