లోకోక్తి ముక్తావళి/సామెతలు-త
లోకోక్తి ముక్తావళి | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
1441 డబ్బు యిచ్చి తేలు కుట్టించుకున్నట్లు
1442 డబ్బు సభగట్టును, ముద్ద నోటినిగట్టును
1443 డబ్బూ యివ్వను డబ్బుమీద దుమ్మూ యివ్వను
1444 డబ్బుకు వచ్చినచెయ్యి వరహాకువస్తుంది
1445 డబ్బులకు ప్రాణానికి లంకె
1446 ఢిల్లికి ఢిల్లి పల్లెకు పల్లి
1447 డొంకలోషరాపువున్నాడు నాణెములుచూపుకోవచ్చును
త
1448 తంగేడు పూచినట్లు
1449 తంటాలమారి గురానికి తాటిపట్ట గొరపం
1450 తండ్రి తవ్విన నుయ్యి అని అందులో దూకవచ్చునా
1451 తండ్రిని చంపిన పాపం అత్తవారింట అంబటికట్ట తెగితే పోతుంది
1452 తండ్రిసేద్యం కొడుకు వైద్యం, కూడుమధ్యం
1453 తంబళ అనుమానము
1454 తంబళి తన లొటలొటేగాని యెదుటివారి లొటలొట యెరుగడు
1455 తక్కువ నోమునోచి యెక్కువఫలము రమ్మంటేవస్తుందా
1456 తగవరి కూలికి విషము త్రాగడు
1457 తగవున నోడినను ముదిమిని చచ్చినను బందిలేదు
1458 తగిలినకాలే తగులు తుంది
1459 తగినట్లే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ 1460 తగుదాసరికే మెడపూసలకు, అమ్మకన్న కాంపుకూ, అయ్య యిచ్చిన మునుముకూ సరి
1461 తడక లేని యింటిలోకి కుక్క దూరినట్లు
1462 తడిగుడ్డతో గొంతుక కోస్తాడు
1463 తడిసినగాని గుడిసె కట్టదు తాగిగాని మొగ్గడు
1464 తడిసిన కుక్కి బిగిసినట్లు
1465 తడిసి ముప్పందుము మోసినట్లు
1466 తణుకుకుపోయి మాచవరం వెళ్ళినట్లు
1467 తద్దినం కొని తెచ్చు కున్నట్లు
1468 తద్దినం నాటి జందెం
1469 తనకంపు తనకింపు పరులకంపు ఓకరింఫు
1470 తనకలిమి యింద్రభోగము తనలేమి లోకదారిద్రము
1471 తనకాళ్ళకు బందాలు తానే తెచ్చుకున్నట్లు
1472 తనకు అని తెవ్వెడు వుంటే ఆకటివేళ ఆరగించ వచ్చును
1473 తనకు కానిది గూడులంజ
1474 తనకు కానిరాజ్యం పండితేనేమి వదటకలిస్తే నేమి
1475 తనకు చెప్ప తడికలచాటు ఒకరికిచెప్ప ఒప్పలకుప్ప
1476 తనకు బాసిన వెంట్రుకలు యే రేవులో పోతేనేమి
1477 తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం
1478 తనకచ్చా తానుకట్టుకుని సానికొంపను తిరిగినాతప్పులేదు
1479 తీతువపిట్ట ఆకాశంలోగూడు కడతానన్నట్లు
1480 తనకొంగునవున్నరూక తనకు పుట్టినబిడ్డ పనికివస్తవి
1481 తన చెయ్యి కాలుతుందని సవతిబిడ్డచేతితో కలియబెట్టినట్లు 1482 తన తలుపుతీసి పొరుగింటికి బెట్టి రాత్రంతా కుక్కల తోలుతూ కూర్చున్నట్లు
1483 తనతల్లిచావుకన్నా పినతల్లిచావుమేలు
1484 తననీడె తనకుశాచం
1485 తనదాకావస్తే గాని తలనొప్పి బాధతెలియదు
1486 తననీడ తనతోనే వుంటుంది
1487 తనదీపమని ముద్దుపెట్టుకుంటే మూతిమీసాలుకాలును
1488 తననుపొడిచిన గంగిగోవునైనాపొడిస్తే పాపంలేదు
1489 తనపిల్ల తవిటికేడిస్తే లంజపిల్ల రాగిరేకు కేడ్చినది
1490 తనపుట్టి పిచ్చగావుంటే, పొరుగు పందుం సరాకొలిచి నాడట
1491 తనబంగారం కాకపొతే వన్నెలేదు మెరుపు లేదు
1492 తనబలిమికన్నా స్థానమలిమిమేలు
1493 తనముడ్దికాకపోతే కాశీదాకా దేకమన్నట్లు
1494 తనముడ్ది కాకపోతే గంగదాకా తాటిపట్టికెదురు దేకమన్నట్లు
1495 తనలొ తప్పులెకుంటే గురువుతో గుద్దులాడవచ్చునట
1496 తనయుని పుటక తల్లికి తెలుసు
1497 తనవారు లోతుకుతీతురు కానివారు కడకు తీతురు
