లోకోక్తి ముక్తావళి/సామెతలు-రా
య
2879 యజ్ఞానికి యేమి యత్నమంటె కత్తులూ కఠార్లూ
2880 యదార్ధానికి కేడు చుట్లెందుకు
2881 యుగాలనాటిఒ యుధిష్టరుడు
2882 యోగికి భోగికి రోగికి నిద్రలేదు
ర
2883 రంకాడనేర్చినమ్మ బొంకాడనేరదా
2884 రంభచెక్కిలిగొట్టి రాత్నందెచ్చినట్లు
2885 రత్నాలన్నీ ఒక చోట నత్తగుల్లలన్నీ ఒక్కచోట
2886 రత్నాలుతినే పక్షికి రత్నాలు, రాళ్లు తినే పక్షికి రాళ్లు
2887 దక్షించిన వాణ్ణి భక్షించనా
2888 రత్నమురుప్పి గాజునుకోరినట్లు
రా
2889 రాగంరానివాడు రోగంలెనివాడు లేడు
2890 రాగలశని రామెశ్వరంపోయినా తప్పదు
2891 రాగానకునేను అందానకు నాఅప్ప
2892 యాచనదు:ఖ హేతువు
2893 యధాయధలందరు వెల్లువనుపోగా పుల్లాకు నాపనియేమి అన్నదట
2894 రాచపీనుగు తోడులేకుండా చావదు
2895 రాజాంకాయ పిచ్చికొండ యానున్న గార్కి సభాకంపం 2896 రాజా టెంకాయపుచ్చు కోండి మా అన్న గార్కి సభాకంపం
2897 రాజు కూతురైనా ఒకనికి ఆలే
2S98 రాజీకా సౌదా
2899 రాజుచేసిన కార్య్హాలకు రాముండుచేసిన కార్యాలకు యెన్నికలేదు
2900 రాజునకుకంటను పామునకు పంటను విషముండును
2901 రాజుననుసరించి ప్రజయుందురు
2902 రాజును జూచిన కంట మొగుణ్ణిచూస్తే మొట్ట బుద్ధి అయినది
2903 రాజుభార్య మేడయెక్కితే కుమ్మరివాని కోడలు గుడిసెయెక్కింది
2904 రాజు మెచ్చిందిమాట మొగుడు మెచ్చింది రంభ
2905 రాజు యెంతో ధర్మమంతే
2906 రాజు రాకడ లేదు త్రొవనూకుడూ లేదు
2907 రాజుల సొమ్ము రాళ్ళపాలు
2908 రాజులేని వూళ్ళు పూజలెనిగుళ్లు
2909 రాజ్యాలుచెడ్డా లక్షణాలు చెడలేదు
2910 రాటంవచ్చె బండేతీయి దారిలో
2911 రాతనార తీసినట్లు
2912 రాతికుండకు యినుపతెడ్డు
2913 రాతివిగ్రహమునకు జక్కిలించ పెట్టినట్లు
2914 రాత్రిపడ్డ గోతులో పగలుకూడా పడనా
2915 రానివానిమీద రాయి 2916 రామరాజ్యం
2917 రామాయణమంటే యేమో అనుకున్నాను గాని మనిషి బరువుందన్నాడట
2918 రామాయణమంతా విని రాముడికి సీత యేమి కావాలన్నట్లు
2919 రామునితోక
2920 రామయణం రకు, భారతం బండు, భాగవతం బొంకు
2921 రామాయణంలో పిడకల వేట్లాట
2922 రామునివంటి రాజువుంటే హనుమంతునివంటి బంటు వుంటాడు
2923 రామేశ్వరంపోతే శనేశ్వరం యెదుగుగుండా వచ్చినది
2924 రామో లక్ష్మణ మబ్రవీత్
2925 రాయడితలది చాకలిమొలది
2926 రాయిగుద్దనేల చెయ్యినొవ్వనేల
2927 రాలరువ్వ తగినవానిని పూలరువ్వరు
2928 రాళ్ళచెనికి గుంటక తోలినట్లు
2929 రాళ్ళు దొర్లించినట్లు మాట్లాడుతాడు
2930 రాష్ట్రందాగినా రంకు దాగదు
రూ
2931 రూక లేనివాడు పోకచేయడు
2982 రూపాయబిళ్ళ చంద్రబింబంలాగ చెయిజారినట్లు