వేమన పద్యాలు/ఉ
ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లు
[మార్చు]ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లు
యుండి యుండి యుండి యుండలేక
ఉండ వెరవు దెలిసి గండిదొంగను బట్టి
చెండిచెండి తావుచేరు వేమా!
ఉండియుండు జ్ఞాని యుగములు చనినను
[మార్చు]ఉండియుండు జ్ఞాని యుగములు చనినను
బ్రాణహాని లేదు ప్రళయమునను
బ్రాణహానియైనఁ బరమాత్ము గలియునో
విశ్వదాభిరామ వినర వేమ!
ఉచితవంతుఁడైన నుద్యోగపరుఁడైన
[మార్చు]ఉచితవంతుఁడైన నుద్యోగపరుఁడైన
సాగుబాటునున్న సమయమునను
పరుల కుపకరించి పరఁగ రక్షించును
విశ్వదాభిరామ వినర వేమ!
ఉచితాహారము వల్లనె
[మార్చు]ఉచితాహారము వల్లనె
యుచితంబుగ బుద్ధిస్థిరత నొప్పునటులనే
ఉచితమగు బోధవల్లనే
సుచరితుడై పరముగాంచుసుమ్ముర వేమా!
ఉడుగక క్రతువుల తపముల
[మార్చు]ఉడుగక క్రతువుల తపముల
నడవుల తీర్థముల తిరిగినంతనే ధరలో
నొడయని కనుగొనజాలడు
కడుథీరత గురుడు తెలుపగలడిది వేమా!
ఉత్తమోత్తముండు తత్వజ్ఞుఁ డిలమీద
[మార్చు]ఉత్తమోత్తముండు తత్వజ్ఞుఁ డిలమీద
మహిమఁజూపువాఁడు మధ్యముండు
వేషధారి యుదరపోషకుఁడధముండు
విశ్వదాభిరామ వినర వేమ!
ఉత్తముని కడుపున నోగు జన్మించిన
[మార్చు]ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడు చెఱచువానివంశమెల్ల
చెఱకువెన్ను పుట్టి చెఱపదా తీపెల్ల
విశ్వదాభిరామ వినర వేమ!
ఉద్దరింపగల్గు నుత్తముండు కులంబు
[మార్చు]ఉద్దరింపగల్గు నుత్తముండు కులంబు
మధ్యముండు దాని మాట గనడు
అధముడైన వాఁడంగించు నొక్కట
విశ్వదాభిరామ వినురవేమ!
ఉన్న సరికి మనుజుఁ డుపకారి గాలేక
[మార్చు]ఉన్న సరికి మనుజుఁ డుపకారి గాలేక
కన్నుగనక పల్కుగర్వములను
దీనులయినవారి దిగువారిగాఁజూచి
పరము గనకనూత బడును వేమ!
ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండుఁ
[మార్చు]ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండుఁ
జూడఁ జూడ రుచుల జాడ వేఱు
పురుషులందు పుణ్య పురుషులు వేఱయా
విశ్వదాభిరామ వినర వేమ!
ఉప్పుచింతపండు వూరిలోనుండగా
[మార్చు]ఉప్పుచింతపండు వూరిలోనుండన
తాళకంబెరుగరో, తగరంబు నెరుగరో
విశ్వదాభిరామ వినురవేమ!
ఉపము గలుగు నాత డూరకుండగరాదు
[మార్చు]ఉపము గలుగు నాత డూరకుండగరాదు
గురునితోడ బొందు కూడవలయు
గురుడు సెప్పురీతి గురిమీర రాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
ఉపముతోడ గురుని నొప్పుగ సేవించి
[మార్చు]ఉపముతోడ గురుని నొప్పుగ సేవించి
జపము హృదినిజేయు జాడ నెరిగి
తపము చేయువాడు తత్త్వజ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ వినురవేమ!
ఉపముదోపనట్టి యుపవాసముల లేదు
[మార్చు]ఉపముదోపనట్టి యుపవాసముల లేదు
తపముచేయనైన తగులరాదు
జపముతోన గురుని జవదాటకుండురా
విశ్వదాభిరామ వినురవేమ!
ఉపవసించుచుండి యోగి నీళ్ళలోమున్గి
[మార్చు]ఉపవసించుచుండి యోగి నీళ్ళలోమున్గి
కూడువండి వేల్పు గడువుమనుచు
దానినోరుగట్టి తామెతిందురుగదా!
విశ్వదాభిరామ వినురవేమ!
ఉపవసములనున్న నూరపందిగఁబుట్టుఁ
[మార్చు]ఉపవసములనున్న నూరపందిగఁబుట్టుఁ
దపసియై దరిద్రతను వహించు
శిలకు మ్రొక్కనగునె జీవమడుగు పొమ్ము
విశ్వదాభిరామ వినర వేమ!
ఉర్వి గురుని వేడి యబ్బురపడువాడు
[మార్చు]ఉర్వి గురుని వేడి యబ్బురపడువాడు
దబ్బరాడబోడు తత్తరమున
నిబ్బరంపు మదిని నిర్విణ్ణతనుగాంచు
విశ్వదాభిరామ వినురవేమ!
ఉర్విజనులు పరమయోగీశ్వరునిఁ జూచి
[మార్చు]ఉర్విజనులు పరమయోగీశ్వరునిఁ జూచి
తెగడువారె గాని తెలియలేరు
అమృతస్వాదురుచులహస్త మేమెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ!
ఉర్వివారికెల్ల నొక్కకంచముఁబెట్టి
[మార్చు]ఉర్వివారికెల్ల నొక్కకంచముఁబెట్టి
పొత్తుఁ గుడిపికులము పొలయఁ జేసి
తలను చేయిపెట్టి తగ నమ్మఁజెప్పరా
విశ్వదాభిరామ రామరవు మ మమ
ఉసురు లేనితిత్తి యిసుమంత నూదిన
[మార్చు]ఉసురు లేనితిత్తి యిసుమంత నూదిన
పంచలోహములును భస్మమౌను
పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా
విశ్వదాభిరామ వినర వేమ!