మహాప్రస్థానం/అభ్యుదయం
స్వరూపం
(అభ్యుదయం నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఏవో,
ఏవేవో, ఏవేవో
ఘొషలు వినబడుతున్నాయ్!
గుండెలు విడిపోతున్నాయ్!
ఎవరో,
ఎవరెవరో, ఎవరెవరో
తల విరబోసుకు
నగ్నంగా నర్తిస్తున్నారు, భయో
ద్విగ్నంగా వర్తిస్తున్నారు!
అవిగో!
అవి గవిగో! అవి గవిగో!
ఇంకిన, తెగిపోయిన, మరణించిన
క్రొన్నెత్తురు! విపంచికలు! యువయోధులు!
నేడే,
ఈనాడే, ఈనాడే---
జగమంతా బలివితర్ది!
నరజాతికి పరివర్తన!
నవజీవన శుభసమయం! అభ్యుదయం!