వేమన పద్యాలు/హ
హంగుమీరఁ దాను యతులజన్మంబుల
[మార్చు]హంగుమీరఁ దాను యతులజన్మంబుల
నరసి చెప్పునెంతవారికైన
ఆడకాడ కనువు నతిశయమై వచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!
హంస మానసోద మంటక తిరిగిన
[మార్చు]హంస మానసోద మంటక తిరిగిన
యట్టు కర్మచయము నంటకుండ
యోగి తిరుగు సకలభోగంబుతోడను
విశ్వదాభిరామ వినర వేమ!
హింసఁ జేయకుండుటే ముఖ్య ధర్మంబు
[మార్చు]హింసఁ జేయకుండుటే ముఖ్య ధర్మంబు
ఆనక హింసచేసి రవనిసురులు
చావుపశువుఁ దినెడు చండాలుఁడే మేలు
విశ్వదాభిరామ వినర వేమ!
హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా
[మార్చు]హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా
హాని వచ్చు నెంతవాని కైన
ఈఁగ కడుపుఁ జొచ్చి యిట్టట్టు చేయదా
విశ్వదాభిరామ వినర వేమ!
హీనజాతివానికెచ్చు వైష్ణమిచ్చి
[మార్చు]హీనజాతివానికెచ్చు వైష్ణమిచ్చి
ద్విజునికన్న దొడ్డతీరటండ్రు
కల్లు కడవ కడిగి గంగ నించినరీతి
విశ్వదాభిరామ వినురవేమ!
హీననరులతోడ నింతులతోడను
[మార్చు]హీననరులతోడ నింతులతోడను
పడుచువాండ్రతోడ ప్రభువుతోడ
ప్రాజ్ఞ జనులతోడ బ్రహ్మఘ్న జనులతో
వైపు దెలిసి పలుకవలయు వేమ!
హీనుఁ డెన్నివిద్య లిల నభ్యసించిన
[మార్చు]హీనుఁ డెన్నివిద్య లిల నభ్యసించిన
ఘనుఁడు గాఁడు హీనజనుఁడె కాని
పరిమళమ్ము గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ వినర వేమ!
హేమ నగము చేత నెప్పుడు గలవాడు
[మార్చు]హేమ నగము చేత నెప్పుడు గలవాడు
వెండికొండపైన వెలయువాడు
యెత్తవలెసె బిచ్చ మేమన వచ్చురా?
విశ్వదాభిరామ వినురవేమ!
హేమకారవిద్య నెఱిఁగిన వారెల్ల
[మార్చు]హేమకారవిద్య నెఱిఁగిన వారెల్ల
వెతలఁ బడనియట్లు విద్యచేతఁ
దత్వమెఱుఁగు వెనుక తనకుఁ జింతేలరా
విశ్వదాభిరామ వినర వేమ!
హరికి దొరికెనందురా సిరి యప్పుడే
[మార్చు]హరికి దొరికెనందురా సిరి యప్పుడే
దొరికె కాదె విషము హరున కరయ
నెవని కెట్టులగునొ యెవ్వరెఱుగుదురు
విశ్వదాభిరామ వినురవేమ!
హరివిధిసురిమును లాదిని
[మార్చు]హరివిధిసురిమును లాదిని
మెరసియు జన్మించి పిదప మేలులకెడగా
జరయందు మరణమందును
వరుస న్వర్తిలిరి మాయవాసన వేమా!
హృదయమందు నున్నయీశుని దెలియక
[మార్చు]హృదయమందు నున్నయీశుని దెలియక
శిలలనెల్ల మ్రొక్కుజీవులార
శిలల నేమియుండు జీవులందే కాక
విశ్వదాభిరామ వినర వేమ!
హృదయము పదిలంబైనను
[మార్చు]హృదయము పదిలంబైనను
గుదికొను సన్యాసమునకుఁ గొమ్మలు గలవా
యిదియెఱుఁగరు చదువరులటు
మది ముక్తికి నాస్పదంబు మహిలో వేమా!