మహాప్రస్థానం/నీడలు
Appearance
(నీడలు నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
చూడు, చూడు, నీడలు:
నీడలు, పొగ మేడలు:
యుగయుగాల దోపిడిలో,
నరనరాలరాపిడిలో---
పగమారిన,
పొగచూరిన
శాసనాలజాడలు:
జాలిజార్చుగోడలు:
చూడు, చూడు, నీడలు:
నీడలు, పొగ మేడలు:
చూడు, చూడు, నీడలు:
పేదవాళ్ళవాడలు:
నరనరాలవేదనలో
తరతరాలరోదనలో--
బక్కచిక్కి:
బిక్కచచ్చి
పడినబతుకు గోడలు:
పాడుబడ్డవాడలు:
చూడు, చూడు, నీడలు:
పేదవాళ్ళవాడలు:
చూడు, చూడు, నీడలు:
పూలులేని కాడలు
తరతాలచెరసాలల
రకరకాలతెరచాటుల
పొదిగిటిలో
ఒదిగిలిపడు
నిర్భాగ్యపునీడలు:
ఎడారిలోఓడలు:
చూడు, చూడు, నీడలు:
పూలులేని కాడలు:
చూడు, చూడు, నీడలు:
పీడలతోక్రీడలు:
చూడు, చూడు, నీడలు:
సూర్యునితోక్రీడలు:
సూర్యునిసూదులతో
క్రీడలాడునీడలు: