Jump to content

లోకోక్తి ముక్తావళి/సామెతలు-ఆ

వికీసోర్స్ నుండి


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


223 అవ్వపేరే ముసలమ్మ

224 అల్పుడిని బలుపువాడుకొట్టితేనే బలుపుడిని బ్రహ్మకొట్టుతాడు

225 అరకధ అరిగితే గరిక విరుగును

226 అరణ్య రోదనము

227 అవలక్షణాలు గలవానికి అక్షతలు వేసే అవతలికుపోయి నోట్లో వేసుకొనెనట

228 అన్నీ తెలిసినవాడూలేదు ఏమీ తెలియనివాడూ లేడు

229 అర్ధము లేనివాడు వ్యర్థుడు

230 అల్లికాయలసందడిని పెండ్లి మరచినాడు

231 అశ్వత్ధ ప్రదక్షిణముచేసి కడుపు పట్టిచూచు కొన్నదట

232 అంపబోయిన అల్లిసాహేబు పిలవబోయిన పీరూసాహెబు మాయమయ్యారు

233 "ఆ" అంటే అపశబ్దము, నారాయణ అంటే బూతుమాట

234 ఆకలిఆకలి అత్తగారూ అంటే, రొకలిమింగవే కోడలా అన్నదట.

235 ఆకలి ఆకాశమంత గొంతు సూది బెజ్జమంత

236 ఆకలి కాకుండా నీకు ఔషధమిస్తాను. నీయింట్లో చద్ది నాకు పెట్టు.

237 ఆకలికాని భోజనం ఆలిమీద లంజరికిం

238 ఆకలిగొన్న కరణం పాతకవిలె తీసినట్లు. 239 ఆకలిగొన్న బిచ్చగానికి వంటింట్లో వేయించిన ఉల్లిపాయల వాసనతగిలినట్లు.

240 ఆకలిగొన్నవానికి అనుష్టుప్పుశ్లోకాలతో పొట్ట నిండునా

241 ఆకాశమునకు వెండ్రుకకు ముడివేసెద నన్నట్లు.

242 ఆకాశ పంచాంగము.

243 ఆకాశమును గద్ద తన్నుకొనిపోయినట్లు.

244 ఆకాశ వర్తకుడు.

245 ఆకాశానికి నిచ్చనవేసేవాడు.

246 ఆకాశ రామన్న

247 ఆకుబోయి నూతపడితే వెతకబోయి యేడుగురు పడ్డారట.

248 ఆకు అందరు పోకను అందరు.

249 ఆకులు పట్టుదురు ఆడవాళ్ళు, కల్లు పంచుదురు మగవాళ్ళు

250 ఆగడవలు వేసినవి అత్తగారా అంటే, కొలబుర్ర వాచేతులోనే వున్నది కోడలా అన్నదట.

251 ఆగభోగాలు అక్కకుడిస్తే అంబడివరకలు బావకుడిచినాడు

252 ఆచారం అదిరిపడ్డది, దూపార్తి తుళ్ళిపడ్డది కొత్తకుండ తేరా నేత్రాళ్ళు వండుకుందాము.

253 ఆచారం ఆచారం అన్నంభొట్లా అంటే, పెద్దచెరువు కుక్కముట్తుకొన్నది అన్నట్లు.

254 ఆచారం ముందర, అనాచారం వెనక.

255 ఆచారానికి అంతములేదు, అనాచారానికి ఆదిలేదు.

256 ఆచార్యుని తలచి నిప్పులో చేయిపెట్టితే కాలదా?

257 ఆచార్యునికి ద్రోహంచేసినా, ఆత్మకు ద్రోహంచేయరాదు. 258 ఆటతీరెరే పాటాతీరే. కోటలో రామరాజ్యం

259 ఆడదానిచేతి అర్ధము, మగవానిచేతి బిడ్డ బ్రతికదు.

260 ఆడాదానిబుద్ధి అపరబుద్ధి.

261 ఆడదాని మాట నీళ్ళమూట.

