వేమన పద్యాలు/త
తండ్రికన్న సుగుణి తనయుఁడు గల్గెనా
[మార్చు]తండ్రికన్న సుగుణి తనయుఁడు గల్గెనా
పిన్న తనము లెన్న మిన్నగాదు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా
విశ్వదాభిరామ వినుర వేమ!
తండ్రిసొమ్మునైన దాయాదిసొమ్మైనఁ
[మార్చు]తండ్రిసొమ్మునైన దాయాదిసొమ్మైనఁ
బరులసొమ్మునయినఁ బ్రాప్తధనము
దయను దీనులకును దాన మిచ్చినవాఁడె
బహుళపుణ్యజనుఁడు పరఁగ వేమ!
తంత్రవాదు లెన్న తఱచుగా నుందురు
[మార్చు]తంత్రవాదు లెన్న తఱచుగా నుందురు
మంత్రవాదు లెన్న మహిని లేరు
జంత్రగాని బొమ్మ చందంబు లాయెరా
విశ్వదాభిరామ వినర వేమ!
తగినకులజుఁడైన తలయెత్తు ధనమైన
[మార్చు]తగినకులజుఁడైన తలయెత్తు ధనమైన
భాగ్యపురుషునేల పట్టనెంచు
పరమసాధ్వి చూడ పరులనంటదు సుమీ
విశ్వదాభిరామ వినర వేమ!
తగులుసతిని గూడి బిగువుగా రమియింప
[మార్చు]తగులుసతిని గూడి బిగువుగా రమియింప
కడుబలుండు పుట్టు గట్టిగాను
పురుషుఁ డబలుఁడైనఁ బుత్రు లబలులురా
విశ్వదాభిరామ వినర వేమ!
తా నొకటి దెలియునన్నది
[మార్చు]తా నొకటి దెలియునన్నది
తానట్టిది లేక యెల్లతావులు దానై
తానేగి పరిణమించిన
మానవునకు ముక్తి గలదు మహిలో వేమా!
తా నగుట యెఱిఁగి సర్వముఁ
[మార్చు]తా నగుట యెఱిఁగి సర్వముఁ
దా నగుటయుఁ దెలిసి యెల్లతత్వముదానై
తానెఱిఁగి పరిణమించిన
మానవులకు శక్తిలేదు మహిలో వేమా!
తాతఁ గన్నతల్లి తనతండ్రిఁ గనుతల్లి
[మార్చు]తాతఁ గన్నతల్లి తనతండ్రిఁ గనుతల్లి
తన్నుఁగన్న తల్లి తల్లితల్లి
తల్లి శూద్రురాలు తానెట్లు బాపఁడో
విశ్వదాభిరామ వినర వేమ!
తాతజనించెఁ గన్యకకు తండ్రులు తామును కుండగోళకుల్
[మార్చు]తాతజనించెఁ గన్యకకు తండ్రులు తామును కుండగోళకుల్
మాతపరానుకూలి మరి యెక్కువ ద్రౌపతి భర్తలేవురు
నీతులు చెప్ప పాండవులనీమము లిట్టి వటంచు నెన్నుచు
భూతలమందు మిక్కిలిగఁ బూజలఁ జేసిరి వెఱ్ఱి వేమనా!
తిట్టికొట్టిరేని తిరిగి మాటాడక
[మార్చు]తిట్టికొట్టిరేని తిరిగి మాటాడక
యడరుఁజూచి యదరింపకనీవు
తన్నుఁ గాదని నట్లు కాతఱపడకున్న
నట్టివాఁడు బ్రహ్మ మౌను వేమా!
తిట్టికొట్టిరేని తిరిగి మాఱాడక
[మార్చు]తిట్టికొట్టిరేని తిరిగి మాఱాడక
యూరకున్నఁ జూడనుర్విమీద
వాఁడగు పరమాత్మ వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినర వేమ!
తిట్టెనేని మొట్టు మొట్టినఁ గొట్టును
[మార్చు]తిట్టెనేని మొట్టు మొట్టినఁ గొట్టును
కొట్టెనేని యముఁడు కొద్దిపఱచుఁ
గోప మెంచ చెడ్డపాపము నరహత్య
విశ్వదాభిరామ వినర వేమ!
