వేమన పద్యాలు/క
కాఁగల పను లెల్లగా కెట్లుపోవును
[మార్చు]కాఁగల పను లెల్లగా కెట్లుపోవును
కాని పనులు భువిని కానె కావు
మహిమవేఱె యుండు మనతోడ నున్నదా
విశ్వదాభిరామ వినర వేమ!
కానిపనులు భువిని కానెకావు మహెమవె
కాఁపు బల్మియున్నఁ గరణాన కది బల్మి
[మార్చు]కాఁపు బల్మియున్నఁ గరణాన కది బల్మి
కరణముబలిమెల్ల గాఁపుబలిమి
కాఁపుసంతసంబు కరణముసంతోష
మరసిచూడ లోకమందు వేమ!
కొంకణంబు పోఁవగుక్క సింహము గాదు
[మార్చు]కొంకణంబు పోఁవగుక్క సింహము గాదు
కాశిబోవఁబంది గజము గాదు
వేఱె జాతివాఁడు వ్రిపుఁడు గాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!
కంటికంటి ననుచుఁ గర్మాధికారంబు
[మార్చు]కంటికంటి ననుచుఁ గర్మాధికారంబు
వెంటఁబట్టి చెడును వెఱ్ఱినరుఁడు
బట్టబయట ముక్తి చాటించిచూడరో
విశ్వదాభిరామ వినర వేమ!
కంటిమంటచేత కాముని దహియించి
[మార్చు]కంటిమంటచేత కాముని దహియించి
కామమునను కడఁగి గౌరిఁ గూడె
నట్టి శివుని తేజ మంటినంతనె చూడ
పూర్వకర్మ ఫలము పోవు వేమ!
కంటిలోనివానిఁ గఱకంఠుఁ డెఱుఁగును
[మార్చు]కంటిలోనివానిఁ గఱకంఠుఁ డెఱుఁగును
గంటిలోనివాని మింటఁ జూడ
కన్నుమిన్ను హృదయంబాయె నెంచంగ
విశ్వదాభిరామ వినర వేమ!
కండకావరమునఁ గానఁడు మరణంబు
[మార్చు]కండకావరమునఁ గానఁడు మరణంబు
మదముచేతఁ దత్వమహిమఁ గనఁడు
భోగవాంఛచేతఁ బుణ్యంబుఁ గానఁడు
విశ్వదాభిరామ వినర వేమ!
కొండెగాఁడు చావఁ గొంపదనుకఁ బోక
[మార్చు]కొండెగాఁడు చావఁ గొంపదనుకఁ బోక
వంతు కింతెకాని వగపులేదు
కొంకనక్క చావ గొఱ్ఱెలేమిటి కేడ్చు
విశ్వదాభిరామ వినర వేమ!
కొండరాళ్లు దెచ్చి కోరికఁ గట్టిన
[మార్చు]కొండరాళ్లు దెచ్చి కోరికఁ గట్టిన
గుళ్ళలోనఁదిరిగి కుళ్ళ నేల
పాయని శివుఁడు ప్రాణమై యుండంగ
విశ్వదాభిరామ వినర వేమ!
కొండఱేఁడు మామ కొండకూతురు నాలు
[మార్చు]కొండఱేఁడు మామ కొండకూతురు నాలు
కొండ యిల్లు పసిఁడికొండ విల్లు
కొండవంటి దొరకు గుండురూపంబురా
విశ్వదాభిరామ వినర వేమ!
కండలెల్లఁ గోయ కావికిఁజాలని
[మార్చు]కండలెల్లఁ గోయ కావికిఁజాలని
బండగోవు కాసపడినఁ గలదె
కొండఁ బసిఁడి కొండ గోరిన చందమౌ
విశ్వదాభిరామ వినర వేమ!
కాంత కుంకయైనఁ గానికులం బైనఁ
[మార్చు]కాంత కుంకయైనఁ గానికులం బైనఁ
బాయలేక విటుఁడు బ్రమసియుండు
మరగి గ్రుడ్డికుక్క మాంసంబు గన్నట్లు
విశ్వదాభిరామ వినర వేమ!
కాంతమేనుఁజూచి కలవరపడుదురు
[మార్చు]కాంతమేనుఁజూచి కలవరపడుదురు
కడుపులోని రోతఁ గాన లేరు
యింతరోఁత బ్రతుకు కీ దేహ మేలరా
విశ్వదాభిరామ వినర వేమ!
కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి
[మార్చు]కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి
పరగ హృదయ మట్టె పదిలపఱచి
గృహము నిల్పువాఁడు బహుతత్వ్తవేదిరా
విశ్వదాభిరామ వినర వేమ!
కంబళములఁ గట్టి గంటలు గజ్జలు
[మార్చు]కంబళములఁ గట్టి గంటలు గజ్జలు
బోడితలలు కావి బొంతచిటికె
లాత్మదేవపూజ లవి సేయనేరవు
విశ్వదాభిరామ వినర వేమ!
కాకిగూటిలోన కోకిల మున్నట్లు
[మార్చు]కాకిగూటిలోన కోకిల మున్నట్లు
భ్రమర మగుచుపురుగు బ్రతికినట్లు
గురుని గొల్చువెనుక గురువు తా నౌనయా
విశ్వదాభిరామ వినర వేమ!
కాకు లున్నగూడు కోకిల కగునట్లు
[మార్చు]కాకు లున్నగూడు కోకిల కగునట్లు
భ్రమరి కీటకమయి బ్రతుకుమాడ్కి
సత్యముక్తలని చెలఁగును నరుఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!
కచ్చమీఁద నాస కనకంబుపై నాస
[మార్చు]కచ్చమీఁద నాస కనకంబుపై నాస
లేనివాఁడు పుడమి లేనివాఁడు
కలిగెనేని యతఁడు గానంగ రాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!
కొట్టినఁ దిట్టినఁ గాని
[మార్చు]కొట్టినఁ దిట్టినఁ గాని
కట్టు బిగించినను గాని కరకరి సేయ
కట్టడివడి యన కుండును
దిట్ట మదిని శివుని దలఁప దీరదు వేమా!
కట్టెపైన నున్న కట్టెకు ఘనమేమి
[మార్చు]కట్టెపైన నున్న కట్టెకు ఘనమేమి
చెట్టు పైననున్నఁ జేరు ఘనము
కట్టెచెట్టుగూడి గలసె దైవంబులో
విశ్వదాభిరామ వినర వేమ!