262 ఆడది బొంకితే గోడపెట్టినట్టు, మొగవాడు బొంకితే తడిక కట్టినట్లు

263 ఆడనేరక మద్దెలమీద తప్పుపెట్టినట్లు.

264 ఆడపిల్లను కన్నవారు ఐదుబిరుదులు తెగగోసుకోవలెను.

265 ఆడ పెత్తనం తంబళి దొరతనం

266 ఆడబోయిన తీర్ధం ఎదురుగా వచ్చినట్లు

267 ఆడితప్పరాదు పలికి బొంకరాదు

268 ఆడినది ఆట పాడినది పాట

269 ఆడేకాలు పాడేనోరు వురకుండవు

270 ఆ తండ్రి కొడుకు కాదా?

271 ఆ తురగానికి తెలివిమట్టు

272 ఆ తుష్టికి ఈ నష్టకి సరి

273 ఆత్మకు ద్రోహంచేస్తే అప్పుడే ఆడుగుతుంది

274 ఆత్మస్తుతి పరనింద, అర్ధాపేక్ష, లేని మహానుభావుడికి నాకు డబ్బు శుద్ధశుంఠకు వాడికీడబ్బా?

275 ఆత్మా రావే నూత పడదాం అంటే, ఆదివారంనాడు అందరము పడదాము అన్నదట

276 ఆపతి మొక్కులు సంపతి కుంట్లు

277 ఆ పప్పు యీనీళ్ళకు వుడకదు 278 ఆపస్తంబులా, అశ్వలాయనులా అంటే, ఆపస్తంబులమూ కాము, అశ్వలాయులముకాము అప్పారావుగారి హర్కా రాలము అన్నాడట

279 ఆ బుర్రలో విత్తనాలే

280 ఆదివారము నాడందరము సోమవారమునాడు జోలి

281 ఆమంట ఈమంట బ్రాహ్మణార్ధం కడుపుమంట

282 ఆమడలు దూరమైతే అంత:కరణలు దూరముగా

283 ఆ మాట అనిపింతామా మామగారు

284 ఆమడలు దూరమైతే అంత:కరణలు దూరముగా

285 ఆముదపు విత్తులు ఆణిముత్యాలు అగునా

286 ఆముదములో ముంచిన యేకువలెనున్నాడు

287 ఆయంతప్పితే గాయమంత సుఖములేదు

288 ఆయం తెలిసి వ్యయము చేయుము

289 ఆయన ముందర పోవలెను

290 ఆయువుంటే విస్తరయినా, కుట్టును

291 ఆరగించగా లేనిది అడుగుతే వస్తుందా

292 ఆరంభ శూరత్వము

293 ఆ రాటపు కదురు ఏరాటానపెట్టినా బరబర

294 ఆర్భాటానకు ఆరుకుంపట్లు ఒక దుంపదాలి

295 ఆరుగకోసిన ముహూర్తాన్నే కందికూడా కొయ్యండి

296 ఆరు నెల్లనుంచి వాయించిన మద్దెల వోటిదా గట్టిదా అన్నట్లు

297 ఆరునెలలు స్నేహముచేసిన వారు వీరగుదురు 298 ఆరు నెలలు సాముచేసి మూలనున్న ముసిలిదానిని కొట్టి నాడట