తొడలమెఱుపుసొంపు తోరంపుకుచములు
[మార్చు]తొడలమెఱుపుసొంపు తోరంపుకుచములు
వారకొప్పుగలుగు వనితఁజూచి
విటుఁడు నిలుచుటెట్లు విరహాగ్ని కొగ్గును
విశ్వదాభిరామ వినర వేమ!
తొత్తు తొత్తెగాని దొరసాని గాఁబోదు
[మార్చు]తొత్తు తొత్తెగాని దొరసాని గాఁబోదు
అడఁచుటింతె దానికైన గుణము
మిత్తికూళ్ళ దొంగ మేలెఱుఁగ నేర్చునా
విశ్వదాభిరామ వినర వేమ!
తొత్తుతోడి పొందు దోషంబు దోషంబు
[మార్చు]తొత్తుతోడి పొందు దోషంబు దోషంబు
లంజతోడిపొందు లజ్జ చెడును
జారతోటిపొందు చావుకుమూలమౌ
విశ్వదాభిరామ వినర వేమ!
తొత్తుతోడిపొందు తొఱ్ఱిపెసలమూట
[మార్చు]తొత్తుతోడిపొందు తొఱ్ఱిపెసలమూట
ముచ్చుతోడిపొందు తెచ్చునింద
తలవరింటిపొందు తలతోటిదీరురా
విశ్వదాభిరామ వినర వేమ!
తత్వ మింద్రియముల దరిఁజూచి గెలుచును
[మార్చు]నేమమునను నుండ నిల్చును చిత్తంబు - తామసమున నుండ దలఁగిపోవు
నిలిచిన చిత్తము నిర్భీతి నొందించు - నిర్భీతి సఖ్యంబు నీరసించు
సఖ్యదూరగుణము సమమును బొందించు - సమగుణమునఁ జూడ సమతపుట్టు
నట్టి సమత విశ్వమంతయుఁ దానగుఁ - దానె విశ్వంబయిన తత్వమగును
తత్వ మింద్రియముల దరిఁజూచి గెలుచును
దత్వవేత్తయైనఁ దానె మిగిలి
రాజయోగి యనుచుఁ దేజంబుచేతను
దెలిసియుండు జగతి వినర వేమ!
తత్వ మెఱుఁగువాడు దైవంబు నెఱుఁగును
[మార్చు]తత్వ మెఱుఁగువాడు దైవంబు నెఱుఁగును
సర్వసారములను జావఁ జేయు
కదళిమ్రింగునట్లు గరళంబు మ్రింగునా
విశ్వదాభిరామ వినర వేమ!
తత్వము తిరమైన తావుల వెదకుచుఁ
[మార్చు]తత్వము తిరమైన తావుల వెదకుచుఁ
దాను తత్వమగును తత్వ్తయోగి
తలఁపులన్ని యుడుగఁ దానెపో తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!
తత్వహీను లుండ్రు తఱుచుగా భువిలోన
[మార్చు]తత్వహీను లుండ్రు తఱుచుగా భువిలోన
తత్వ్త మెఱుగువారు తఱుచులేరు
కలిగిలేనివారు కనిపింపరారయా
విశ్వదాభిరామ వినర వేమ!
తన కేనాఁడు సుభిక్షము
[మార్చు]తన కేనాఁడు సుభిక్షము
తన కేనాఁడును భంగంబు తనకుఁదనుజుఁడు
తానున్నయట్టి దశకును
మనసున నిల చివుకుచుండు మనుజుఁడు వేమా!
తన గుణము తనకు నుండఁగ
[మార్చు]తన గుణము తనకు నుండఁగ
నెనయంగా నొరునిగుణము నెంచును మదిలో
తన గుణముఁదాను దెలియక
పనరి యొరుని ననెడువాఁడు భ్రష్టుఁడు వేమా!
తానె తత్వమనుచు తన్నెఱుంగక లేక
[మార్చు]తానె తత్వమనుచు తన్నెఱుంగక లేక
మాయతత్వమనుచు మఱుగుచుండు
ధర్మకర్మములను తగరోయ దత్వమౌ
విశ్వదాభిరామ వినర వేమ!
