మహాప్రస్థానం/గర్జించురష్యా!

వికీసోర్స్ నుండి
(గర్జించురష్యా! నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search
శ్రీశ్రీ
మహాప్రస్థానం
1. కొంపెల్ల జనార్ధనరావు కోసం
2. మహాప్రస్థానం (కవిత)
3. జయభేరి
4. ఒకరాత్రి
5. గంటలు
6. ఆకాశదీపం
7. ఋక్కులు
8. అవతారం
9. బాటసారి
10. ఆశాదూతలు
11.
12. శైశవగీతి
13. అవతలిగట్టు
14. సాహసి
15. కళారవి
16. భిక్షువర్షీయసి
17. ఒకక్షణంలో...
18. పరాజితులు
19. ఆః!
20. ఉన్మాది
21. స్విన్ బర్న్ కవికి
22. అద్వైతం
23. వాడు
24. అభ్యుదయం
25. వ్యత్యాసం
26. మిథ్యావాది
27. ప్రతిజ్ఞ
28. చేదుపాట
29. కవితా! ఓ కవితా!
30. దేశ చరిత్రలు
31. నవ కవిత
32. మానవుడా!
33. సంధ్యాసమస్యలు
34. జ్వాలాతోరణం
35. దేనికొరకు
36. కేక
37. నిజంగానే
38. నీడలు
39. గర్జించురష్యా!
40. పేదలు
41. జగన్నాథుని రథచక్రాలు

గర్జించురష్యా:

గాండ్రించురష్యా:

పర్జన్యశంఖంపలికించు రష్యా:

దౌర్జన్యరాజ్యం ధంసించురష్యా:

లేలే, రష్యా:

రారా, రష్యా:

రష్యా: రష్యా: రష్యా: ఓ రష్యా:

వ్యక్తిసతస్సిద్ధ సాతంత్రదాతా:

పతితనిర్గతిక ప్రపంచత్రాతా:

బావికలసర్ణభవన నిర్మాతా:

లేలేలేరష్యా:

రారారారష్యా:

రష్యా: రష్యా: రష్యా: రష్యా

పుష్కిన్, గోగోల్, షెకోవ్, టాల్‌స్టాయ్,

డోస్టోయ్‌వస్కీ, గోర్కీ, కూప్రిన్

శిల్పసమ్రాట్టులై

జీవితంమథియించి,

పాపపంకం నుండి పద్మాలుపుట్టంచి,

కార్మికసర్గాన్ని కలగన్నరష్యా:

రష్యా: రష్యా: రష్యా: నా రష్యా:

మార్క్స్, ఎంగెల్స్ మహాప్రవక్తలై

మానవపురోగమన మార్గాలుతెరువగా

లెనిన్ తపస్సు.

స్టాలిన్ సేద్యం

జలించిన, ఫలించిన సముజ్జలతేజం:

యునైటెడ్‌సోవియట్ సోషలిష్ట్‌రాజ్యం

సాతంత్రశత్రువుల గుండెల్లోబల్లెం:

వరపీడనాపరుల ప్రాణాలఅభైరవి:

రారారా, రష్యా:

లేలేలే, రష్యా:

రష్యా: రష్యా: రష్యా: ఓ రష్యా:

ఈఅగ్ని వర్షాలు,

ఈరక్తపాతాలు,

ఎలాగూవచ్చాయి, ఏమయితేకానీ:

ఈసవన రంగంలో ఎగరనీజీవాలు:

ఈసమయం తుది చూడక

ఇకనిలిచిపోరాదు:

తిరుగులేనిప్రతిజ్ఞ తీసుకోరష్యా:

పెట్టుబడికూటాలు కట్ట కడుతున్నాయి:

కుట్రలు, కుహకం చెలరేగుతున్నాయి

అసత్యప్రచారపు రేడియో బాకా:

రాజకీయాలలోరంగుల వేషాలు,

మరఫిరంగులు తెచ్చిమందిచ్చి రష్యా:

విమానబాహువులువిసురుతూ, రష్యా:

అనంతప్రపంచం అంతటానీవై

నీగొడుగు నీడల్ని సాగించురష్యా:

సతంత్రత, సమానత సాధించురష్యా:

రష్యా: రష్యా: రష్యా: ఓ రష్యా:

సుప్తకంకాళాలు మేలుకొంటున్నాయి:

ప్రపంచపడగెత్తి బుసకొట్టిలేచింది:

కార్మికులు, కర్షకులు, తాడితులు, పీడితులు

---

కెరటాలుగాపొంగి తిరగబడుతున్నారు:

ప్రపంచంనీ కోసం పరిపకంగా వుంది:

కోటిగొంతులునిన్ను కోరి రమ్మన్నాయి:

కోటిచేతులు నిన్నుకౌగలిస్తున్నాయి:

సైఅంటూ రష్యా:

జైఅంటూ రష్యా:

లేలేలేరష్యా:

రారారారష్యా:

రష్యా: రష్యా: రష్యా: ఓ

రష్యా: