లోకోక్తి ముక్తావళి/సామెతలు-ల
లోకోక్తి ముక్తావళి | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
రో
2949 రోకటికి చిగురు పట్టినట్లు
2950 రోకలి మూడు మాడలు
2951 రోగము వొకటి మందు వొకటి
2952 రోగీ పాలేకోరినాడు వైధ్యుడూ పాలే కోరినాడు
2953 రోట్లో బుర్రపెట్టి రోకలి దెబ్బకు వెరచినట్లు
2954 రోలు కరు వెరుగరు
2955 రోలు వెళ్లి మద్దెలతో మొరపెట్టు కున్నట్లు
2956 రోషములేని బంటుకు మోసము లేదు
2957 రోషానకు రోలు మడకు కట్టు కున్నట్లు
రౌ
2958 రౌతు కొద్దీ గుఱ్ఱము
2959 రౌతు మెత్తనైతే గుఱ్ఱము మూడు కాళ్ళతో నడుచును
2960 రేవతి వర్షం సర్వ సస్యములకు రమణీయము
2961 రోహిణి యెండకు ఱోళ్ళు పగులును
2962 రైతుబీద అయితే పొలంబీద
2963 రెంటికిం చెడ్డ రేవనివలె
2964 రెక్కలు విరిగిన పక్షి వలె ఉన్నాడు
ల
2965 లంక కాల్చినవాడు హనుమంతుడు
2966 లంకమేతకు యేటియీతకు సరి 2967 లంకలో పుట్టిన వారెల్లా రాక్షసులే
2968 లంచము పెట్టినదిమాట పుంజము పెట్టినది బట్ట
2969 లంజకు పిల్ల తగలటం
2970 లంజకొడుకు తండ్రికి తద్దినం పెట్టినట్లు
2971 లంజచెడి యిల్లాలైల్నది
2972 లంజ పితాళ్ళకు పెట్టి ఆకాశం చూచినట్లు
2973 లంజబిడ్డకు తండ్రియెవరు
2974 లంజలు లేకపోతే గుడేరంజిల్లును ప్రజల మనస్పూరంజిల్లును
2975 లక్కసాసొసులు తొడుకొని లటలట పోతావుగాని వాకిలి యెవడు నూకు తాడోయి వన్నెకాడ
2976 లక్షణాలుగల బావ గారికి రాగిమీసాలు అవలక్షణాలు గల బావగారికి అవీలేవు
2977 లక్ష నక్షత్రాలైనా ఒక చంద్రుడు కాడు
2978 లడాయి అంటే వెనుకకు పోతాడు అన్నమంటే ముందుకు పోతాడు
2979 లక్షణం చెడితే అవలక్షణం
2980 లడాయి వచ్చినప్పుడా కత్తులు చేసుకోవడం
లా
2981 లాభము గూబల్లోకి వచ్చినది
2982 లాభములేనిది పెట్టి యేటపడడు లి
2988 లింగంమీద యెలుక
లు
2984 లుచ్చాలకు లక్షలుదొరుకును సజ్జనులకు సొక్కానీ దొరకదు
లే
2985 లేకలేక లోకాయ పుట్టితే లోకాయ కన్ను లొట్ట
2986 లేకుండాచూచి పోకుండా రాబట్టు
2987 లేడికి లేచిందే ప్రయాణం
2988 లేనిదానికి పోగా ఉన్న దూడినట్లు
2989 లేనిఉదారికంటే కలిగిన మొడిమేలు
2990 లేనిబావకంటె కలిగిన మొండిమేలు
2991 లేవలేని అత్తకు వోపలేనికోడలు
2992 లేస్తే కొరగాను భాయీ
2993 లేనివాడు పుడమిలేనివాడు
లో
2994 లోగుట్టు పెరుమాళ్ళ కెరుక
2995 లోభికి నాలుగందాలనష్టం
2996 లోభికి యిబ్బడివ్యయం 2997 లోభికి రెంటనష్టి
2998 లోకమంతా సంపాదించి ప్రాణం పోగొట్టు కుంటే యేమి లాభం
2999 లోభిని చంపవలె నంటే దబ్బు అడిగితే సరి
3000 లోభిసొమ్ము గొంగలపాలు
3001 లోని ముయ్యగలరు గాని లోకం ముయ్యగలరా
3002 లోపాలులేనిపాలన వంకరలేని కుక్కతోక ఆదర్శ మంత్రాలు
3003 లోనవికారము బైట శృంగారము
3004 లబ్డుడికి పనినిండా, లుబ్డుడికి ఖర్చునిండా
వ
3005 వంకర టింకర కాయలు యేమెటంటే చిన్ననాడమ్మిన చింతకాయలు
3006 వంకలేనమ్మ డొంకపట్టుకు వేళ్ళాడినదట
3007 వంకాయ రుచి తోటవాడెరుగును, అరటికాయ రుచి రాజెరుగును
3008 వంగతోటలో వానికి కనిగుడ్ది, ఆకుతోటలోవానికి విని చెవుడు
3009 వంగసములో పుట్తినది పొంగలి పెట్టితే పొతుందా
3010 వంటంతా అయిందిగాని వడ్లు వొక పొలుపు యెండవలసింది
3011 వంటింటి కుందేటిని చంపినట్లు