లోకోక్తి ముక్తావళి/సామెతలు-క

వికీసోర్స్ నుండి


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


743 కంకణాల చెయ్యి ఆడితే కడియాల చెయ్యి ఆడుతుంది

744 కంచం అమ్మి మట్టెలు కొన్నట్లు

745 కంచి అంత కాపురం గడ్డలు చేసినట్లు

746 కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా

747 కంటికి ఇంపైతే కడుపుకు యింపు

748 కంటికి కన్నూ పంటికిపల్లు

749 కంటికీరెప్ప కాలికి చెప్పు

750 కంఠగత ప్రాణం

751 కండ్లకు గంతకట్టి అడవిలో వదలినట్లు

752 కండ్లకు దూరమైతే చెవులకు దూరమా?

753 కంటికి తగిలేపుల్ల కనిపెట్టవద్దా

754 కండ్లు చెరిపిన దేముడు మతియిచ్చినట్లు

756 కండ్లుపోయిన తరువాత సూర్యనమస్కారములు

757 కండ్లువుండగానే కాటుక

758 కండ్లు పోయినంత కాటుక

759 కందకు చేమకులేని దురద తోటకూరకా

760 కందకు లేనిదురద బచ్చలికేమి

761 కండ్లు పోగొట్టిన దేముడు యిండ్లుచూపడా

762 కంసాలిమాయ కంసాలికిగాని తెలియదు

763 కంసాలివద్ద వుండవలె కుంపట్లో వుండవలె

764 కంబళిలో తింటూ రోమములు లెక్కించినట్లు 765 కక్కిన కుక్కవద్దకు కనిన కుక్కవద్దకు కానివాణ్ణికూడా పంపకూడదు.

766 కక్కినకూడు

767 కట్టినవానికి ఒకయిల్లు అయితే కట్టనివానికె వేయిండ్లు

768 కట్తిన వారొకరు కాపురంవుండేవా రొకరు

769 కట్తిన యింటికి పణుకులు చెప్పేవారు వేయిమంది

770 కట్టుకున్న ఆపె పెట్టుకున్న ఆపె వుండగా యెదురు వచ్చిన ఆపె యెండి పోయినదట

771 కట్టె పుచ్చిన చెడును మనుష్యుడు రంజిన చెడును

772 కట్టెయస్వాహా, కంపాయస్వాహా; నీకునాకు చెరిసగాయస్వాహా

773 కొయ్యరా కొయ్యరా పోలిగా అంటే....... టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాడట

774 కట్టెవంక పొయ్యి తీరుస్తుంది

775 కట్టెలేదు పుడకాలేదు కాచిపొయ్య నీళ్ళూలెవు పదవోయి అల్లుడా బావిగట్టుకు

776 కడకాబోయే శనైశ్చరుండా మా యింటిదాకా వచ్చి పొమ్మన్నట్లు

777 కడవంత గుమ్మడికాయైనా కత్తిపీటకు లోకువ

778 కడి అంటే నోరుతెరచి కళ్ళెము అంటే నోరుమూసినట్లు

779 కడి గండము గాచును

780 కడుపు కూటికి యేదిస్తే కొప్పు పూలకు ఏద్చిందట 781 కడుపుతో వున్నమ్మ కనకమానునా, వండినమ్మ తినక మానునా