తన నిజరూపముఁ జూడఁగ
[మార్చు]తన నిజరూపముఁ జూడఁగ
తన మాయను సిద్ధులయినఁ దపముల మాయన్
తానెంతటి ఘనుఁడయినను
తనిసినవాఁడైన జూడ ధరలో వేమా!
తానే నేర్పరియయినం
[మార్చు]తానే నేర్పరియయినం
తారకములఁ దానెతన్ను దప్పించుకొను
దానెన్ని విధము లడరిన
తానే పరమాత్మ యనుచుఁ దలఁచర వేమా!
తేనె పంచదార తియ్యమామిడిపండు
[మార్చు]తేనె పంచదార తియ్యమామిడిపండు
తిన్నఁగాని తీపు తెలియగరాదు
కన్న నింపు పుట్టుఁ గామినియధరంబు
విశ్వదాభిరామ వినర వేమ!
తన మదిఁ గపటము గలిగిన
[మార్చు]తన మదిఁ గపటము గలిగిన
తనవలెనే కపట ముండు, తగ జీవులకు
తన మది కపటము విడిచినఁ
దన కెవ్వడు కపటి లేఁడు ధరలో వేమా!
తనకు ప్రాప్తిలేక దానమియ్యరటంచు
[మార్చు]తనకు ప్రాప్తిలేక దానమియ్యరటంచు
దోషబుద్ధిచేత దూరుటెల్ల
ముక్కువంకఁ జూచి ముక్కఱదూరుట
విశ్వదాభిరామ వినర వేమ!
తనకు ప్రాప్తిలేక దాత ఈలేదంచు
[మార్చు]తనకు ప్రాప్తిలేక దాత ఈలేదంచు
ఒరులదూరుటెల్ల ఓగుబుద్ధి
కలిమిలేమికతన కష్టమ్ముతోచురా!
విశ్వదాభిరామ వినురవేమ!
తనకు బ్రాప్తిలేక దానము చిక్కదు
[మార్చు]తనకు బ్రాప్తిలేక దానము చిక్కదు
దైవనింద వెర్రితనముగాదె!
కర్మజీవులేల కర్మంబు దెలియరు
విశ్వదాభిరామ వినురవేమ!
తనకు లేనివాఁడు దైవముందూఱును
[మార్చు]తనకు లేనివాఁడు దైవముందూఱును
తనకుఁ గలిగెనేని దైవ మేల
తనకు దైవమునకుఁ దగులాటమేశాంతి
విశ్వదాభిరామ వినర వేమ!
తనకుఁ జేయుమేలుఁ దాఁ దెలియగ నేర్చు
[మార్చు]తనకుఁ జేయుమేలుఁ దాఁ దెలియగ నేర్చు
నెలమితోడకుక్క యెఱుఁగు భువిని
తనకుఁ జేయుమేలు దాఁదెలియగలేని
మనుజుఁ డెంతఖలుఁడు మహిని వేమా!
తేనెతెరలజాడ తేనెటీఁగ యెఱుంగు
[మార్చు]తేనెతెరలజాడ తేనెటీఁగ యెఱుంగు
సుమరసంబుజాడ భ్రమర మెఱుఁగు
పరమయోగి జాడభక్తుం డెఱుంగును
విశ్వదాభిరామ వినర వేమ!
తనదు తల్లి లంజె తనయాలు మాదిగ
[మార్చు]తనదు తల్లి లంజె తనయాలు మాదిగ
శ్రీపతికి గురువసిష్ఠుఁ డరయ
తపముచేత ద్విజుఁడు తర్కింప కులమెట్లు
విశ్వదాభిరామ వినర వేమ!
తనదు కర్మచేత తాను లోకములోన
[మార్చు]తనదు కర్మచేత తాను లోకములోన
తనదు తల్లి గర్భమునను బుట్టె
తనదు కర్మమరచి తగనివి చేయునా
విశ్వదాభిరామ వినురవేమ!
తనదు దేహమందు తనకున్న పరివార
[మార్చు]తనదు దేహమందు తనకున్న పరివార
మందఱం బిగించి హర్ష మెసఁగ
నెల్లచావు లెఱిఁగి యిందందు నెఱిఁగియు
నడవ నేర్చుమేటి నరుఁడు వేమ!
