లోకోక్తి ముక్తావళి/సామెతలు-ఒ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


లోకోక్తి ముక్తావళి
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


693 ఒక అబద్ధము కమ్మడానికి వెయ్యి అబద్ధములు కావలెను

694 ఒంటికిలేని వ్యాధి కొనితెచ్చుకున్నట్లు

695 ఒంటికి ఓర్వలేనమ్మ రెంటికీవోర్చు

696 ఒక కంచానతిని ఒక మంచాన పండుకొనేవారు

697 ఒక కంట సున్నము ఒకకంట వెన్నయు పెట్టుకొన్నట్లు

698 ఒక కలకంటే తెల్లవారుతుందా

699 ఒకటేదెబ్బ రెండేముక్కలు

700 ఒకటొకటిగా నూరా ఒకేమాటు నూరా

701 ఒకనాటి భాగవతముతో మూతిమీసాలన్నీ తెగగాలింవి

702 ఒకనాడువిందు ఒకనాడు మందు

703 ఒకనాడు ధారణ ఒకనాడు పారణ

704 ఒకనికి ఇగురుకూరయిష్టము ఒకనికి పులుసుకూరయిష్టము

705 ఒకపూట తినేవాడు యోగి, రెండుపూటలా తినేవాడు భోగి, మూడుపూటాలా తినేవాడు రోగి

706 ఒకచెయ్యి తట్టితే చప్పుడగునా

707 ఒక యెరలో రెండుకత్తులిమడవు

708 ఒక బర్రె పూసుకొన్నది కాక అన్నిబర్రెలకు పూసెను

709 ఒక కలిమికి యేడిస్తే ఒకకన్ను పోయినది, తనలెమికి యేడిస్తే రెండవకన్ను పోయింది

710 ఒకరిద్దరిని చంపితేగాని వైధ్యుండుగాడు

711 ఒకవూరికి వెయ్యి దోవలు 712 ఒక్కకొడుకని ముద్దుగాచూస్తే మిద్దెయెక్కి వెశ్యలను చూచినాడట

713 ఒక్కకొడుకు కొడుకుకాడు ఒకకన్ను కన్నూకాదు

714 ఒక్కనాటి భాగవతమునకు ఉన్నమీసాలు గొరిగెనట

715 ఒక్కడి సంపదన పదిమందిపాలు

716 ఒక్కొక్కరాయి తీస్తూవుంటే కొండలైనా తరుగుతవి

717 ఒళ్లువంగనమ్మ కాలిమట్టెలకు కందిపోయిందట

718 ఒళ్లు వంగనివాడు దొంగలో కలిసెనాడట

719 ఒళ్లువాచినరెడ్డీ, వడ్లు యేమిధర అంటే అవిలేకనే నా వొళ్లు వాచిందనాడట

720 ఒళ్లెరుగని శివము మన సెరుగని కల్ల వున్నదా?

721 ఒకడు తింటే మరిఒకడు వాంతిచేసుకున్నట్లు

722 ఒకగబెట్టి తాగేది చరచరాకంచరాడు

723 ఒక చెంప కొట్టితేపాలు ఒకచెంపకొట్టితే నీళ్లు

724 ఒక చేత పసుపు ఒకచేత ముసుగు

725 ఒక్కప్రొద్దుమాట కుక్కయెరుగునా

726 ఇళ్ళంతా తడిసినవెనుక వోపలేనివానికైనా చలిలేదు