782 కడుపునిండా గారలు తింటే వొంటి నిండ జ్వరము

783 కడుపు నిండిన బేరము

784 కడుపు నిండిన వానికి గారెలు చేదు

785 కడుపులోని బిడ్డ కడుపులో వుండగా కొడుకుపేరు సోమలింగం

786 కడుపు లోని మాటంటే వూరంతా అవుతుంది

787 కడుపులోలేనిది కావిలించుకుంటే వస్తుందా

788 కడుపువస్తే కనే తీరవలెను

789 కతలమారి మొగుడు కమ్మలు చేయిస్తే, అప్పుల కూటిమొగుడు అమ్ముక తిన్నాడట

790 కతికెతే అతకదు

791 కత్తి తీసి కంపలో వేసి యేకుతీసి పొడుచుకుంటా నన్నట్లు

792 కత్తిపోటు తప్పినా కలంఫోటు తప్పదు

793 కత్తి మేత్తన అత్త మంచి లేదు

794 కత్తి వాడియా కలంవాడియా

795 కత్తెరపోటుకు కదల పారుతుంది

796 కద్దు అనడానికి లేదు, అనడానకు దీనికే అధికారమా

797 కధకు కాళ్లులెవు ముంతకు చెవులు లేవు

798 కననిది బిడ్డకారు, కట్టనిది బట్టకాదు

799 కని గృడ్డి, విని చెవిటి

800 కనుక్కొని రారా అంటే కాల్చివచ్చేవాడు 801 కనుమకాకర భోగి పొట్లకాయ

802 కన్నతల్లికైనా కనుమరుగుండవలె

3కన్నతల్లిని కాళ్ళుపట్టియీడ్చి పిన్నతల్లికి పెట్టరా పిండప్రధానం

804 కన్నుకు తగిలేపుల్ల కనిపెట్టావద్దా

805 కన్ను యెరుగకున్నా కడుపు యెరుగును

806 కన్ను మూస్తే కల

807 కన్నేలపోయెనో యీ కనకలింగమా అంటే చేసుకున్నఖర్మమోయీ శంభులింగమా అన్నాడట

808 కప్పకుకాటు బ్రాహ్మణునకు పోటులేదు

809 కమ్మగుట్టు గడపదాటదు

810 కమ్మని తుమ్మని నమ్మరాదు

811 కమ్మనీచు కడిగినాపోదు

812 కమ్మరివీధిలో సూదులమ్మినట్లు

813 కరివేపాకు కోసేవాడు వాగినట్లు

814 కరువున కడుపుకాల్చిన అమ్మను యెన్నటికి మరువను

815 కరువులో బిడ్డనమ్ముకున్నట్లు

816 కర్ణప్రతాపం

817 కర్ణుడులేని భారతము, సొంఠిలేని కషాయము

818 కర్మకు అంతమూలేదు కాలముము నిశ్చయమూ లేదు

819 కర్మముగల మొగుణ్ణి కంబట్లోకట్టి బుజముమీద వేసుకొంటే జారి వీధిలో పడ్డట్టు

820 కర్రలేనివాణ్ణి గొఱ్ఱేయినా కరుస్తుంది 821 కర్రికుక్క కపిలగోవు

822 కలకాలపు దొంగ కానివాడు దొరుకుతాడు

823 కలబంద యెండు ... కోడలి కొత్తాలేదు

824 కలలో పాలుతాగడానికి కంచుదైతేనేమి కనకమైతేనేమి

825 కలలో భోగము

826 కలవారి ఆడబడుచుకు కాకరకాయ కానరాదు

827 కలహమున్న కొంపలో కట్టబట్టలుండవు

828 కలిగితే కాళ్ళుముయ్య లేకపోతే మోకాళ్ళుముయ్యి

829 కలిగినయ్య గాదె తీసేటప్పటికి లేనివాని ప్రాణంపోయినదట

830 కలిగినయ్య కలిగినయ్య కేపెట్టును లేనయ్య కలిగినయ్యకే పెట్టును

831 కలిగినవారింటికి కడగొట్టుకోడలు అయ్యేకన్నా పేదవారింట పెద్దకోడలు మేలు

832 కవిలిపండ్లపండితే కరువులు వచ్చును

833 కసపు తీయనిమడి దేవుడు లేనిగుడి

834 కలిగినవారి కందకు చుట్టాలే

835 కలిచిపోసి కలిసికట్టినా వుట్టివంకకే చూస్తాడ

836 కలిమికులాల మిండడు

837 కలిమిలేములు కావడికుండలు

838 కలియుగం రెండురోజులూ పోవాలి

839 కలియుగం రావణాసురుడు

840 కలియుగ భీముడు

841 కలసివచ్చే కాలమున నడిచివచ్చే పిల్లలు పుట్టుదురు 842 కల్లుకుండవద్ద కయ్యము, జుట్తులాక్కుపోయే దెయ్యము

843 కల్పవృక్షంక్రింది గచ్చపొద మంచి గంధముచుట్టు నాగుబాము

844 కల్లపైడికి గరుకులు మెండు

845 కల్లపైడికి కాంతిమెండు

846 కష్టపడి యిల్లుకట్టు కొని కల్లుత్రాగి తగలబెట్టినట్లు

847 కష్టసుఖములు కావడికుండలు

కా

848 కాకము గుడిమీదనున్న గరుడుండగునే

849 కాకి క రుమంటే గుండె ఝుల్లుంమంటుంది

850 కాకికి కలిచల్లడు పిట్టకు పిడికెడేయడు

851 కాకి గండా గుండిగాని కోకిల పిరికి

852 కాంచన కీతకీ కుసుమరాత్రి

853 కాకినితెచ్చి పంజరములోపెట్టితే చిలుకవలె పలుకునా!

854 కాకిపిల్ల కాకికిముద్దు

855 కాకి పుట్టీనలుపే పెరిగీనలుపే

856 కాకిముక్కున దొండపండు కట్టినట్లు

857 కాకులకు గాని నెమ్ములు పూస్తే నేమి కాస్తేనేమి

858 కాకులనుకొట్టి గద్దలకు వేసినట్లు

859 కాగలకార్యం గంధర్వులే తీరుస్తారు

860 కాగెడుజొన్నలు బుక్కిన కౌజు ముడికాయలు