కట్టెపేరు లోలిగట్టి చెప్పఁగ రాదు
[మార్చు]కట్టెపేరు లోలిగట్టి చెప్పఁగ రాదు
కానరాదు లోని కలిమితనము
జంగమయినపిదప జాతి నెంచరాదు
విశ్వదాభిరామ వినర వేమ!
కట్టువార లేరి కట్టినవారేరి
[మార్చు]కట్టువార లేరి కట్టినవారేరి
కట్టికట్ట లేని కర్ము లేరి
గట్టిపఱచిలెస్స గనుగల్గి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!
కడఁక నింద్రియములు గట్టి వేయగ లేక
[మార్చు]కడఁక నింద్రియములు గట్టి వేయగ లేక
చావు వచ్చునపుడు సన్యసించు
నాత్మ జితములేక యందునా మోక్షము
విశ్వదాభిరామ వినర వేమ!
కడఁగి సంకల్పములనెల్లఁ గట్టిపెట్టి
[మార్చు]కడఁగి సంకల్పములనెల్లఁ గట్టిపెట్టి
చిత్తమున నేమి తలఁపక చిత్రరూపు
కైవడిని నున్న యాతఁడు ఘనుఁడు దలఁప
నడవియందైనఁ బట్టణమందు వేమా!
కడక నఖిలమునకు నడినాళమం దున్న
[మార్చు]కడక నఖిలమునకు నడినాళమం దున్న
వేఁగుచుక్కవంటి వెలుఁగు దిక్కు
వెలుఁగుకన్న దిక్కు వేఱెవ్వ రున్నారు
విశ్వదాభిరామ వినర వేమ!
కడగిఁ గాలిలేని గగనంబుభంగిని
[మార్చు]కడగిఁ గాలిలేని గగనంబుభంగిని
బలుతరఁగలు లేని జలధిమాడ్కి
నిర్వికారమునను నిశ్చలత్వమునఁ దా
నుండెనేని ముక్తి యొనరు వేమ!
కడగివట్టియాస కడతేఱనీయదు
[మార్చు]కడగివట్టియాస కడతేఱనీయదు
ఇడుములందుఁ బెట్టి యీడ్చుఁగాని
పుడమి జనులభక్తిఁ బొడమంగ నియ్యదు
విశ్వదాభిరామ వినర వేమ!
కొడుకును వరియింప గోరి వచ్చిన దాని
[మార్చు]కొడుకును వరియింప గోరి వచ్చిన దాని
తండ్రి పెండ్లియాడ ధర్మమగునె!
తప్పని తెలిసియును తాచేయు కర్మంబు
తప్ప దేవుడు భువిని దగులు వేమ!
కడుపు కెంత నరులు కళవళపడుదురు
[మార్చు]కడుపు కెంత నరులు కళవళపడుదురు
కడుపుకొఱకు నూళ్ళు గహనములును
కడుపు కెట్ల యయినఁ గలుగును భుక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ!
కడుపు బోరగించి కన్నులు ముకుళించి
[మార్చు]కడుపు బోరగించి కన్నులు ముకుళించి
బిఱ్ఱబిగిసికొన్న బీదయోగి
యమునిబాఱిగొఱ్ఱె యతఁ డేమిసేయును
విశ్వదాభిరామ వినర వేమ!
కడుపుకేల మనసు కలవరపడియెదు
[మార్చు]కడుపుకేల మనసు కలవరపడియెదు
కడుపుకేట్లొ తృప్తి కలుగుచుండు
కడుపు రాతిలోన కప్పకు కల్గదా
విశ్వదాభిరామ వినురవేమ!
కడుపుచిచ్చుచేత కామానలముచేత
[మార్చు]కడుపుచిచ్చుచేత కామానలముచేత
క్రోధవహ్నిచేత కుతిలపడకను
యుక్తమనసుతోడ నుండినప్పుడె ముక్తి
విశ్వదాభిరామ వినర వేమ!
కడుపునిండ సుధను గ్రమముతోఁ ద్రావిన
[మార్చు]కడుపునిండ సుధను గ్రమముతోఁ ద్రావిన
బాలమీఁద నేల పాఱు మనసు?
తత్వ మెఱుఁగువెనుక తన్వంగు లేటికో?
విశ్వదాభిరామ వినర వేమ!
కడుపులోనిరోఁత కడు నోటియెంగిలి
[మార్చు]కడుపులోనిరోఁత కడు నోటియెంగిలి
కడుగ వశమె బ్రహ్మకొడుకుకైన
సత్యమున్న కొంత జగతిపై సిద్ధించు
విశ్వదాభిరామ వినర వేమ!
కోతిపిల్లతెచ్చి కొత్తపుట్టముగట్టి
[మార్చు]కోతిపిల్లతెచ్చి కొత్తపుట్టముగట్టి
కొండముచ్చులెల్ల కొల్చినట్టు
నీతిహీనువద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినర వేమన !
కాదని యెవ్వరి తోడను
[మార్చు]కాదని యెవ్వరి తోడను
వాదాడక దిరుగు వెఱ్ఱివాఁడును వలెనే
భేదాభేదము లడచును
వేదాంత రహస్య మెల్ల వేమన నేర్చు!
కాదు కాదు గురులు 'క' గుణింతము చెప్ప
[మార్చు]కాదు కాదు గురులు 'క' గుణింతము చెప్ప
శాస్త్ర పాఠములను చదివి చెప్ప
ముక్తి దారి చూపు మూలమ్ము గురుడు రా
విశ్వదాభిరామ వినుర వేమ!
=== కాని వాని చేత కాసు వీసము లిచ్చి ===
<poem>కాని వాని చేత కాసు వీసము లిచ్చి
వెంటఁ దిరుగు టెల్ల వెఱ్ఱి తనము
పిల్లిఁ బట్ట కోడి పిలిచినఁ బలుకునా?
విశ్వదాభిరామ వినర వేమ!
కనక మృగము భువిని కలుగ దంచెరుగడో
[మార్చు]కనక మృగము భువిని కలుగ దంచెరుగడో
రాము డెరుకకల్గు రాజుకాడొ
చేటుకాలమునకు చెడుబుద్ది పుట్టెడు
విశ్వదాభిరామ వినురవేమ!
