మహాప్రస్థానం/ఋక్కులు
స్వరూపం
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
కుక్కపిల్లా,
అగ్గిపుల్లా,
సబ్బుబిళ్లా-
హీనంగా చూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!
రొట్టెముక్కా,
అరటితొక్కా,
బల్లచెక్కా-
నీవైపే చూస్తూ ఉంటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపుగొళ్లెం,
హారతిపళ్లెం,
గుర్రపుకళ్లెం-
కాదేదీ కవిత కనర్హం!
ఔనౌను శిల్పమనర్ఘం!
ఉండాలోయ్ కవితావేశం!
కానీవోయ్ రస నిర్దేశం!
దొరకదటోయ్ శోభాలేశం!
కళ్లంటూ ఉంటే చూసి,
వాక్కుంటే వ్రాసి!
ప్రపంచమొక పద్మవ్యూహం!
కవిత్వమొక తీరని దాహం!