లోకోక్తి ముక్తావళి/సామెతలు-ఈ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


426 ఈ అంబటి కేనా యిరవైనాలుగు నామాలు

427 ఈ కంటికే రప్పలు దూరనా

428 ఈగకు యిలి పాముకు బలిపుట్టదు

429 ఈచేతచేసి ఆచేత అనుభవించినట్లు

430 ఈడ్చుకాళ్ళవానికి యిద్దరు భార్యలు ఒకతె యీడువ, ఒకతె ఏడువ

431 ఈతకు మించిన లోతులేదు, గోచీకి మించిన దరిద్రము లేదు

432 ఈతగింజ యిచ్చి తాటిగింజ లాగేవారు.

433 ఈతక్రింద పాలు త్రాగినా కల్లే అంటారు

434 ఈతముల్లు విరగదొక్కే కాలము

435 ఈదబోతే తాగనీళ్ళు లేవు

436 ఈనగాగాచి నక్కలపాలు

437 ఈదాడన్న గోదాడన్నట్లు

438 ఈదులకు పోయినవాడు యిల్లుకాలినా రాడు తాళ్ళలోకి పోయినవాడు తండ్రిచచ్చినా రాడు

439 ఈదుతీస్తే పేమువచ్చినట్లు

440 ఈ నేల వడ్డీ వచ్చేనెల మొదలూలేదు

441 ఈపిల్లి ఆ పాలు తాగరు

442 ఈవూరికి ఆవూరెంతో ఆవూరికి యీవూరూ అంతే

443 ఈయని మొండికి విడువని చెండి

444 ఈవూళ్ళో పెద్దలు ఎవరంటే తాళ్ళు, దాతలు ఎవరంటే చాకళ్ళు