కనకపర్వతమున కాపురంబుండిన
[మార్చు]కనకపర్వతమున కాపురంబుండిన
అమరవిభునికైన ఆశపోదు
కనకకుండలములు కర్ణు నర్దింపడా
విశ్వదాభిరామ వినురవేమ!
కనకమందు, మంచి కాంతల వాడల
[మార్చు]కనకమందు, మంచి కాంతల వాడల
వలసియుందు రెంతవారలైన
తోయజాక్షి బాయు దొరలెవ్వరును లేరు
విశ్వదాభిరామ వినురవేమ!
కనకమేడల మంచి కాంతలయెడలను
[మార్చు]కనకమేడల మంచి కాంతలయెడలను
వలఁచియుందు రెంతవారలైన
తోయజాక్షిఁ బాయుదొర లెవ్వరును లేరు
విశ్వదాభిరామ వినర వేమ!
కనకమృగము భువినికద్దు, లేదనలేక
[మార్చు]కనకమృగము భువినికద్దు, లేదనలేక
తరుణి విడిచిపోయె దాశరధియు
దైవమైన ధనము తలచుచుండునుగాదె
విశ్వదాభిరామ వినురవేమ!
కన్నె, వరుడు, చేరి, కదియంగ, నొక్కప్పు
[మార్చు]కన్నె, వరుడు, చేరి, కదియంగ, నొక్కప్పు
డుచ్చయందు బిండ ముద్భవించు
హెచ్చు కులజుడెవడు హీనుం డెవండురా
విశ్వదాభిరామ వినురవేమ!
కన్నపుత్రునాస, కనకంబుమీ దాస,
[మార్చు]కన్నపుత్రునాస, కనకంబుమీ దాస,
స్త్రీలమీదయాస చిత్తమెడలి
భ్రమలువిడువకున్న బ్రహ్మంబు తోచునా
విశ్వదాభిరామ వినురవేమ!
కన్నుఁగవరీతి సంపద
[మార్చు]కన్నుఁగవరీతి సంపద
కొన్నాళ్ళకు వ్రేగుఁజూపి గొబ్బున వ్రాలు
వెన్నెల చీఁకటి సరి యగు
నన్నా శివంగమాయ లన్నియు వేమా!
కన్నుపోవువాఁడు కాళ్లుపోయినవాఁడు
[మార్చు]కన్నుపోవువాఁడు కాళ్లుపోయినవాఁడు
నుభయులరయఁ గూడి యుండునట్లు
పేద పేదఁగూడి పెనగొని యుండును
విశ్వదాభిరామ వినర వేమ!
కన్నులందు మదము గప్పి కానరుగాని
[మార్చు]కన్నులందు మదము గప్పి కానరుగాని
నిరుడు మీదటేఁడు నిన్న మొన్న
దగ్ధులయిన వారు తమకంటెఁ దక్కువా
విశ్వదాభిరామ వినర వేమ!
కనియుఁ గాన లేఁడు కదలింపఁ డానోరు
[మార్చు]కనియుఁ గాన లేఁడు కదలింపఁ డానోరు
వినియు వినగ లేఁడు విస్మయమున
సంపద గల వాఁడు సన్నిపాతక మది
విశ్వదాభిరామ వినర వేమ!
కనియుండి కానలేరట
[మార్చు]కనియుండి కానలేరట
వినియుండియు వినగలేరు విస్మయమేమో
కనుగ్రుడ్డియు వినుచెవుడుం
చనునది నిజమయ్యె జగమునందున వేమా!
కానలేఁడు నుదురు కర్ణముల్ వీఁపును
[మార్చు]కానలేఁడు నుదురు కర్ణముల్ వీఁపును
నెఱులు కానలేఁడు నెత్తిమీఁద
తన్ను గానలేఁడు తత్వ మేమెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ!
కానలేరు గాని కలియుగంబుననున్న
[మార్చు]కానలేరు గాని కలియుగంబుననున్న
మనుజులందఱికిని మాన మొకటి
దౌష్టికు లగువారు తమవలెఁ జూడక
పరులఁదూల నాడుదురుగ వేమ!
కానివాని తోడఁ గలసి వర్తించెనా
[మార్చు]కానివాని తోడఁ గలసి వర్తించెనా
హాని వచ్చు నెంతవాని కైన
తాటిక్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినర వేమ!
కనుక గ్రామమునకుఁ గారణకర్తలి
[మార్చు]కనుక గ్రామమునకుఁ గారణకర్తలి
ట్లుండయగుచు నుభయులుండిరేని
గండపక్షియుగళ ముండినరీతిని
నుద్దిగూడి బ్రతుకుచుంద్రు వేమ!
కపట వేషమూని కడగండ్లుపడనేల
[మార్చు]కపట వేషమూని కడగండ్లుపడనేల
విపిన భూమి తిరిగి విసుగ నేల
యుపముతోనె ముక్తి యున్నది కనవలె
విశ్వదాభిరామ వినురవేమ!
కప్పయు పామును బోరఁగ
[మార్చు]కప్పయు పామును బోరఁగ
కప్పను నాపాముమ్రింగె కడువేడుకతో
కప్పను చెడలందిగిచెడి
విప్పను నా చొప్పు దెలియ వేమననేర్చు!
కప్పురంబు మనసు గాంక్షించుయోగికి
[మార్చు]కప్పురంబు మనసు గాంక్షించుయోగికి
జ్ఞానదీపశిఖయుఁ దానటించుఁ
గానవచ్చు నాత్మ క్రమమాణమై నిచ్చ
విశ్వదాభిరామ వినర వేమ!
కోపమునను ఘనత కొంచెమై పోవును
[మార్చు]కోపమునను ఘనత కొంచెమై పోవును
కోపమునను మిగుల గోడుఁజెందుఁ
గోపమడచెనేని గోరిక లీడేరు
విశ్వదాభిరామ వినర వేమ!
కోపమునను నరక కూపముఁ జెందును
[మార్చు]కోపమునను నరక కూపముఁ జెందును
కోపమునను గుణము కొంచె మగును
కోపమునను బ్రతుకు కొంచెమై పోవును
విశ్వదాభిరామ వినర వేమ!
