లోకోక్తి ముక్తావళి/సామెతలు-ఊ

వికీసోర్స్ నుండి


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


504 ఊచగల మగవాడు ఊరికిపోతే పెసర ఛేను అడ్డమాయెనట

505 ఊడుగ విత్తనంవంటివాడు

506 ఊదకూ డెన్నాళ్ళు ఉద్యోగం యెన్నాళ్ళు

507 ఊరంతా వూగిముఖము దాసరి తాళ్ళముఖము

508 ఊపిరిపట్టితే బొజ్జనిండునా

509 ఊరంతాచుట్టాలు ఉట్టికట్టటానికి తావులేదు

510 ఊరంతా నాన్నకువణికితే నాన్న అమ్మకు వణికినట్లు

511 ఊరంతా వడ్లుయెండబెట్తుకుంటే నక్క తోక యెండబెట్టుకున్నదట

512 ఊరకుంటు, అడవివేడి

513 ఊరంతాఉల్లి నీవెందు కేతల్లి

514 ఊరపిచ్చుకకు తాటికాయంత గూద

515 ఊరపిచ్చుకమీద తాటికాయ ఉంచినట్లు

516 ఊరపిచ్చుకమీద వాడివజ్రాయుధమా!

517 ఊరించి ఊరించి ఉగాదినాడు బూరిచ్చెనట

518 ఊరికంతకు ఒకత్రోవ ఉలిపి కట్టెకు ఒకత్రోవ

519 ఊరికంతకు ఒకతేబోగముదైతే యెవరివద్ద ఆడుతుంది

520 ఊరికిపోయేవానికి లేకపోయినా, బహిర్భూమికి పోయే వానికి భత్యము కట్టుమన్నట్టు

521 ఊరికి ఉపకారంగా భార్యము చీరకొనిపెడతాను ఇంటికి డబ్బుయివ్వండి అన్నాడాట 522 ఊరిజబ్బు చాకలి యెరుగును. ఉద్యోగిజబ్బు బంట్రోతెరుగును

523 ఊరి కేవస్తే మావా డింకొడున్నాడు

524 ఊరికే ఉండ లేకపోతే ఉరిబెట్టుకో

525 ఊరిపిడుగువచ్చి వీరిసెట్టిని కొట్టుకపోయిందే

526 ఊరిమీద నూరుపడ్డా, కరణంమీద కాసుపడదు

527 ఊరివాడికి కాటిభయం పొరుగూరువాదికి నీటిభయం

528 ఊరివారిబిడ్డను నగరువారుకొట్టితే నగరివారిబిడ్డను నరాయణ కొట్టుతాడు

529 ఊరు ఉన్నది చిప్పఉన్నది

530 ఊరు ఉస్తికాయంత సిద్ధాంతం తాటికాయంత

531 ఊరు పొమ్మంటున్నది కాడురమ్మంటున్నది

532 ఊరువిడచి పొరుగూరు వెళ్ళినా పూనినఖర్మం మానదు

533 ఊరువారి నడ్లపుణ్యాన మా అత్తముడ్డిపుణ్యాన్ని, నాకు నేడు భోజన మమరింది అన్నాడట

534 ఊరేచేరవద్దు రౌతాఅంటే గుర్రాన్ని ఎక్కడకట్టేసేది అన్నాట్ట

535 ఊళ్ళు యేలే కుమారుడికన్నా ఉపాదానంయెత్తే పెనిమిటి మేలు 536 ఊరిపీడ వీరి శెట్టిని కొట్టినట్లు

537 ఊరి ముందుకువచ్చి నా పెండ్లాము బిడ్డలు యెట్లున్నారన్నాడట

538 ఋణమే వ్రణం

539 ఋణసేషం, వ్రణసేషం, అగ్ని శేషం, ఉంచకూడదు

540 ఋషిమూలము, ఇదీమూలము, స్త్రీమూలం విచారించకూడదు

541 ఎంగిలిచేత్తో కాకి కైనావిదపడు

542 ఎంచబోతే మంచమంతా కంతలే

543 ఎంచి చేస్తే ఆరి తరుగునా

544 ఎండబెడితే వుండవుతుంది వుండబడితే వండబడుతుంది వండబడితే తిండబడుతుంది తిందబడితే పండబడుతుంది పండబడితే చీకటిపడుతుంది

545 ఎండుమామిడి టెంకలు ఓడిలోపెట్టుకొని అవరితాడు తెంపటానికి వచ్చినావోయి వీరన్నాఅన్నాడట

546 ఎంతదయో నరకడికి చేంత్రాడు వెదుకుతున్నాడు

547 ఎంత పొద్దు ఉండగా లేచినా తుమ్మకుంటవద్దనే తల్లవ్చారింది

548 ఎంత చెట్టు కంతగాలి

549 ఎంతమంచిగొల్లకైనా ఇప్పకాయంత వెర్రివుంటుంది

550 ఎంతమంచి నందిఐనా అమేధ్యం తినకమానదు