Jump to content

వేమన పద్యాలు/ఘ

వికీసోర్స్ నుండి

ఘంటారావము మదిలో

[మార్చు]

ఘంటారావము మదిలో
వింటిన్నే కంటఁగంటి విమలపుకాంతి
వెంటాడక బ్రహ్మంబును
గంటిని వగ కాదు నన్నుఁ గనుగొన వేమా!

ఘటము జలములందు గగనంబు కనఁబడు

[మార్చు]

ఘటము జలములందు గగనంబు కనఁబడు
ఘటము జలము లేమి గగనమేది
ఘటములోన జ్యోతిఁ గ్రమమునఁ దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!

ఘటముఁగాన్గఁజేసి కామ మెద్దుగఁజేసి

[మార్చు]

ఘటముఁగాన్గఁజేసి కామ మెద్దుగఁజేసి
తెలిసి కర్మములను తిలలుఁ జేసి
తెలిసి గాను గాఁడు తిలకార కాత్మయు
విశ్వదాభిరామ వినర వేమ!