కామి కానివాఁడు కవి గాఁడు రవి గాడు
[మార్చు]కామి కానివాఁడు కవి గాఁడు రవి గాడు
కామిగాక మోక్షకామి గాఁడు
కామియైనవాఁడు కవియగు రవియగు
విశ్వదాభిరామ వినర వేమ!
కోమటికిక యాశ కొండలు వాములు
[మార్చు]కోమటికిక యాశ కొండలు వాములు
చందనంబు శోభ చంద్రకళలు
తనకు మితిలేదు నక్కడ గతిలేదు
వదన శుద్ధిలేనివాఁడు వేమా!
కోమటోనినిష్ట గురికి రాదెన్నడు
[మార్చు]కోమటోనినిష్ట గురికి రాదెన్నడు
లోభగుణముచేత లోనికడగు
పులియు దాసరికడ పొలపగుచందము!
విశ్వదాభిరామ వినురవేమ!
కోమటోనియాశ కొండల్లవానలు
[మార్చు]కోమటోనియాశ కొండల్లవానలు
సుందరంబుశోభ చంద్రకళలు
యాశకు మితిలేదు యెక్కడన్ గతిలేదు
విశ్వదాభిరామ వినురవేమ!
కోమటినిష్ఠలు గుఱికి రావెన్నఁడు
[మార్చు]కోమటినిష్ఠలు గుఱికి రావెన్నఁడు
లోభగుణము చేతలోని కడఁగు
పులియు దాసరి కీడుపొలువగు చందమౌ
విశ్వదాభిరామ వినర వేమ!
కొమ్మదిమ్మరైనఁ ద్రిమ్మరులవలదు
[మార్చు]కొమ్మదిమ్మరైనఁ ద్రిమ్మరులవలదు
సరసవిటులనేల సమ్మతించు
పేడతిన్న పురుగులెల్ల మేమెఱుఁగురా
విశ్వదాభిరామ వినర వేమ!
కమలభవాండం బెల్లను
[మార్చు]కమలభవాండం బెల్లను
విమలపుసుజ్ఞానులెల్ల నీక్షింతురయా
విమలంబౌ మనముదగ
సుమహిత పిండాండ మెపుడు చూడర వేమా!
కాయగూరలుతిని కాషాయవస్త్రముల్
[మార్చు]కాయగూరలుతిని కాషాయవస్త్రముల్
బోడినెత్తి గలిగి పొరయుచుండ్రు
తలలు బోడులైనఁ దలఁపులు బోడులా
విశ్వదాభిరామ వినర వేమ!
కాయముఁదగఁ గూడి కడఁగి యోగిగనున్న
[మార్చు]కాయముఁదగఁ గూడి కడఁగి యోగిగనున్న
కాయ ముండికాని ఘనుఁడు గాఁడు
కాయమునను ముక్తిగతి కేగవలెనయా
విశ్వదాభిరామ వినర వేమ!
కరఁగకరగఁబుట్టు కనకంబునకు వన్నె
[మార్చు]కరఁగకరగఁబుట్టు కనకంబునకు వన్నె
పెనఁగ పెనఁగబుట్టు ప్రేమసతికి
ముదియ ముదియఁ బుట్టు మోహంబు లోభంబు
విశ్వదాభిరామ వినర వేమ!
క్రొత్త సుద్దులైన గురుబోధచే విన్న
[మార్చు]క్రొత్త సుద్దులైన గురుబోధచే విన్న
కర్మయుక్తి యోగకాండ తతులు
ప్రాతసుద్దులైన బాయునా కర్మంబు
విశ్వదాభిరామ వినురవేమ!
కర్మాకర్మము లొక్కటి
[మార్చు]కర్మాకర్మము లొక్కటి
కర్మవినోదునకు దత్వఘనునకు దెలియు
ధర్మాధర్మము లేర్పడ
నిర్మలమతి తెలుపవలయు నిజముగ వేమా!
కర్మగుణము లన్ని కడఁబెట్టి నడువక
[మార్చు]కర్మగుణము లన్ని కడఁబెట్టి నడువక
తత్వమేల దన్ను దగులుకొనును
నూనెలేక దివ్వె నువ్వులమండునా
విశ్వదాభిరామ వినర వేమ!
కర్మఫలములన్ని కపటంబుగాఁ జూచి
[మార్చు]కర్మఫలములన్ని కపటంబుగాఁ జూచి
ధర్మఫలములన్ని దగిలియుండు
ధర్మమర్మములను దాటుట ముక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ!
కర్మమయుఁడుగాక ధర్మంబు దెలియఁడు
[మార్చు]కర్మమయుఁడుగాక ధర్మంబు దెలియఁడు
కర్మజీవి మేలు గానలేఁడు
నీరుచొరక లోతు నికరము దెలియదు
విశ్వదాభిరామ వినర వేమ!
కర్మము జ్ఞానికి దవ్వగు
[మార్చు]కర్మము జ్ఞానికి దవ్వగు
గర్మమునకు జ్ఞాని దవ్వుకలియుగ మందున్
గర్మజ్ఞానము లుడిగిన
నిర్మలునకుఁ గలుగు ముక్తి నిజముగ వేమా!
కర్మమునను బుట్టి కష్టంబులో జేరి
[మార్చు]కర్మమునను బుట్టి కష్టంబులో జేరి
కర్మమేరుపడుట కానలేరు
కర్మబంధమునను కడతేర లేరయా!
విశ్వదాభిరామ వినురవేమ!
కరములందు నమరు గంగాధరునిబట్టి
[మార్చు]కరములందు నమరు గంగాధరునిబట్టి
తీర్ధములకుబోయి తిరుగుచుంద్రు
వెన్నబట్టి నెయ్యి వెదకినచందంబు
విశ్వదాభిరామ వినురవేమ!
క్రొవ్వు పొట్టపొరలు క్రూరకర్ములపొరల్
[మార్చు]క్రొవ్వు పొట్టపొరలు క్రూరకర్ములపొరల్
నొవ్వఁ జేసినట్టి రవ్వపొరలు
నెవ్వరైన నేమి యినజువాకిటఁ గాని
యవ్వలికిని బోవునటర వేమ!
కారుకారు గురులు కాగుణింతముజెప్ప
[మార్చు]కారుకారు గురులు కాగుణింతముజెప్ప
శాస్త్రసారములను జదివిచెప్ప
ముక్తిదారిజూపు మూలమ్ము గురుడురా
విశ్వదాభిరామ వినురవేమ!