తనదుదత్తము పరదత్త మొకటిగాగఁ
[మార్చు]తనదుదత్తము పరదత్త మొకటిగాగఁ
జాడ కనుభవింపఁజోద్య మిలను
తొడగి యాలు నమ్మితొత్తును గొన్నట్టు
విశ్వదాభిరామ వినర వేమ!
తనదుదాన మవనిఁ దనకూఁతు సమమగు
[మార్చు]తనదుదాన మవనిఁ దనకూఁతు సమమగు
తండ్రిదాన మెల్లఁ దనకుఁ దోడు
అన్యు లిచ్చుదాన మది తనవంటిది
విశ్వదాభిరామ వినర వేమ!
తనదునీడ శిశువు దాఁజూచుకొన్నట్టు
[మార్చు]తనదునీడ శిశువు దాఁజూచుకొన్నట్టు
తనదునీడఁ జూచి తన్ను మఱచి
పతిని ననుమ నుడువు భ్రాంతుల నేమందు
విశ్వదాభిరామ వినర వేమ!
తనదునృపతితోడఁ దనయాయుధముతోడ
[మార్చు]తనదునృపతితోడఁ దనయాయుధముతోడ
నగ్నితోడఁ బరులయాలితోడ
హాస్యమాడుటెల్ల హాని ప్రాణమునకు
విశ్వదాభిరామ వినర వేమ!
తనదుభ్రాత లెల్ల దానంబు సేయంగ
[మార్చు]తనదుభ్రాత లెల్ల దానంబు సేయంగ
తనకు ఫలమటంచుఁ దలఁచరాదు
తనదుకాలు కోయఁ దన తమ్ముఁడేడ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!
తనదుమనసుచేతఁ దర్శించి జ్యోతిష
[మార్చు]తనదుమనసుచేతఁ దర్శించి జ్యోతిష
మెంతచేసెననుచు నెంచిచూడఁ
దనయదృష్ట మెల్ల దైవమ్ము తెలియురా
విశ్వదాభిరామ వినర వేమ!
తనదుసొమ్ముఁజూడ దాన మియ్యగవచ్చు
[మార్చు]తనదుసొమ్ముఁజూడ దాన మియ్యగవచ్చు
నవని దొడ్డగాద దెవరికైన
నదురు బెదురు లేక యన్యులసొమ్ముల
దానమిచ్చువాఁడు దాత వేమ!
తాననంగ నెవరు తనవారన నెవరు
[మార్చు]తాననంగ నెవరు తనవారన నెవరు
తెలిసి తెలియలేరు తిక్క నరులు
అరయ పిసినికాయ పురుగు పద్ధతికాగ
విశ్వదాభిరామ వినర వేమ!
తన్నెఱుఁగనివాఁడు తానె తానై యుండుఁ
[మార్చు]తన్నెఱుఁగనివాఁడు తానె తానై యుండుఁ
దన్నెఱుంగువాఁడు తానె తాను
తనువులేనివాఁడు తానె తానౌనయా
విశ్వదాభిరామ వినర వేమ!
తన్ను వెదకిచూడఁ దానెపో జీవుండు
[మార్చు]తన్ను వెదకిచూడఁ దానెపో జీవుండు
తత్వ మరసిచూడఁ దానె యాత్మ
మన్ను మిన్ను లేదు మాయరా లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!
తన్నుఁ దానెఱుఁగఁడు తా నెవ్వరికి నేర్పు
[మార్చు]తన్నుఁ దానెఱుఁగఁడు తా నెవ్వరికి నేర్పు
ప్రాలుమాలితిరుగు పశువుకొడుకు
కాసులకొఱకైన కర్మముల్ గట్టురా
విశ్వదాభిరామ వినర వేమ!
తన్నుఁ దెలియకున్న తగ వేదములు వెఱ్ఱి
[మార్చు]తన్నుఁ దెలియకున్న తగ వేదములు వెఱ్ఱి
సర్వ సంపదకు ముసాబు వెఱ్ఱి
యాఱు శాస్త్రములును నా పురాణములును
జబ్బు లనుచు జగతిఁ జాటు వేమా!