299 ఆరెలమ్రానునుక్రింద బూతలమ్రాను విరగబడ్డట్టు

300 ఆర్చేవారేగాని తీర్చేవారులేరు

301 ఆర్చేవా తీర్చేవా అక్కవవస్తే మూలిగేవా

302 ఆలికి అన్నంపెట్టడం ఊరికి ఉపకారము

303 ఆలిని వల్ల నివాసానికి యీలకూరలో వుప్పుచాలదు

304 ఆలివంకవారు ఆత్మబంధువులు, తల్లివంకవారు, ఆగిన వారు, తండ్రివంకవారు దాయాదులు

305 ఆలు కాదది వ్రాలు

306 ఆలువల్లిక అరవైయేండ్లు, మగడువల్లిక ముప్పైయేండ్లు, బాలప్రాయం పదియేండ్లు

307 ఆలూమొగుడు మధ్యపోట్లాట అద్దంమీద పేసరగింజ వేసినంతసేపు

308 ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం

309 ఆళ్ళు కొత్తవిఅయితే తిరుగళ్ళు కొత్తవా

310 ఆవగింజ ఆట్టెదాచి గుమ్మడికాయలు గుల్లకాసుగా యెంచేవాడు

311 ఆవగింజకు సందువుంటే అరవైగారెలు అప్పుడేతిననా

312 ఆవతిన్న అమ్మకు యేవపారిందట

313 ఆలు గుణవంతురాలైతే మేలుకలుగును

314 ఆవలింతకు అన్నదమ్ములున్నారు గాని తుమ్ముకుతమ్ముడు లేడు. 315 ఆవాలు ముద్దచేసినట్లు

316 ఆవు చేలో మేస్తే దూడగట్టునమేస్తుందా

317ఆవుపాడి యెన్నాళ్ళు, ఐశ్వర్యం ఎన్నాళ్లు, బర్రెపాడి యెన్నాళ్లు, భాగ్యం యెన్నాళ్లు

318 ఆవుల మళ్ళించినవాడు అర్జునుడు

319 ఆవులు ఆవులు పోట్లాడితే లేగలకాళ్లు విరుగుతవి

320 ఆశకు అంతంలేదు

321 ఆశకు అంతంలేదు

322 ఆశా దోష మెరుగదు పూటకూళ్లమ్మ పుణ్యం యెరుగదు

323 ఆశపడి ఆకు లంఖణాలుచేస్తే ఆ వేళా జొన్నమెతుకులేనా

324 ఆశ బోధిస్తున్నది, అవమానం బాధిసున్నది

325 ఆశలేని కూటికి ఆకలిలేదు

326 ఆశ సిగ్గుయెరుగదు, నిద్ర సుఖమెరుగరు

327 ఆశపాతకచ్చా, పాడుగోచీ పాతలో, తూమెడు కట్టుకున్నాట్ట

328 ఆ శోదిమాటల కర్థములేదు. గుడ్డికంటికి చూపులేదు

329 ఆహారమందు వ్యవహారమందు సిగ్గుపడకూడదు

330 ఆసులోనిదారం

331 ఆసులో క్రోవివలె

332 ఆడుబిడ్డ సగము మగడు

333 ఆరుద్రవాన ఆగుదువాన

334 ఆశ్లేష వాన అరికాలు తేమ 335 ఆకలి రుచి యెరుగదు. నిద్ర సుఖమెరుగదు, వలపు సిగ్గెరుగదు

336 ఆగ్రహాన ఆనపెట్టు కున్నట్లు

337 ఆకలిగొన్నవాడు యెంగిటికి వెఱడు

338 ఆలు గుణవంతురాలైతే మేలు కలుగును

339 ఆవుల సాధుత్వము, బ్రాహ్మణుల పేదరికము లేదు

340 ఆశ లేనివారికి దేశమెందుకు

341 ఆకాశాన్ని చేతితో అందుకుంటా నన్నట్లు

342 ఇంగువ కట్టినగుడ్డ

343 ఇంటికి లక్ష్మిని, వాకిలికి చెప్పును

344 ఇంటిగుట్టు లంకకు చేటు

345 ఇంటింటికీ ఒక మట్టిపొయ్యి అయితే మాయింటికి మరి ఒకటి

346 ఇంటికన్నా గుడి పదిలం

347 ఇంటికి జ్యేష్ఠాదేవి పొరుక్కు శ్రీమహాలక్ష్మి

348 ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే మూతిమీసాలన్నీ తెగ కాలినవట

349 ఇంటిదేవర యీగిచస్తే పొలందేవర గంపజాతర అడిగిందట

350 ఇంటిదోంగను యీశ్వరుడు పట్టలేదు

351 ఇంటినిండా కోళ్ళు ఉన్నవి గాని కూ శేటందుకు లేవు (ఒక్కటిలేదు)