Jump to content

లోకోక్తి ముక్తావళి/సామెతలు-ద

వికీసోర్స్ నుండి


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


1714 తలగేటిజున్ను

1715 తనవారిని యెరగని మొఱ్ఱితెడ్డు ఉన్నదా

1716 తాడు అని యెత్తిపారవెయ్యనూ కూడదు పాము అని దాటనూ కూడదు

1717 తిట్టేనోరు కొట్టినా వూరుకుండదు

1718 తింతలు తూతింవే తూనీతానే తాత్తి తూతిక తాతకతోనా దొందుదొందె

1719 దండమయ్యా బాపనయ్యా అంటే మీతండ్రిపాత బాకీ యిచ్చి పొమ్మన్నడట

1720 దండుగకు రూపాయలు తద్దినానికి కూరలు పోగుకాకుండా పోవు

1721 దండుగ భాగవరము

1722 దంపినమ్మకు బొక్కినదే కూడు

1723 దంపుళ్ళ పాటకు దండుగ లేదు

1724 దండులోకి పోతే రెంటిలొ ఒకటి

1725 దగ్గితే నిలవనిమొక్క తుమ్మితే నిలచునా

1726 దగ్గిరకు పిలిచి దాసరీ నీకన్నులొట్టా

1727 దత్తతమీద ప్రేమా దాయాదిమీద ప్రేమా

1728 దద్తపుత్ర శోకము

1729 దమ్మిడీ గుర్రం దుమ్ము రేపినట్లు 1730 దయగల మొగుడు దండుకుపోతూ రోలుతీసి రొమ్మున వ్రేలవేసి పోయినట్లు

1731 దయతో దండాలుపెట్టితే పడవేసి బందాలు పెట్టినట్లు

1732 దయదగ్రుమంటే నెత్తి చుర్రుమంటుంది

1733 దయ్యపు కంటికి పేలగింజ వెంగెము

1734 దయ్యము కొట్టనూ బిడ్డ బ్రతకనూనా

1735 దయ్యాల ముండగ బిడ్డ బ్రతుకుతుందా

1736 దరిద్రుడు తల కడలోతే వడగండ్ల వాన వెంబడే వచ్చినదట

1737 దరిద్రుని సంగీతానికి భూమ్యాకాశాలే తాళపుచిప్పలు

1738 దయలేనత్తకు దండం పెట్టినా తప్పే

1739 దర్భామే కష్ కష్

1740 దశరానాలకూ తొటకూరకట్ట

1741 దశా దసా రావే అంటే దరిద్రాన్ని పిలు అన్నదట

దా

1742 దాగబోయిన చోట దయ్యాలు పట్టుకున్నట్లు

1743 దాన్యమైతే యివ్వలేను దండుగైతే పెట్టగలను

1744 దాయకట్టు యావు పొడవక మానునా

1745 దారినపొయ్యే వ్యాజ్యం కొనితెచ్చుకున్నట్లు

1746 దాసరిపాటకు ముష్టి ముదరా

1747 దాసరిపాట్లు పెరుమాళ్ళ కెరుక

1748 దాసరివా జంగమవా అంటే ముందరివూరుకొద్దీ అన్నట్లు