1498 తనవాసితప్పితే ఒకవన్నె తరుగును
1499 తనువులు నిత్యములేదుగాని ఓలిపైకము ఖర్చుపెట్టకు అన్నట్టు
1500 తన్నుగట్టతాళ్లు తానేతెచ్చుకొనినట్లు 1501 తప్పతాగి కులంమరచినట్లు
1502 తప్పులువెతికేవాడు తండ్రితప్పులు వెతికేవాడు ఓర్వలేనివాడు
1503 తప్పులులేనివారు ధరణిలోలేరు
1504 తప్పులేనివాణ్ణి ఉప్పులోవూరయ్య మన్నాడట
1505 తప్పూఒప్పూ దైవమెరుగును పప్పూకూరబాపడెరుగును
1506 తప్పెటకొట్టినవాడు దాసరి శంఖంవూదినవాడు జంగం
1507 తరిఅంటే వరిఅంటాడు తిరిగిఅంటే గొంతుకు ఉరి
1508 తమామూలేకుంటే తవ్వెడైనా అడిగినట్లు
1509 తమ్ముడు తనవాడేగాని తప్పుతనదా
1510 తలక్రిందికొరవి
1511 తలంటబలగమేగాని తలకుపెట్టేవారు లేరు
1512 తలకుమించిన ఆజ్ఞలేదు
1513 తలకోసుకపోగా పోగులకు యేడ్చినట్లు
1514 తలకోసి ముందరపెట్టితే గారడీవిద్యాన్నట్లు
1515 తలగట్టి కడుపుగుల్ల
1516 తలచినప్పడీ తాతపెళ్లి
1517 తలగడక్రిందిపాము
1518 తలకాయలోకిదూర్చిన తాబేలువలె
1519 తలతడిసినమట్టుకు గొరిగే తీరవలెను
1520 తలతిరిగియైనా కబళం నోట్లోకే రావలెను
1521 తలప్రాణం తోకకువచ్చినది
1522 తలలు బోడులైనా తలుపులుబోడులా 1523 తలతోకలెని కధ ముక్కుముఖములేనిపిల్ల
1524 తలారిపగ తలతోతీరుతుంది
1525 తలుపులుమింగేవానికి అప్పడాలు లొటలొట
1526 తల్లియైనా పిల్లయేడవంది పెట్టదు
1527 తల్లిచేసింది తనయులకు
1528 తల్లిబంగారైనా కంసాలివాడు దొంగిలకమానడు
1`529 తల్లికడుపుచూచును పెండ్లాము వీపుచూచును
1530 తల్లికడుపులో చొరకముందు దయ్యాలదేవత భూమిలో పుట్టినతర్వాత దయ్యాల దేవత
1531 తల్లికికానివాడు దాయాదికౌనా
1532 తల్లికికూడు పెట్టనివాడు తగుదునమ్మా అనితీర్చవచ్చినట్లు
1533 తల్లికికొట్టరా వసంతం
1534 తల్లికితగినబిడ్డ యింటికితగిన వందిలి
1535 తల్లిగండము పిల్లగండము మంత్రసానిగండమున్నదా
1536 తల్లిచనిపోతే తండ్రి పైనతండ్రితో సమానము
1537 తల్లిచేసే కడుపుపెద్ద, తలమాస్తే కొప్పుపెద్ద
1538 తల్లిచాలు పిల్లలకు తప్పుతుందా
1539 తల్లిచెవులకన్నా పినతల్లిచెవులు మేలు
1540 తల్లిచెఫులు మద్దికాయలు దండుగలకు పెండ్లాంమెళ్ళో పూసలు భోగాలవారికి
1541 తల్లిచెవులు తెంచినవానికి ముత్తవచెవులు వెంట్తుక మాత్రం
1542 తల్లిదే వలపక్షం ధరణిదే వలపక్షం 1543 తల్లిదైవము తండ్రిధనము
1544 తల్లినిచూచి పిల్లనూ పాలనుచూచిబర్రెను కొనవలెను
1545 తల్లినినమ్మినవాడు ధరణిని నమ్మినవాడు చెడడు
1546 తల్లిపాలు దూడచెబుతుంది
1547 తల్లిపుట్టిల్లు మేనమామవద్ద పొగడినట్లు
1548 తల్లిరోసినపిల్లను దాదిరోయదా
1549 తల్లిలేనిపిల్ల వుల్లిలేనికూర
1550 తవుడుతింటూ వొయ్యారమా
1551 తవ్వగాతవ్వగా తధ్యం తేలుతుంది
1552 తవ్వి మీదతోసుకున్నట్లు
తా
1553 తాగనేరనిపిల్లి బోర్లదోసుకున్నట్లు
1554 తాగబోతే దప్పిగలేదు తలకొక అంటికలి
1555 తాగేది దమ్మిడీగంజాయి యిల్లంతా చెడువుమ్ములు
1556 తాగబోతూ బొల్లియెద్దుకుకుడితి
1557 తాచెడ్డకోతి వనమెల్లా చెరచినది
1558 తాగేవాడే యిచ్చుకుంటాడు తాళ్ళపన్ను
1559 తాటాకుచప్పళ్లుకు కుందేళ్లు బెదురునా
1560 తాటాకు తినెదవా తలకొట్లుపడెదవా
1561 తాటిచెట్లలో ప్రొద్ధుగూగినట్లు
1562 తాటిపట్టెకు యెదురు దేకినట్లు
1563 తాడుచాలకపోతే నుయ్యిపూడిచినట్లు