కలికిచిత్ర మరయఁ గామునియంత్రంబు
[మార్చు]కలికిచిత్ర మరయఁ గామునియంత్రంబు
పువ్వుఁ బోడిచుక్కబొట్టు గన్న
కాంతిబెళుకు గన్న కడు పొక్కు పుట్టురా
విశ్వదాభిరామ వినర వేమ!
కలిగి ధర్మమీయఁ గాననివారును
[మార్చు]కలిగి ధర్మమీయఁ గాననివారును
కలిగి తినక చాలగ్రాఁగువారు
కలిమి నెచటఁ జూడఁ గానక చెడుదురు
విశ్వదాభిరామ వినర వేమ!
కలిగి పెట్టలేని కర్మజీవులకెల్ల
[మార్చు]కలిగి పెట్టలేని కర్మజీవులకెల్ల
తిరిపెమును దొరకదు దీనులార
తెలియఁ జూచుకొనుఁడు దృష్టాంత మిదిమీకు
విశ్వదాభిరామ వినర వేమ!
కాలగతి యెంతవారికి
[మార్చు]కాలగతి యెంతవారికి
వాలాయము చులక దనము వచ్చుట యరుదా!
వ్రేలన్ గిరినెత్తి కృష్ణుడు
తేలెడు వటపత్రమందు తెలియుము వేమా!
కలిగిన మనుజుండు కాముఁడుసోముఁడై
[మార్చు]కలిగిన మనుజుండు కాముఁడుసోముఁడై
మిగులఁ దేజమునను మెఱయుచుండు
విత్తహీనుఁడైన రిత్తయై పోవును
విశ్వదాభిరామ వినర వేమ!
కలిగిపెట్టబోని కర్మజీవులకెల్ల
[మార్చు]కలిగిపెట్టబోని కర్మజీవులకెల్ల
తిరిపెమును దొరుకదు దీనులారా
తెలియ చూచుకొనుడు దృష్టాంతమదె మీకు
విశ్వదాభిరామ వినురవేమ!
కాలచక్ర మెఱుఁగఁగా లేక యెప్పుడు
[మార్చు]కాలచక్ర మెఱుఁగఁగా లేక యెప్పుడు
సంధ్యజపముసేయు జాణలార
సంధ్యజపములోన జాడ లెట్లుండును
విశ్వదాభిరామ వినర వేమ!
కలిమి కలిగెనేని కాముగాఁజూతురు
[మార్చు]కలిమి కలిగెనేని కాముగాఁజూతురు
లేమిచేతఁ జిక్క లేమ లధిపు
మదనువంటివాని మాలఁగాఁ జూతురు
విశ్వదాభిరామ వినర వేమ!
కలిమి కల్గనేమి కరుణలేకుండెనా
[మార్చు]కలిమి కల్గనేమి కరుణలేకుండెనా
కలిమి యేలనల్ప కర్ములకును
తేనెఁగూర్చి యీఁగ తెరువునఁ బోవదా
విశ్వదాభిరామ వినర వేమ!
కలిమి నాఁడు నరుఁడు కానఁడు మదమున
[మార్చు]కలిమి నాఁడు నరుఁడు కానఁడు మదమున
లేమి నాఁడు మొదలె లేదు పెట్టఁ
గలిమి లేమి లేని కాలంబు గలుగునా?
విశ్వదాభిరామ వినర వేమ!
కలిమిచూచి ఈయ కాయమిచ్చినయట్లు
[మార్చు]కలిమిచూచి ఈయ కాయమిచ్చినయట్లు
సమునకీయ నదియు సరస తనము
పేదకిచ్చు మనువు పెనవేసినట్లండు
విశ్వదాభిరామ వినురవేమ!
కలిమినాఁడు మగని కామిని చూచును
[మార్చు]కలిమినాఁడు మగని కామిని చూచును
లేమిఁజిక్కునాఁడు లేవకుండు
మనినమగనినైన మడియంగఁ జూచును
విశ్వదాభిరామ వినర వేమ!
కల్మషంబు సోఁకఁ గనుపించ దెందును
[మార్చు]కల్మషంబు సోఁకఁ గనుపించ దెందును
రూప మెవ్వరికిని రూఢితోడ
తామసం బుడిగినఁ దగఁగల్గు జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ!
కాలము తన కిక చాలా
[మార్చు]కాలము తన కిక చాలా
కాలము గలదంచునున్న కాలమునందు
కూళఁడు తను దాఁదెలియక
కూలును తొలిజామునందు గొబ్బున వేమా!
కలియుగమునఁ బుట్టి కడతేఱఁగా లేక
[మార్చు]కలియుగమునఁ బుట్టి కడతేఱఁగా లేక
యొడలు బడలఁజేసి యుగ్రతపము
తపసు చేసియేమి తత్వంబుఁ గనలేరు
విశ్వదాభిరామ వినర వేమ!
కలియుగముననున్న కాపు కులానకు
[మార్చు]కలియుగముననున్న కాపు కులానకు
వేమన దనకీర్తి విక్రయించె
నున్న ధర్మమెల్లనుర్విలో నరులకు
కోరుఁ బెట్టె పరముఁ గోరి వేమ!
కల్ల గురుఁడు గట్టు, నెల్ల కర్మంబుల
[మార్చు]కల్ల గురుఁడు గట్టు, నెల్ల కర్మంబుల
మధ్య గురుఁడు గట్టు మంత్ర చయము
నుత్తముండు కట్టు, యోగ సామ్రాజ్యంబు
విశ్వదాభిరామ వినర వేమ!
కల్ల నిజము రెండు కఱకంఠుఁ డెరుగును
[మార్చు]కల్ల నిజము రెండు కఱకంఠుఁ డెరుగును
నీరు పల్ల మెఱుఁగు నిజముగాను
తనయుని జననంబు తల్లిఁదా నెరుగును
విశ్వదాభిరామ వినర వేమ!
కల్లటికెకు భూతి గట్టిగాఁ బెట్టిన
[మార్చు]కల్లటికెకు భూతి గట్టిగాఁ బెట్టిన
నందులోని కంపు లడఁగనట్లు
మెడను త్రాడు వేయ మెఱపుతో ద్విజుఁడౌనె
విశ్వదాభిరామ వినర వేమ!
