లోకోక్తి ముక్తావళి/సామెతలు-చ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


1216 గోరువాస్తే వేలంత, వేలువాస్తే కాలంత కాలువాస్తే రోలంత, రోలువాస్తే యెంత

1217 గోవులను కోసి చెప్పులు దానము చేసినట్లు

1218 గోవులేనివూళ్ళో గొడ్దనేది శ్రీమహాలక్ష్మి

1219 గ్రామశాంతికి బోడితల

1220 గ్రాసములేని కొలువు

1221 ఘంటా కర్ణునికి అష్టాక్షరీ వుపదేశం చేయబోయినట్లు

1222 ఘోరకలి

1223 చంకపిల్ల జారిపడేటట్టు మాట్లాడుతాడు

1224 చంట్లో యెముకలు యేరినట్లు

1225 చందమామ రూపాయిబిళ్లవలె జారుతున్నాడు

1226 చంద్రవరివేషము వర్ష యోగము

1227 చంద్రుణ్ణీజూచి కుక్కలు మొరిగినట్లు

1228 చంద్రునకొక నూలుపోగు

1229 చక్కగా కూశోరా చాకలి నాయడాఅంటే, విన్నావటోయి యీడిగనాయడా మంగలినాయడి సరసము అన్నట్లు

1230 చక్కదనాలకు లొట్టిపిట్ట, సంగీతానికి గాడిద

1231 చక్కిలాలు తింటావా చల్దితింటావా అంటే చక్కిలాలూ తింటాను చల్ధీతింటాను అయ్యతోటి వేడి తింటాను అన్నాట్ట

1232 చక్కెర పందిట్లో తేనె వానకురిసినట్లు 1233 చక్కెరపూత విషము

1234 చచ్చిన చారమేకపాలు పోయిన బోసిముంతెడు

1235 చచ్చినతర్వాత తెలుస్తుంది శెట్టిగారి బండారం

1236 చచ్చిన పామును గొట్టుట కందరుబంట్లే

1237 చచ్చినవా డేడ్చినను రాడు

1238 చచ్చినవానికండ్లు చారడేసి

1239 చచ్చినవాని తల తూర్పునుంటేనేమి పడమరనుంటేనేమి

1240 చచ్చినవాని పెండ్లికి వచ్చినంత కట్నము

1241 చచ్చినాపయికం తప్పదచ్చమ్మా యిక తిట్టకు

1242 చచ్చేటప్పుడు సంధి మం త్రం

1243 చచ్చేటప్పుడు శంభోశంకరా అనరా అంటే వారింట్లో చెంబు యెత్తుకురా అన్నాడట

1244 చచ్చేదాకా బ్రతికివుంటే పెండ్లి చేస్తానన్నట్లు

1245 చచ్చేవానికి సముద్రం మోకాలిబంటు

1246 చదవనేరుస్తావా వ్రాయనేరుస్తావా అంటే, చదవనేరను వ్రాయనేరను చింపనేరుస్తా నన్నాడట.

1247 చచవవేస్తే వున్న మతిపోయించి

1248 చదివిన వానికన్న చాకలినయం

1249 చదివేది రామాయణం పడగొట్టేవి దేవళములు

1250 చద్దికంటే వూరగాయ ఘనం

1251 చద్దన్నం తిన్నమ్మ మొగుడాక లెరుగదు

1252 చద్దితెచ్చుకున్న బ్రాహ్మణుడా భోజనంచెయ్యి

1253 చదువుమాయింటలేదు సంధ్య మావమవంశానలేదు 1254 చదువనేర్చిన ఆడుదానితో వండనేర్చిన మగవారితో నోపలేరు

1255 చన్నీళ్ళయినా చల్లార్చుకు తాగవలెను

1256 చలిజ్వరము అన్నములోచెయ్యి తియ్యబుద్దికాదు

1257 చలిపందిలి కుండలకు తూట్లుపొడిచినట్లు

1258 చలిపందిలి కుండలకు రాళ్లు తూట్లుపొడిచినట్లు

1259 చదువులలో మర్మమెల్ల చదివివానులేవోయి

1260 చదువూలేదు సంధ్యాలేదు సంతానం మెండు

1261 చల్లకువచ్చి ముంతదాచినట్లు

1262 చవకయైతే బజారుకు వస్తుంది

1263 చవకదూదర తిండికికారణం

1264 చవియెరిగినకుక్క చావకొట్టినాపోదు

1265 చస్తానని చద్దిఅన్నంతింటే చల్లగా నిద్రవచ్చినదట

చా

1266 చాఅంటే తూఅనలేడు

1267 చాకలిఅత్త మంగలిమామ

1268 చాకలికట్టనిగుడ్డ సైనుయెక్కని గుఱ్ఱమూలేదు

1269 చాకలివానిభార్యకు మంగలివాడువిడాకులిచ్చినట్లు

1270 చాపచిరిగితే చదరంతైనా వుండకపోదు

1271 చామలుచల్లి చేనువిడువవలెను

1272 చాలులో చామదున్నితే చేనుచేనుకే అవుతుంది

1273 చాలీచాలనందుకు చాకింటిగుడ్డలు చాలావున్నవి