లోకోక్తి ముక్తావళి/సామెతలు-రూ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2916 రామరాజ్యం

2917 రామాయణమంటే యేమో అనుకున్నాను గాని మనిషి బరువుందన్నాడట

2918 రామాయణమంతా విని రాముడికి సీత యేమి కావాలన్నట్లు

2919 రామునితోక

2920 రామయణం రకు, భారతం బండు, భాగవతం బొంకు

2921 రామాయణంలో పిడకల వేట్లాట

2922 రామునివంటి రాజువుంటే హనుమంతునివంటి బంటు వుంటాడు

2923 రామేశ్వరంపోతే శనేశ్వరం యెదుగుగుండా వచ్చినది

2924 రామో లక్ష్మణ మబ్రవీత్

2925 రాయడితలది చాకలిమొలది

2926 రాయిగుద్దనేల చెయ్యినొవ్వనేల

2927 రాలరువ్వ తగినవానిని పూలరువ్వరు

2928 రాళ్ళచెనికి గుంటక తోలినట్లు

2929 రాళ్ళు దొర్లించినట్లు మాట్లాడుతాడు

2930 రాష్ట్రందాగినా రంకు దాగదు

రూ

2931 రూక లేనివాడు పోకచేయడు

2982 రూపాయబిళ్ళ చంద్రబింబంలాగ చెయిజారినట్లు