కల్లలాడుకంటె కష్టంబు మఱిలేదు
[మార్చు]కల్లలాడుకంటె కష్టంబు మఱిలేదు
కష్టమెపుడు కీడుఁ గలిగియుండు
ద్విజుఁడననుట చూడఁ ద్రిమ్మరితన మది
విశ్వదాభిరామ వినర వేమ!
కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు
[మార్చు]కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు
సత్యమాడువాని స్వామి యెఱుంగు
బెక్కుతిండిపోతుఁ బెండ్లా మెఱుంగురా
విశ్వదాభిరామ వినర వేమ!
కల్లుకుండ భూతి గట్టిగా పెట్టిన
[మార్చు]కల్లుకుండ భూతి గట్టిగా పెట్టిన
అందులోని కంపు అడుగునెట్లు
మెడను త్రాడు వేయ మెరయు ద్విజుడౌనె
విశ్వదాభిరామ వినురవేమ!
కల్లునీళ్లు ద్రాగి కడుపెద్ద వారిలో
[మార్చు]కల్లునీళ్లు ద్రాగి కడుపెద్ద వారిలో
చీర విడిచి తిరుగు సిద్ధురాలు
పనులు దీరువెనుక పాతలు గట్టురా
విశ్వదాభిరామ వినర వేమ!
కాలవశముఁ బట్టి కర్మజీవులపిండు
[మార్చు]కాలవశముఁ బట్టి కర్మజీవులపిండు
మత్తులగుచును మదమత్తులైరి
మత్తులయిన జనుల మనసేటి మనసయా
విశ్వదాభిరామ వినర వేమ!
కాలు చేయి లేదు కంచుకంబు గలదు
[మార్చు]కాలు చేయి లేదు కంచుకంబు గలదు
కొమ్మ లేదు ఉరికి చిమ్ము వేగ
గరిడిలేక చంపుఁగడు పెద్దచోద్యమౌ
విశ్వదాభిరామ వినర వేమ!
కాలు చేయి వంచి గాలి నిండఁగఁజేర్చి
[మార్చు]కాలు చేయి వంచి గాలి నిండఁగఁజేర్చి
నేలవ్రాలి కొన్ని నిలిచికొన్ని
యాసనముఖవిద్య లభ్యాస విద్యలు
విశ్వదాభిరామ వినర వేమ!
కలుషమొక్క యింత గాన్పింప దెందును
[మార్చు]కలుషమొక్క యింత గాన్పింప దెందును
జూడ నెవరికైన సొంపుమీఱఁ
దామసం బడంగఁ దావెల్గు జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ!
కలుషమెల్లఁ దెలియఁ దలవంపులకు మూల
[మార్చు]కలుషమెల్లఁ దెలియఁ దలవంపులకు మూల
మరయఁదత్వ మెల్ల నాత్మఁబుట్టు
తెలిసినందుకు మఱిధీరుఁడు గావలె
విశ్వదాభిరామ వినర వేమ!
కాళ్ళ ముంద ఱేకు కడతేర నీదక
[మార్చు]కాళ్ళ ముంద ఱేకు కడతేర నీదక
ముగ్గురు ముగురాండ్ర మునిఁగినారు
నరుఁడు నీఁదెదనుట నగుబాటు గాదయా
విశ్వదాభిరామ వినర వేమ!
కావిపంచె గట్టికడుయోగివలెనుండి
[మార్చు]కావిపంచె గట్టికడుయోగివలెనుండి
వెదకి కోర్కులెల్ల విడిచిపెట్టి
తొడరి తిరుగువాఁడు దొంగసన్యాసిరా
విశ్వదాభిరామ వినర వేమ!
కాశి కాశి యనుచుఁ గడువేడ్కతోఁ బోదు
[మార్చు]కాశి కాశి యనుచుఁ గడువేడ్కతోఁ బోదు
రందుఁగల్గు దేవుఁడిందు లేఁడె
యిందు నందు గలఁడు హృదయంబు లెస్సైన
విశ్వదాభిరామ వినర వేమ!
కాశి బోదు ననుచు గడకట్టగా నేల?
[మార్చు]కాశి బోదు ననుచు గడకట్టగా నేల?
కాశి తీర్థమునకు గదలనేల?
దోషకారి కెట్లు దొరుకురా యాకాశి
విశ్వదాభిరామ వినర వేమ!
కాశి, మధుర, కంచి, గయ. ప్రయాగ సేతు
[మార్చు]కాశి, మధుర, కంచి, గయ. ప్రయాగ సేతు
వాస తోడ వీని నాత్మఁ జూచి
వాసనను దెలియఁడు వట్టివెఱ్ఱివిధంబు
విశ్వదాభిరామ వినర వేమ!
కాశిఁబోవువాని కర్మ మేమని చెప్పఁ
[మార్చు]కాశిఁబోవువాని కర్మ మేమని చెప్పఁ
బాపహేతువుండి చచ్చెనేని
మనసు కాశిఁజేరు మఱి ముక్తి లేదురా
విశ్వదాభిరామ వినర వేమ!
కాశినీళ్ళు మోసి కాళ్లు మొగము వాచి
[మార్చు]కాశినీళ్ళు మోసి కాళ్లు మొగము వాచి
యెందు సుఖము లేక యెండి యెండి
చచ్చివెనుక ముక్తి సాధించఁగలరొకో
విశ్వదాభిరామ వినర వేమ!
కాశియాత్రఁ బోయి గంగదానముఁ జేసి
[మార్చు]కాశియాత్రఁ బోయి గంగదానముఁ జేసి
కష్టపడిరి ముక్తిఁ గానలేక
ఎనుము తిరుగుచుండదే యెద్దువెంబడి
విశ్వదాభిరామ వినర వేమ!
కష్ట లోభి వాని కలిమికి నాశించి
[మార్చు]కష్ట లోభి వాని కలిమికి నాశించి
బడుగు వాఁడు దిరిగి పరిణమించు
తగరు వెంట నక్క దగిలిన చందంబు
విశ్వదాభిరామ వినర వేమ!
క్షితి వెలదికి దగు శృంగాగములు నున్న
[మార్చు]క్షితి వెలదికి దగు శృంగాగములు నున్న
విభుని కరుణలేక వెలయనట్లు
దైవకృపలు లేక తలపులు చెల్లునా
విశ్వదాభిరామ వినురవేమ!
