వేమన పద్యాలు/ఒ
ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయె
[మార్చు]ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయె
వేఱొక్కఁడు భోగి యాయెనటు నొక్కఁడు చక్కనియోగి యాయెఁ
దా నొక్కఁడు రాగియాయె నినుబోలు మహాత్మునిఁగాన మెచ్చట
నిక్కము నిన్నిరూపములు నీకును జెల్లుగదన్న వేమనా!
ఒక్కఘటములోనఁ బెక్కురూపులు నిల్చు
[మార్చు]ఒక్కఘటములోనఁ బెక్కురూపులు నిల్చు
నెన్నియెన్నిరూపు లెసఁగుచుండు
నవియుఁదొలఁగెనేని యన్నియు బయలౌను
ఆత్మతత్వ మిట్టులౌర వేమా!
ఒక్కమనసుతోడ నున్నది సకలము
[మార్చు]ఒక్కమనసుతోడ నున్నది సకలము
తిక్క బట్టి నరులు తెలియలేరు
తిక్క నెఱిఁగి నడువ నొక్కఁడే చాలురా
విశ్వదాభిరామ వినర వేమ!
ఒకటిక్రింద నొక్క డొనర లబ్ధముఁ బెట్టి
[మార్చు]ఒకటిక్రింద నొక్క డొనర లబ్ధముఁ బెట్టి
వలనుగ గుణియింప వరుసఁ బెరుఁగు
నట్టిరీతి నుండు నౌదార్యఫలములు
విశ్వదాభిరామ వినర వేమ!
ఒకరి నోరుఁగొట్టి యొకరు భక్షింతురు
[మార్చు]ఒకరి నోరుఁగొట్టి యొకరు భక్షింతురు
వారినోరు మిత్తి వరుసఁగొట్టు
చేఁపపిండు పిల్ల చేఁపలఁ జంపును
జనుఁడు చేఁపపిండుఁ జంపు వేమ!
ఒకరికీడు వేర ఒకరికి నియ్యడు
[మార్చు]ఒకరికీడు వేర ఒకరికి నియ్యడు
యొకని మేలు వేర యొకరికీడు
కీడుమేలువారు పోడిమి తెలియరు
కాలుడెరుగు వారి గదరవేమ!
ఒడ్డుపొడుగుగల్గి గడ్డంబునిడుపైన
[మార్చు]ఒడ్డుపొడుగుగల్గి గడ్డంబునిడుపైన
దానగుణములేక దాతయౌనె
యెనుము గొప్పదైన యేనుగున్ బోలునా?
విశ్వదాభిరామ వినురవేమ!
ఒడల భూతిఁ బూసి జడలు ధరించిన
[మార్చు]ఒడల భూతిఁ బూసి జడలు ధరించిన
నొడయుఁడైన ముక్తిఁ బడయలేఁడు
తడకబిఱ్ఱుపెట్టఁ దలపుతో సరియౌనె
విశ్వదాభిరామ వినర వేమ!
ఒడలు బడలఁజేసి యోగుల మనువారు
[మార్చు]ఒడలు బడలఁజేసి యోగుల మనువారు
మనసు కల్మషంబు మాన్పలేరు
పుట్టమీదఁ గొట్ట భుజగంబు చచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!
ఒడలుఁ బెంచులంజ యుబ్బకంబుననైన
[మార్చు]ఒడలుఁ బెంచులంజ యుబ్బకంబుననైన
వేగ విటునిమీఁద విఱుఁగఁబడును
పందికొక్కుమీద బండికల్ పడ్డట్లు
విశ్వదాభిరామ వినర వేమ!
ఒరులకొఱకు భూమి నొరసెటివారును
[మార్చు]ఒరులకొఱకు భూమి నొరసెటివారును
అవనిపతికి వశ్యులయినవారు
పాలవంటివారు పన్ను పెట్టెడువారు
వాకెఱుంగరు శాఖవారు వేమా!
ఒల్ల నన్నఁ బోదు నొల్ల ననఁగరాదు
[మార్చు]ఒల్ల నన్నఁ బోదు నొల్ల ననఁగరాదు
తొల్లి చేయునట్టి ధూర్తఫలము
ఉల్లమందు వగవకుండుట యోగ్యంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ఒల్లనిపతి నొల్లనిసతి
[మార్చు]ఒల్లనిపతి నొల్లనిసతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడె
గొల్లండు గాక ధరలో
గొల్లనికిం గలవె వేఱె కొమ్ములు వేమా!