Jump to content

లోకోక్తి ముక్తావళి/సామెతలు-గ

వికీసోర్స్ నుండి


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


1072 కోమట్ల కొట్లాట గోచిపుగులాట

1073 క్షేత్రమెరిగి విత్తనము పాత్రమెరిగి దానము

1074 ఖాజీని పాజి పాజీని ఖాజి చేసేవాడు

1075 కరువుమానుప పంట, మిడుతల మానుప మంట

1076 కోల ఆడితే కొతి ఆడుతుంది

1077 గతిలేనివాడు గాడిదకాళ్ళు పట్టుతుకున్నట్లు

1078 గంగలో మునిగినా కాకి హంసౌతుందా?

1079 గంగయీతకు లంక మేతకుసరి

1080 గంతకు తగిన బొంత

1081 గంధపుపొడి మోసేగాడిద

1082 గంధపుపొడిలో బూరవూదినట్లు

1083 గంధము అమ్మినచొట కట్టెలు అమ్ముట

1084 గంపసిడిగాదు గాలుపుసిడి

1085 గచ్చపొదమీద యిసుక వేసి కయ్యానికి రమ్మన్నట్లు

1086 గజకచ్చప పోరుచందము

1087 గట్టివాడేగాని కడుపుమాత్రము గుల్ల

1088 గట్టివిడిచి పొట్తుకు పోరాడినట్లు

1089 గట్తుచేరిన వెనుక పుట్టివానితో పోరాడినట్లు

1090 గడియపురసత్తులేదు గవ్వరాకడలేదు

1091 గడ్డం వపనముచ్యతే 1092 గడ్డంకాలి ఒకడు యేడేస్తుంటే చుట్టకు నిప్పుయిమ్మని ఒకడు వెంటబడినట్లు

1093 గడ్డతిన్నా కంపే పాయతిన్నా కంపే

1094 గడ్డపారలు గాలికి కొట్టుకపోటుంటే పుల్లాకునాపని యేమిటి అన్నదట

1095 గడ్డపలుగుమింగి శొంఠికషాయము త్రాగినట్లు

1096 గడ్డింతలేక ముడ్డంత యెండి వేంచేసెనే గుర్రము దేవలోకం

1097 గతకాలము మేలు వచ్చుకాలముకంటె

1098 గతిమాలినవానికి కుతిలావు

1099 గతిలేనిఅమ్మకు మతిలేనిమగడు

1000 గరిలేనిఅమ్మకు గంజేపానకము

1101 గబ్బిలము ఆకాశం పడకుండా పట్టుకుంటానన్నదట

1102 గయ్యాళి రచ్చకెక్కితే సంసారి పోయి దొంతులసందున దాగినట్లు

1103 గరుడాయిలెస్సా అంటే శేషాయలెస్స అన్నట్లు

1104 గడిచిబ్రతికినానని గంతులువేయరాదు

1105 గంగాధరుడు చచ్చినాడు అమ్మా

1106 గతుకులకు పోతే బతుకులు పోయినవి

1107 గరుత్మంతుణ్ణి చూచిన పామువలె