లోకోక్తి ముక్తావళి/సామెతలు-గో

వికీసోర్స్ నుండి

1196 గొర్రె కోసేవాణ్ణిగాని నమ్మదు

1197 గొర్రె తోక బెత్తెడే

1198 గొర్రెను తినేవాడుపోతే బర్రెను తినేవాడు వచ్చును

1199 గొర్రెలలో తోడేలూచొరబడ్డట్టు

1200 గొల్లవాని కొమ్ము హెచ్చనుహెచ్చదు, తగ్గను తగ్గదు

1201 గొల్లవారింటి పెండ్లి తెల్లవారింది

గో

1202 గోంగూరలో చింతకాయ వేసినట్లు

`1203 గోచికి పెద్ద, కొల్లాయికి చిన్న

1204 గోచిపాతరాయడు దొంగల మిండడు

1205 గోటమీటితే పోయేపనికి గొడ్డలి యెందుకు

1206 గోడకు కూడ చెవులున్నాయి

1207 గోడకుపెట్టినసున్నం లంజకుపెట్టిన సొమ్ము

1208 గోడపెట్టూ, చెంపపెట్టూ

1209 గోడ మీద పిల్లి

1210 గోడమీది సున్నము విడియము లోనికి వచ్చునా

1211 గోడవుంటే చిత్రం వ్రాయవచ్చు

1212 గోనెలకంటె గోవాలు మెండు

1213 గోరంత వుంటే కొండంత చేస్తాడు

1214 గోరీవద్ద నక్కవతు

1215 గోరుచుట్టుపై రోకటిపోటు 1216 గోరువాస్తే వేలంత, వేలువాస్తే కాలంత కాలువాస్తే రోలంత, రోలువాస్తే యెంత

1217 గోవులను కోసి చెప్పులు దానము చేసినట్లు

1218 గోవులేనివూళ్ళో గొడ్దనేది శ్రీమహాలక్ష్మి

1219 గ్రామశాంతికి బోడితల

1220 గ్రాసములేని కొలువు

1221 ఘంటా కర్ణునికి అష్టాక్షరీ వుపదేశం చేయబోయినట్లు

1222 ఘోరకలి

1223 చంకపిల్ల జారిపడేటట్టు మాట్లాడుతాడు

1224 చంట్లో యెముకలు యేరినట్లు

1225 చందమామ రూపాయిబిళ్లవలె జారుతున్నాడు

1226 చంద్రవరివేషము వర్ష యోగము

1227 చంద్రుణ్ణీజూచి కుక్కలు మొరిగినట్లు

1228 చంద్రునకొక నూలుపోగు

1229 చక్కగా కూశోరా చాకలి నాయడాఅంటే, విన్నావటోయి యీడిగనాయడా మంగలినాయడి సరసము అన్నట్లు

1230 చక్కదనాలకు లొట్టిపిట్ట, సంగీతానికి గాడిద

1231 చక్కిలాలు తింటావా చల్దితింటావా అంటే చక్కిలాలూ తింటాను చల్ధీతింటాను అయ్యతోటి వేడి తింటాను అన్నాట్ట

1232 చక్కెర పందిట్లో తేనె వానకురిసినట్లు