కస్తూరి యటుచూడఁ గాంతి నల్లగనుండు
[మార్చు]కస్తూరి యటుచూడఁ గాంతి నల్లగనుండు
పరిమళించుదాని పరిమళంబు
గురువులయినవారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినర వేమ!
కసవు నేరి తినెడు పసరపు మైఁ దిన
[మార్చు]కసవు నేరి తినెడు పసరపు మైఁ దిన
మాలఁడండ్రు వాని మహిని నరులు
పంది కోడిఁ దిన్న ప్రాజ్ఞులందురు జనుల్
విశ్వదాభిరామ వినర వేమ!
కసువుఁ బసికిఁజేసె, గాలి ఫణికిఁ జేసె;
[మార్చు]కసువుఁ బసికిఁజేసె, గాలి ఫణికిఁ జేసె;
మన్నెఱలకుఁ జేసె, మఱవ కెట్లు;
కుంభిని జనులకును కూడట్లు చేసెరా
విశ్వదాభిరామ వినర వేమ!
కుంటికుక్క కేల కుందేటి పరుపులు
[మార్చు]కుంటికుక్క కేల కుందేటిపరువులు
పిరికిబంటుకేల బిరుదుగొడుగు
ముసలిముండ కేల ముసిముసినవ్వులు
విశ్వదాభిరామ వినర వేమ!
కుండ పగిలెనేని క్రొత్తది కొనవచ్చు
[మార్చు]కుండ పగిలెనేని క్రొత్తది కొనవచ్చు
భూతలంబునందు బొందుగాను
కూలబడిన నరుఁడు కుదురుట యరుదయా
విశ్వదాభిరామ వినర వేమ!
కుండఁగుంభ మండ్రు కొండఁ బర్వతమండ్రు
[మార్చు]కుండఁగుంభ మండ్రు కొండఁ బర్వతమండ్రు
ఉప్పు లవణ మండ్రు నొకటి గాదె
భాషలింతెవేఱు పరతత్వ మొక్కటి
విశ్వదాభిరామ వినర వేమ!
కుక్క గోవు గాదు కుందేలు పులికాదు
[మార్చు]కుక్క గోవు గాదు కుందేలు పులికాదు
దోమ గజము గాదు దొడ్డదైన
లోభి దాత గాఁడు లోకంబు లోపల
విశ్వదాభిరామ వినర వేమ!
కుక్క తిన్నవాఁడు గురిలింగ జంగంబు
[మార్చు]కుక్క తిన్నవాఁడు గురిలింగ జంగంబు
పంది తిన్నవాఁడు పరమయోగి
యేన్గుతిన్నవాఁడు నెంతసుజ్ఞానిరా
విశ్వదాభిరామ వినర వేమ!
కుక్క యేకతంబు కొక్కెరధ్యానంబు
[మార్చు]కుక్క యేకతంబు కొక్కెరధ్యానంబు
గాడ్దెరాగ మెన్నఁ గప్పుముసుఁగు
ఆత్మ యెఱుఁగుభావ మదియేల చేయరో
విశ్వదాభిరామ వినర వేమ!
కుక్క యేమెఱుంగు గురులింగ దేవుని
[మార్చు]కుక్క యేమెఱుంగు గురులింగ దేవుని
నక్క యేమెఱుంగు నొక్కప్రొద్దు
మూర్ఖుఁడే మెఱుంగు మోక్షంబుత్రోవను
విశ్వదాభిరామ వినర వేమ!
కుక్క యేమెఱుంగు గురులింగజంగంబుఁ
[మార్చు]కుక్క యేమెఱుంగు గురులింగజంగంబుఁ
బిక్కనొడిసిపట్టి పీఁకుగాక
సంతపాకతొత్తు సన్యాసి నెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!
కుక్కతోకఁ దెచ్చి గొట్టంబుఁ జేర్చిన
[మార్చు]కుక్కతోకఁ దెచ్చి గొట్టంబుఁ జేర్చిన
గ్రోవిచెంతనుండుఁ గొంతతడవు
ఎంతఁజెప్పఁ జెడుగు పంతంబు మానునా
విశ్వదాభిరామ వినర వేమ!
కుక్కతోలు దెచ్చి యెఱుపుబొమ్మను జేసి
[మార్చు]కుక్కతోలు దెచ్చి యెఱుపుబొమ్మను జేసి
యాడునట్టుచేసి యట్టెవేసె
తన్నుఁ ద్రిప్పువానిఁ దానేలకానఁడో
విశ్వదాభిరామ వినర వేమ!
కుక్కరపవనంబు కొక్కెర ధ్యానంబు
[మార్చు]కుక్కరపవనంబు కొక్కెర ధ్యానంబు
యతులనొసట నొనర నెట్లు వ్రాసె
తొల్లిచేసినట్టి దోషంబు తగిలెనో?
విశ్వదాభిరామ వినురవేమ!
కుక్కల దిని కడుబాపలు
[మార్చు]కుక్కల దిని కడుబాపలు
నక్కను భుజియించువారు నాకేశులగు
చొక్కముగ జీవహత్యల
మిక్కుటముగఁ జేసి తమిని మించిరి వేమా!
కుక్కలగ కసిరి బాపలు
[మార్చు]కుక్కలగ కసిరి బాపలు
నక్కల బూజించి వారు నాకేశునకై
చొక్కముగ జీవహత్యలు
మిక్కుటముగచేసి తమిని మించక వేమా!
కుక్కుటమననంబు కొక్కెర ధ్యానంబు
[మార్చు]కుక్కుటమననంబు కొక్కెర ధ్యానంబు
యతుల నొసట నొనరునట్లు వ్రాసె
తొల్లి చేసినట్టి దోషంబు తగిలెనో
విశ్వదాభిరామ వినర వేమ!
కురుపులు గండముల్ కఠినకష్టపు రోగము లెన్నివచ్చిన
[మార్చు]కురుపులు గండముల్ కఠినకష్టపు రోగము లెన్నివచ్చిన
గరిమను జీవరాసులకు గట్టిగ నాయువు గల్గినంత వే
మరు వగవంగ నేల క్షుధమాయను లేదననేల మూఢుఁడై
యరయ దయాళుఁడైన పరమాత్ముఁడె యొక్కఁడు దిక్కు వేమా!
