లోకోక్తి ముక్తావళి/సామెతలు-కొ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కే

991 కేశవా నారాయణా అవ్వా బువ్వా పెట్టు

కొ

992 కొంగు తడిస్తే చలిగాలి కోకంతా తడిస్తే చలియేమిటి

993 కొండంత దూదికి కొండంత నిప్పు కావలెనా

994 కొండంత దేముణ్ణి కొండంత పత్రితో పూజిస్తారా

995 కొండంత మగడేపోగా గుప్పెడు బొచ్చు కేడ్చినట్లు

996 కొండంత రెడ్డేపోగా పిడికెడు బొచ్చుకేడ్చినట్లు

997 కొండకు ఒక వెంట్రుక ముడివేస్తే వస్తే కొండేవస్తుంది పోతే వెంట్రుకే పోతుంది

998 కొండ తలక్రింద పెట్టుకొని రాళ్ళకొరకు వెతకినట్లు

999 కొండతవ్వి యెలుకను పట్టినట్లు

1000 కొండతో తగరు డీ కొన్నట్లు

1001 కొండానాల్కకు మందువేస్తే వున్న నాలిక వూడినట్లు

1002 కొండను చూచి కుక్కల మొరిగినట్లు

1003 కొండమంగలి క్షవరము

1004 కొండమింగేవానికి గోపురమడ్డమా

1005 కొండమీది గబగబ లేమంటే కోమటిరహస్యాలు

1006 కొండమీదినుంచి పడ్డవానికి గాయములెన్ని

1007 కొండమీదనుండి రాళ్ళు దొల్లించినట్లు

1008 కొండయెక్కేవాని మొలను కొడవలి చెక్కినట్లు

1009 కొండ వలెవచ్చి మంచువలె తేలినట్లు 1010 కొండవీటి చేంతాడు

1011 కొంపతీస్తావా రామన్నాఅంటే అందుకు సందేహమా అన్నట్లు

1012 కొట్టకముందే యేడుస్తావేమీఅంటే ముందు కొట్టెదరేమో అని యెడ్చుచున్నా నన్నట్లు

1013 కొత్తకుండలో జోరీగ చొచ్చినట్లు

1014 కొత్తది గొర్రెలమడుగు పాతరి డర్రెలమడుగు

1015 కొనబోతే కొరివి అమ్మబోతే అడివి

1016 కొత్తనీరువచ్చి పాతనీరు కొట్టుకుపోయినట్లు

1017 కొత్తనీళ్ళకు చేపలు యెదురీది నట్లు

1018 కొత్తబిచ్చగాడు పొద్దెరుగడు

1019 కొత్తవింత పాతరోత

1020 కొనగా తీరనిది కొసరగా తీరునా

1021 కొత్త అప్పుకుపోతే పాత అప్పు పైనపడ్డది

1022 కొన్నది వంకాయ్ కొసిరేది గుమ్మడికాయ

1023 కొనజాలకు కోతిపుట్టితే, కులము వాళ్ళంతా కూడి కుక్క అని పేరు పెట్టినారట

1024 కొన్నవా'దికికన్న తిన్నవాడే మేలు

1025 కొన్నవాడే తిన్నవాడు

1026 కొబ్బరిచెట్టు ఎందుకు యెక్కుతావురా అంటే దూడ గడ్ది కోసం

1027 కొబ్బరిచెట్టుకు కుడితి మృత్యువు

1028 కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు వెలుతురు 1029 కొరివితో తల గోకుకున్నట్లు

1030 కొఱ్ఱకు నక్క కొర్ర

1031 కొలిచేవాడు గుడ్డివాడే, కొలిపించేవాడు గుడ్డివాడే

1032 కొల్లు మునిగిన కొన్నాళ్ళకు కోనామములిగినది

1033 కొల్లెట్లోపండే పంటేగాని చచ్చే దున్నపోతులకు లెక్క లేదు

1034 కొసరిన కూరలో గాని పసలేదు

1035 కొల్లేటి బ్రహ్మహత్య మేపుమీదుగా పోయించి

కో

1036 కోటి విద్యలు కూటి కొరకే

1037 కోడలికి బుద్ధిచెప్పి అత్త రంకునబోయినది

1038 కోడలు కొడుకును కంటానంటే వద్దనే అత్తగారుంటుందా

1039 కోడలు గృహప్రవేశం అత్త గంగా ప్రవేశం

1040 కోడలు నలుపైతే కులమంతా నలుపు

1041 కోటికి కులాసంలేదు, కోమటికి విశ్వాసంలేదు

1042 కోడికున్న కోర్కెలు పిల్లికేమి యెరుక

1043 కోడి గృడ్డంత బంగారం లేనివాడున్నాడా

1044 కోడిగుడ్డు పగులగొట్ట గుండ్రాయి కావలెనా

1045 కోడిని గద్ద తన్నుక పోయినట్లు

1046 కోడిపిల్లమీద పందెపిల్లపడ్డట్టు

1047 కోడిపోయి కొమ్మయెక్కినట్లు

1048 కోతికి అద్దము చూపినట్లు