మహాప్రస్థానం/జ్వాలాతోరణం
స్వరూపం
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
సర్గనరకములఛాయా దేహళి,
తెలి, నలితలుపులు తెరచి, మూసుకొని-
సర్గవిలయ హేమంతవసంత
ధాంతకాంతి విక్రాంత వెళలో,
చావుపుట్టుకల పొలిమేరలలో
ఆవులించెనొక చితాగ్ని కుండం:
అనాధజీవులసమాధుల్నీ
అఘోరించిఘోషించాయి:
ఇదేమి: లోకం హిరణ్యనేత్రుని
పదాఘాతమునప్రతిధనించగ,
కురుక్షేత్రమునక్రుద్ధవృకోదరు
గదాఘాతమునగజగజలాడగ,
జాతిజాతి నిర్ఘాత పాతనం
ఘాతహేతువై, కాల్కేతువై,
అదెసంవర్తపు తుపానుమేఘం
తొలిగర్జించిన తూర్యవిరావం:
ప్రదీప్తకీలాప్రవాళమాలా
ప్రపంచవేలాప్రసారములలో,
మిహిరవాజితతి: మఖవ ధనుర్ద్యుతి:
పుడమికినేడే పుట్టినరోజట: