లోకోక్తి ముక్తావళి/సామెతలు-ఓ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


727 ఓ కారం రానివాడు వడ్లు గుణించినట్లు

728 ఓడలు బండ్లునా వస్తవి, బండ్ల నోడలవస్తవి

729 ఓడు ఓడంటే కంచమంతా వోడు అన్నట్లు

730 ఓ పనివాడు కోరనిది ఒంటరివాడు ఆడనిది లేదు

731 ఓ పనివానికి వద్దన్నవారే తల్లి దండ్రులు

732 ఓచీ ఓచీ నీవు వడ్లుదంచు నేను పక్క లేగ దోస్తాను

733 ఓరిస్తే ఓరుగల్లు పట్నమౌతుంది

734 ఓరుగాలిలో దీపంపెట్టి దేముడా నీ మహత్యమన్నట్లు

735 ఓర్చలేనమ్మ వడిని నిప్పులు కట్టుకుంటే దడీ వడీ కూడా కాలింది

736 ఓర్చలేని రెడ్డి వుండీచెరచెను, చచ్చీ చెరిచెను

737 ఓలి తక్కువని గుడ్డిదానిని పెండ్లాడితే దొంతి కుండలన్నీ పగుల గొట్టినదట

738 ఓహో కనుక్కోలేక పోయినా పోయినారుగదా! అన్నట్లు

739 ఓలో సగంచెప్పు నాయనా అన్నట్లు

740 ఓర్చిన పశువుకు తేటనీరు

741 ఓడవగిన కళాసు సామెత

742 ఔషధాలకు అపధ్యాలకు చెల్లు రోగము పైపెచ్చు