మహాప్రస్థానం/నిజంగానే
Appearance
(నిజంగానే నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
నిజంగానేనిఖిలలోకం
నిండుహర్షంవహిస్తుందా?
మానవాళికినిజంగానే
మంచికాలంరహిస్తుందా?
నిజంగానే, నిజంగానే
నిఖిలలోకంహసిస్తుందా?
దారుణద్వేషాన్ని పెంచే
దానవత్వంనశిస్తుందా?
బానిసలసంకెళ్ళు బిగిసే
పాడుకాలంలయిస్తుందా?
సాధుసత్వపుసోదరత్వపు
సాదుతత్వంజయిస్తుందా?
జడలువిచ్చిన, సుడులురెచ్చిన
కడలినృత్యం శమిస్తుందా?
నడుమతడబడి, సడలి, ముడుగక
పడవతీరం క్రమిస్తుందా?
నిజంగానే, నిజంగానే?