లోకోక్తి ముక్తావళి/సామెతలు-కో

వికీసోర్స్ నుండి

1029 కొరివితో తల గోకుకున్నట్లు

1030 కొఱ్ఱకు నక్క కొర్ర

1031 కొలిచేవాడు గుడ్డివాడే, కొలిపించేవాడు గుడ్డివాడే

1032 కొల్లు మునిగిన కొన్నాళ్ళకు కోనామములిగినది

1033 కొల్లెట్లోపండే పంటేగాని చచ్చే దున్నపోతులకు లెక్క లేదు

1034 కొసరిన కూరలో గాని పసలేదు

1035 కొల్లేటి బ్రహ్మహత్య మేపుమీదుగా పోయించి

కో

1036 కోటి విద్యలు కూటి కొరకే

1037 కోడలికి బుద్ధిచెప్పి అత్త రంకునబోయినది

1038 కోడలు కొడుకును కంటానంటే వద్దనే అత్తగారుంటుందా

1039 కోడలు గృహప్రవేశం అత్త గంగా ప్రవేశం

1040 కోడలు నలుపైతే కులమంతా నలుపు

1041 కోటికి కులాసంలేదు, కోమటికి విశ్వాసంలేదు

1042 కోడికున్న కోర్కెలు పిల్లికేమి యెరుక

1043 కోడి గృడ్డంత బంగారం లేనివాడున్నాడా

1044 కోడిగుడ్డు పగులగొట్ట గుండ్రాయి కావలెనా

1045 కోడిని గద్ద తన్నుక పోయినట్లు

1046 కోడిపిల్లమీద పందెపిల్లపడ్డట్టు

1047 కోడిపోయి కొమ్మయెక్కినట్లు

1048 కోతికి అద్దము చూపినట్లు 1049 కోతికి కొబ్బరికాయ దొరికినట్లు

1050 కోతికి జల్తారు కుళ్లాయి

1051 కోతిచావు కోమటిరంకు

1052 కోతిచేతి పామువలె

1053 కోతిచేతి పూలదండ

1054 కోతికిబెల్లం చూపరాదు కోమటికి ధనంచూపరాదు

1055 కోతిపిడికిలి

1056 కోతికి తేలుకుట్టినట్లు

1057 కోతిపుండు బ్రహ్మరాక్షసి

1058 కోతిగురువిందసామ్యం

1059 కొత్తగుడ్డకంటినట్టు రంగు పాతగుడ్డకంటదు

1060 కోనకావలి

1061 కోపము పాపకారణము

1062 కోమటి నిజము

1063 కోమటి పిరికి కొట్టితేవురికి

1064 కోమటి భక్తుడు కాడు తగరం కత్తికాదు

1065 కోమటియిల్లు కాలినట్లు

1066 కోమటి విశ్వాసము

1067 కోమటి సాక్ష్యం

1068 కోలలేనిపెట్టు తాడులేనికట్టు

1069 కోళ్ళకురెక్కలు తాళ్ళకు చళ్ళు వున్నట్లు

1070 కోళ్ళబేరానికివెళ్ళి కోటలో కబుర్లూడిగినట్లు

1071 కోవెలపోయి కొమ్మ యెక్కినట్లు 1072 కోమట్ల కొట్లాట గోచిపుగులాట

1073 క్షేత్రమెరిగి విత్తనము పాత్రమెరిగి దానము

1074 ఖాజీని పాజి పాజీని ఖాజి చేసేవాడు

1075 కరువుమానుప పంట, మిడుతల మానుప మంట

1076 కోల ఆడితే కొతి ఆడుతుంది

1077 గతిలేనివాడు గాడిదకాళ్ళు పట్టుతుకున్నట్లు

1078 గంగలో మునిగినా కాకి హంసౌతుందా?

1079 గంగయీతకు లంక మేతకుసరి

1080 గంతకు తగిన బొంత

1081 గంధపుపొడి మోసేగాడిద

1082 గంధపుపొడిలో బూరవూదినట్లు

1083 గంధము అమ్మినచొట కట్టెలు అమ్ముట

1084 గంపసిడిగాదు గాలుపుసిడి

1085 గచ్చపొదమీద యిసుక వేసి కయ్యానికి రమ్మన్నట్లు

1086 గజకచ్చప పోరుచందము

1087 గట్టివాడేగాని కడుపుమాత్రము గుల్ల

1088 గట్టివిడిచి పొట్తుకు పోరాడినట్లు

1089 గట్తుచేరిన వెనుక పుట్టివానితో పోరాడినట్లు

1090 గడియపురసత్తులేదు గవ్వరాకడలేదు

1091 గడ్డం వపనముచ్యతే