Jump to content

మహాప్రస్థానం/వ్యత్యాసం

వికీసోర్స్ నుండి
(వ్యత్యాసం నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ
మహాప్రస్థానం
1. కొంపెల్ల జనార్ధనరావు కోసం
2. మహాప్రస్థానం (కవిత)
3. జయభేరి
4. ఒకరాత్రి
5. గంటలు
6. ఆకాశదీపం
7. ఋక్కులు
8. అవతారం
9. బాటసారి
10. ఆశాదూతలు
11.
12. శైశవగీతి
13. అవతలిగట్టు
14. సాహసి
15. కళారవి
16. భిక్షువర్షీయసి
17. ఒకక్షణంలో...
18. పరాజితులు
19. ఆః!
20. ఉన్మాది
21. స్విన్ బర్న్ కవికి
22. అద్వైతం
23. వాడు
24. అభ్యుదయం
25. వ్యత్యాసం
26. మిథ్యావాది
27. ప్రతిజ్ఞ
28. చేదుపాట
29. కవితా! ఓ కవితా!
30. దేశ చరిత్రలు
31. నవ కవిత
32. మానవుడా!
33. సంధ్యాసమస్యలు
34. జ్వాలాతోరణం
35. దేనికొరకు
36. కేక
37. నిజంగానే
38. నీడలు
39. గర్జించురష్యా!
40. పేదలు
41. జగన్నాథుని రథచక్రాలు

అదృష్టవంతులు మీరు,

వెలుగును ప్రేమిస్తారు,

ఇరులను ద్వేషిస్తారు,

మంచికీ చెడ్డకీ నుడుమ

కంచుగోడలున్నాయి మీకు.

మంచి గదిలోనే

సంచరిస్తాయి మీ ఊహలు.

ఇదివరకే ఏర్పడిందా గది.

అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం.

నిశ్చల నిశ్చితాలు మీవి.

మంచిని గురించి,

మర్యాద, మప్పింతం గురించి,

నడతా, నాణ్యం, విలువల విషయం

నిశ్చలం నిశ్చతాలు మీవి.

మీ కన్నుల చూపులు సరళ రేఖలో!

రేఖ చెదిరితే గొల్లుమని పోతారు.

రేఖ కవతలి వారంతా నేరగాళ్ళు.

రేఖను రక్షించడానికే

న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు,

రెసాలలు, ఉరికొయ్యలు,

రేఖను కాపాడక తీరదు.

అభ్యాగులం మేము,

సరిహద్దులు దొరకని

సంధ్యలలో మా సంచారం.

అన్నీ సమస్యలే సందేహాలే మాకు.

వెలుగులోని చీకట్లే,

ఇరులలోని మిణుగురులే చూస్తాం.

నూరు దోషాలలోని ఒక సుగుణం,

నూరు పుణ్యాలలోపని ఒక ఘోరం!

వ్యత్యాసాలూ, వ్యాఘాతాలే

అడుగడుగునా మాకు.

మా వంట మే మే వండుకోవాలి.

ఒక్కొక్కమారు విస్తరే దొరకదు,

జీవితపు సన్నని సందులకే

ఆకర్షణ మాకు.

మా దశష్టిది వర్తుల మార్గం

ఆద్యంత రహితం.సంధ్యా జీవులం, సందేహ భావులం

ప్రశ్నలే, ప్రశ్నలే.

జవాబులు సంతృప్తిపరచవు

మాకు గోడలు లేవు.

గోడలను పగులగొట్టడమే మా పని.

అలజడి మా జీవితం.

అందోళన మా ఊపిరి.

తిరుగబాటు మా వేదాంతం.

ముళ్ళూ, రాళ్ళూ, అవాంతరాలెన్ని ఉన్నా

ముందు దారి మాది

ఉన్న చోటు చాలును మీకు.

ఇంకా వెనక్కి పోతామంటారు కూడా

మీలో కొందరు.

ముందుకు పోతాం మేము.

ప్రపంచం మా వెంట వస్తుంది.

తృప్తిగా చచ్చిపోతారు మీరు.

ప్రపంచం మిమ్మల్ని మరిచి పోతుంది.

అభిప్రాయాల కోసం

బాధలు లక్ష్యపెట్టనివాళ్ళు

మాలోకి వస్తారు.

అభిప్రాయాలు మార్చుకోని

సుఖాలు కామించే భళ్ళు

మీలోకి పోతారు.