లోకోక్తి ముక్తావళి/సామెతలు-ఉ

వికీసోర్స్ నుండి


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


445 ఉంగరాలచేతితో మొట్టితే నొప్పివుండదు

446 ఉంటేలిక్కి పోతేకొడవలి

447 ఉంటే వూరు లేకపోతే పాడు

448 ఉండనిస్తే పండుతుంది ఊడదీస్తే ఎండుతుంది

449 ఉండలేకపోతే బండకొయ్య బొందను వేయమన్నాడట

450 ఉండేదానికి స్థలమిస్తే పండుకొనుటకూ మంచమడిగినట్లు

451 ఉండిచూడు వూరిఅందం నానాటికిచూడు నాఅందం

452 ఉట్టిమీద వెన్నవుండగా ఊరంతా వెన్నకోసం దేవులాడినట్లు

453 ఉండేదిగట్టు పోయిందిపొట్టు

454 ఉండేవల్లా వుండగా ఉపాధ్యాయులవారి భార్యకు దడిబియ్యం

455 ఉండ్రాళ్ళు పిండివంటాకాదు వూద ధాన్యముకాదు

456 ఉట్టికెక్కలేనమ్మ స్వర్గాన కెక్కునా

457 ఉడకకే ఉడకకే ఓవుల్లిగడ్డ నీవెంత ఉడికినా నీకంపుపోదు

458 ఉడకవే కుండా ఉగాదిదాకా అంటే నాకేమిపనిలేదు ఏరువాకదాక అన్నట్లు

459 ఉడికినమెతుకులు తిని వూళ్ళోఉండేవాణ్ణి నాకు యితరులతో పనియేమిటి

460 ఉడతకు ఉడతాభక్తి

461 ఉడుతకేలరా ఊళ్ళోపెత్తనం

462 ఉడుముకు రెండునాలుకలు 463 ఉడుమును చంకబెట్టుకొని వూళ్లో ప్రవేశించినట్లు

464 ఉడుముపోయినా చెయ్యివస్తేచాలు

465 ఉడుకుజుర్రి తే నోరు కాలుతుంది

466 ఉతికెవారికిగాని చాకలి వుతకడు

467 ఉత్తచెనికన్నా తాటాకుచెవె మేలు

468 ఉత్తచేతులు మూరవేసినట్లు

469 ఉత్తముండకన్నా అత్తముండమేలు

470 ఉత్తరకుమార ప్రతిజ్ఞలు

471 ఉత్తరచూచి యెత్తరగంప

472 ఉత్తర ఉరిమినా పాము తమిరికరచినా తిరుగదు

473 ఉద్యోగం పురుషలక్షణం అదిపోతే అవలక్షణం

474 ఉద్యోగం పురుషలక్షణం అన్నాడు గొడ్డలితేరా నిట్రాడు నరుకుదాము

475 ఉన్నది ఒకకూతురు వూరెల్లా అల్లుళ్ళు

476 ఉన్నమాట అంటే వులుకు

477 ఉన్నమాట చెప్పితే వూరు అచ్చిరాదు

478 ఉన్నవాడు ఊరికిపెద్ద, చచ్చినవాడు కాటికిపెద్ద

479 ఉపకారం అంటే వూరినుంచి లేచిపోయినట్లు

480 ఉపకారమునకు పోతే అపకారం వెంటనే వచ్చినది

481 ఉపనయనం నాటిమాట ఉండక మానదు

482 ఉపాధ్యాయులవారు ఉక్తం ఉక్తం

283 ఉపాధ్యాయులు ఏమి చేస్తున్నాడంటే తప్పులు వ్రాసి దిద్దు కుంటున్నాడు 484 ఉపాయం యెరగనివాణ్ణీ ఊళ్ళో ఉండనివ్వకూడదు

485 ఉప్పుతో ముప్ఫైఆరు వుంటే ఉత్తముండైనా పండుతుది

486 ఉప్పునూనె ఊరకరాగా ఆలినిగొట్ట నా వశమా

487 ఉప్పు తిన్నవాడు నీళ్లుతాగుతాడు

488 ఉప్పువాడూ చెడె, పప్పువాడు చెడి, తమలపాకులవాడు తమాంచెడె

489 ఉభయవతితోలూ తిని ఉద్ధరిణెకు నీళ్ళూ త్రాగి వూహూ అంటావా ఉత్తమాశ్వమా?

490 ఉభయ భ్రష్టత్వము ఉపరిసన్యాసము

491 ఉభయ బ్రష్టత్వ ఉప్పరి సన్యాసత్వము

492 ఉయ్యాలలో పిల్లనువుంచి వూరెల్లా తిరిగినట్లు

493 ఉరుకు ఉరుకుమనే వారేగాని కూడా ఉరికేవారు లేరు

494 ఉల్లిచేసిన మేలు తల్లి చేయదు

495 ఉల్లి పది తల్లుల పెట్టు

496 ఉల్లిపాయంత బలిజు ఉంటే వూరంతా చెరుస్తాడు

497 ఉల్లి ముట్టనిది వాసనరాదు

498 ఉసురువుంటే వుప్పు అమ్ముకొని బ్రతుకవచ్చు

499 ఉమరువుంటే వుప్పు అమ్ముకొని బ్రతుకవచ్చు

500 ఉస్తెకాయ ఊరనెంత అది నంజబెట్టనెంత

501 ఉల్లిగడ్డ తరిగితే వూరికీనే దు:ఖము వచ్చును

502 ఉన్నవూరా, మన్న ప్రజా

503 ఉన్నశాంతం ఊడ్చుకపోయిందిగాని అసలు కోపమేలేదు