లోకోక్తి ముక్తావళి/సామెతలు-జ

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

1405 చేసిన చేష్ట లెవరెరుగరుగాని కోసినముక్కు అందరూ చూచినారట

1406 చేసిన పాపము చెప్పితే తీరుతుంది

1407 చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ

1408 చేసేది బీదకాపురం వచ్చేది రాచరోగాలు

1409 చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటె కోపాలు

1410 చేసేవి శివపూజలు దూరేవి దొమ్మరిగుడిసెలు

1411 చిద్రమునకు చీడపేలు దరిద్రమునకు తలపేలు

1412 జంగానికి బిడ్డలు పుట్టితే వూరికి వుపాధి

1413 చెట్టైవంగనిది మ్రానై వంగునా?

1414 చెడ్డ కాపరానికి ముప్పేమిటి చంద్రకాంతాలు వండేపెండ్లామాఅంటే, ఐన అప్పకి అంతమేమిటి అవేవండుతానురా మగడా అన్నదిట

1415 చెట్టు వేసినవాడు నీళ్ళు పొయ్యడా?

1416 చుక్కలూళ్లో చక్కిలాలు తేబోయునాడు

1418 జగమెరిగిన బ్రాహ్మణునకు జంద్యమేల

1419 జడ్డిగములో మిడతపోటు

1420 జయింపుండేవరకు భయంలేదు

1421 జరిగేమటుకు జయభేరి జరక్కపోతే రణభేరి 1422 జాతికొద్దిబుద్ధి కులముకొద్ది ఆచారము

1423 జనుములోపాముపోతే పాతికనష్టం

1422 జానెదు యింట్లో మూరెడు కర్ర

జి

1425 జీతగాణ్ణీ తెచ్చుకుంటే యింటికిమగడైనట్లు

1426 జిల్లేడుచెట్టుకునకు పారుజాతం పుట్తునా

1427 జీతములేనినౌకరు కోపంలేనిదొర

1428 జీతముభత్యములేకుండా తోడేలు మేకల కాస్తానన్నదట

1429 జీవన్మృతుడు మృతజీవుడు

1430 జెముడుకు కాయలున్నవా నీడవున్నదా

1431 జోగీజోగీరాచుకుంటే బూడిద రాలినట్లు

1432 జ్ఞాతిగుర్రు అరటికర్రు వదలదు

1433 జ్వరజిహ్వకు పంచదార చేదైనట్లు

1434 జొన్నపెరిగితే జాడు వరిపెతిగితేవడ్లు

135 జీవరత్నము యిత్తడిని పొదిగితే రత్నానికేమిలోపము

1436 జంగానికిబిడ్డలు పుట్టితే వూరికివుపాది

1437 డబ్బు పాపిష్టిది

1438 డబ్బు యివ్వనివాడు ముందు పడవెక్కినట్లు

1439 డబ్బులెనివాడు డుబ్బుకు కొరగాడు

1440 డబ్బులేనివానికి బోగముది తల్లివరస