లోకోక్తి ముక్తావళి/సామెతలు-ఐ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


675 ఏరు ఏడామాడవుండగానే చీరవిప్పి చంకన బెట్టుకొని పోయినట్లు

676 ఏరుకొని తినే పక్షి ముక్కున ముల్లు విరిగినట్లు

677 ఏరు తీసినట్లు

678 ఏయెండ కా గొడుగు

679 ఏరు నిద్రపోయినట్లు

680 ఏరు మూరెడు తీస్తే కయ్య బారెడు తీస్తుంది.

681 ఏరెంత పారినా కుక్కకు గతుకు నీళ్ళే

682 ఏరెన్ని వంకలు పోయినా సముద్రములోకే

683 ఏరుదాటి తెప్ప కాల్చినట్లు

684 ఏదుముందా ? ఏరువాక ముందా!

685 ఏరైనా మూడు నేరాలు కాస్తుంది

686 ఏలినవారికి వూళ్లు లేకపోతే ఎత్తుకు తినడానికి లేవా?

687 ఏలుకోవడానికి వూళ్లు లేకపోతే ఎత్తుకు తినడానికి లేవా?

688 ఏలేవాని యెద్దు పోతేనేమి, కాచేవాని కన్ను పోతేనేమి?

689 ఏవూరు యేతము అంటే, దువ్వూరే దూలమా అందిట

690 ఏపాటా చావకపోతే బాపట్లపంపండి

691 ఐశ్వర్యానికి అంతంలేదు

692 ఐసా పైసా