కులము గలుగువారు గోత్రంబు గలవారు
[మార్చు]కులము గలుగువారు గోత్రంబు గలవారు
విద్యచేత విఱ్ఱవీగువారు
పసిఁడిగల్గువాని బానిసకొడుకులు
విశ్వదాభిరామ వినర వేమ!
కులము లో నొకండు గుణవంతు డుండెనా
[మార్చు]కులము లో నొకండు గుణవంతు డుండెనా
కులము వెలయు వాని గుణముచేత
వెలయ వనము లోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినర వేమ!
కులము లేనివాఁడు కలిమిచే వెలయును
[మార్చు]కులము లేనివాఁడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులముకన్న మిగులకలిమి ప్రధానంబు
విశ్వదాభిరామ వినర వేమ!
కులము హెచ్చుతగ్గు గొడవతొ పనిలేదు
[మార్చు]కులము హెచ్చుతగ్గు గొడవలు పనిలేదు
సానుజాత మయ్యె సకలకులము
హెచ్చుతగ్గుమాట లెటులెఱుంగఁగ వచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!
కులమునీరుచేసి గురువు వధియింప
[మార్చు]కులమునీరుచేసి గురువు వధియింప
పొసగ నేనుగంత బొంకు బొంకె
పేరు ధర్మరాజు పెను వేపవి త్తయా!
విశ్వదాభిరామ వినురవేమ!
కులమువలనఁ గొంత బలిమివలనఁ గొంత
[మార్చు]కులమువలనఁ గొంత బలిమివలనఁ గొంత
కలిమివలనఁ గొంత గర్వమునకు
ఱంకు చదువు చదివి ఱంకునఁ బడుదురు
విశ్వదాభిరామ వినర వేమ!
కులుకుగుబ్బచూపి, గొబ్బునవలపించి
[మార్చు]కులుకుగుబ్బచూపి, గొబ్బునవలపించి
చేతికాసులెల్ల చేరదీయ
నతను చేతి కత్తు లమరంగ కాంతలు
విశ్వదాభిరామ వినురవేమ!
కూటికి నెడఁ బాసి కూర్చున్న మనుజుఁడు
[మార్చు]కూటికి నెడఁ బాసి కూర్చున్న మనుజుఁడు
వెలఁదులఁ గనుగొన్న వెతలఁ జిక్కు
చెలఁగి యగ్నిఁ జూచు శలభంబు చాడ్పున
విశ్వదాభిరామ వినర వేమ!
కూటికి లేనివానివలెఁ గోపములేకయు నెల్లతావుల
[మార్చు]కూటికి లేనివానివలెఁ గోపములేకయు నెల్లతావుల
మాటికిమాటికి మఱియు మాటకుమాటకు పద్యపద్ధతి
ధాటి నెఱుంగఁ జెప్పుచును ధారుణిలో శివరూపధారియై
మాటికి నున్న వేమన సమానము నెవ్వరు గల్గు వేమనా!
కూటికి వగలేక కూర్చున్నవారికి
[మార్చు]కూటికి వగలేక కూర్చున్నవారికి
నాఁడుదానిమీఁది యాస గలదె
యన్నమదముచేత నన్ని మదంబులౌ
విశ్వదాభిరామ వినర వేమ!
కూటవాసి యగుచు గుణములఁ బచరించి
[మార్చు]కూటవాసి యగుచు గుణములఁ బచరించి
నీటనీడవలెను నిలిచియుండు
నుదకఘటములందు నొగిఁదోఁచుటే గాని
సూర్యుఁడొకఁడు గాఁడె చూడ వేమ!
కూడదేమిచేసే? కులమేమిచేసెను!
[మార్చు]కూడ దేమిచేసె గులమేమి చేసెను
భూమి యేమిచేసె బొందికట్టె
నరుఁడు పడెడుపాట్లు నగుబాట్లు చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!
కూడు గుడిచి లెస్స గూర్చున్నవాఁడైన
[మార్చు]కూడు గుడిచి లెస్స గూర్చున్నవాఁడైన
నాడుదానిఁ గన్న నట్టె తగులు
నన్న సారమొడలి కతిమదం బిడుసుమీ
విశ్వదాభిరామ వినర వేమ!
కూడు చీరఁ బాసి గుళ్ళపంచలఁబడు
[మార్చు]కూడు చీరఁ బాసి గుళ్ళపంచలఁబడు
నట్లువ్రాసె బ్రహ్మ యతులనుదుట
తోయజాక్షు లుండ దోషంబు లంటునా
విశ్వదాభిరామ వినర వేమ!
కూడు! బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని
[మార్చు]కూడు! బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని
భక్షణంబుచేయుఁ గుక్షిమలము
కూడు విడిచి మలముఁగుడుచురా యుపవాసి
విశ్వదాభిరామ వినురవేమ!
కూడుఁగుడిచియు శతకోటిపడిగ లెత్తి
[మార్చు]కూడుఁగుడిచియు శతకోటిపడిగ లెత్తి
మాటిమాటికిఁ దినియును మంటఁగలిపి
కాటికేగువేళను రిత్తకూటి కగును
దాటిపోదురు నిజముగ దరికి వేమ!
కూలినాలిచేసి గుల్లాముపనిచేసి
[మార్చు]కూలినాలిచేసి గుల్లాముపనిచేసి
తెచ్చిపెట్ట నాలు మెచ్చనేర్చు
లేమిఁజిక్కువిభుని వేమాఱు దిట్టును
విశ్వదాభిరామ వినర వేమ!
కూళ కూళ్ళు మేయు గుణమంత చెడనాడి
[మార్చు]కూళ కూళ్ళు మేయు గుణమంత చెడనాడి
నెట్టివారు మెచ్చరట్టివాని
కొయ్య దూలమునకుఁ గుదురునా జ్ఞానంబు
విశ్వదాభిరామ వినురవేమ!
కూళకూళ మెచ్చు గుణవంతు విడనాడి
[మార్చు]కూళకూళ మెచ్చు గుణవంతు విడనాడి
యెట్టివారు మెత్తు రట్టివారి
మ్రావిదూలమునకు జ్ఞానంబు తెలియునా
విశ్వదాభిరామ వినర వేమ!