లోకోక్తి ముక్తావళి/సామెతలు-ర
స్వరూపం
లోకోక్తి ముక్తావళి | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
య
2879 యజ్ఞానికి యేమి యత్నమంటె కత్తులూ కఠార్లూ
2880 యదార్ధానికి కేడు చుట్లెందుకు
2881 యుగాలనాటిఒ యుధిష్టరుడు
2882 యోగికి భోగికి రోగికి నిద్రలేదు
ర
2883 రంకాడనేర్చినమ్మ బొంకాడనేరదా
2884 రంభచెక్కిలిగొట్టి రాత్నందెచ్చినట్లు
2885 రత్నాలన్నీ ఒక చోట నత్తగుల్లలన్నీ ఒక్కచోట
2886 రత్నాలుతినే పక్షికి రత్నాలు, రాళ్లు తినే పక్షికి రాళ్లు
2887 దక్షించిన వాణ్ణి భక్షించనా
2888 రత్నమురుప్పి గాజునుకోరినట్లు
రా
2889 రాగంరానివాడు రోగంలెనివాడు లేడు
2890 రాగలశని రామెశ్వరంపోయినా తప్పదు
2891 రాగానకునేను అందానకు నాఅప్ప
2892 యాచనదు:ఖ హేతువు
2893 యధాయధలందరు వెల్లువనుపోగా పుల్లాకు నాపనియేమి అన్నదట
2894 రాచపీనుగు తోడులేకుండా చావదు
2895 రాజాంకాయ పిచ్చికొండ యానున్న గార్కి సభాకంపం