తన్నుఁ దెలియువారు దైవజ్ఞు లెంతయు
[మార్చు]తన్నుఁ దెలియువారు దైవజ్ఞు లెంతయు
నిన్నుఁ దెలియరేని నిలువరైరి
మాయఁ దెలియకుండ మంటపాలైరయా
విశ్వదాభిరామ వినర వేమ!
తన్నుఁజూచి యొరులు దగ మెచ్చవలెనని
[మార్చు]తన్నుఁజూచి యొరులు దగ మెచ్చవలెనని
సొమ్ము లెలమిఁ బెట్టు నెమ్మిమీఱ
నొరులకొఱకుఁ దాన యుబ్బుచు నుండును
తన్ను దెలియ లేఁడు ధరణి వేమ!
తన్నువలె నవియును ధరఁబుట్టినవి గావొ
[మార్చు]తన్నువలె నవియును ధరఁబుట్టినవి గావొ
పరఁగఁదమ్మువంటి బ్రతుకు గాదొ
జ్ఞాని జ్ఞానిఁ జంపిఁ గారణమేమిరా
విశ్వదాభిరామ వినర వేమ!
తనలో సర్వంబుండఁగ
[మార్చు]తనలో సర్వంబుండఁగ
తనలోపల వెదుకలేక ధరవెదకెడు నీ
తనువుల మోసెడి యెద్దుల
మనములఁ దెల్పఁగ వశమె మహిలో వేమా!
తనలోననె సకలంబును
[మార్చు]తనలోననె సకలంబును
తనరందా నగుటయెఱిఁగి తారకమాత్మన్
దనువనుచుఁ బరిణమించిన
మనుజునకును ముక్తికలదు మహిలో వేమా!
తాను గుడువలేఁడు, తగ వేది యాప్తుల
[మార్చు]తాను గుడువలేఁడు, తగ వేది యాప్తుల
జేర నివ్వఁడ ట్టి చెనటి గోవు
చేని లోన బొమ్మఁ జేసి కట్టిన యట్లు
విశ్వదాభిరామ వినర వేమ!
తాను తనువు యనుచు ద్వయమును బలుకుచు
[మార్చు]తాను తనువు యనుచు ద్వయమును బలుకుచు
మోహవారిరాశి మునిఁగియున్న
జనుల కెట్లు మోక్ష సంగతి సిద్ధించు
విశ్వదాభిరామ వినర వేమ!
తాను దానె యనెడి తత్వాల లోపల
[మార్చు]తాను దానె యనెడి తత్వాల లోపల
నన్య మెఱుఁగకుండు నబ్బతోడు
తానెతానునయిన దల్లడం బేలరా
విశ్వదాభిరామ వినర వేమ!
తాను దినక యటుల ధర్మము సేయక
[మార్చు]తాను దినక యటుల ధర్మము సేయక
కొడుకుల కనిధనము కూడఁబెట్టి
తెలియఁజెప్పలేక తీఱిపోయినవెన్క
సొమ్ము పరులనందుఁ జూడు వేమ!
తాను దప్పకుండ తనమనంబు నిల్పి
[మార్చు]తాను దప్పకుండ తనమనంబు నిల్పి
తావుఁ జేరునట్ల తంత్రపఱచి
తాను తావుఁ జేరి తావుఁదానేకమై
తాను దాన యగుచుఁడనరు వేమా!
తాను నేననియెడు తత్వభేదంబును
[మార్చు]తాను నేననియెడు తత్వభేదంబును
మాని కడువివేక మహిమఁ దనరి
యూరకున్నవాఁడు నుత్తమోత్తముఁడురా
విశ్వదాభిరామ వినర వేమ!
తాను పుట్టుచోటు తాఁజూచి పలికెనా
[మార్చు]తాను పుట్టుచోటు తాఁజూచి పలికెనా
తాను బుద్ధిదిరుగు ధరణిలోన
తాను బుట్టుచోటు తత్వంబు తలపోయ
విశ్వదాభిరామ వినర వేమ!
తాను విమలుఁడైనఁ దనగుణ మంతయు
[మార్చు]తాను విమలుఁడైనఁ దనగుణ మంతయు
శివుని కీనిగురువు చెడుగురుండు
గ్రుడ్డిగుఱ్ఱ మెక్కి గుడి దిరిగినటుల
విశ్వదాభిరామ వినర వేమ!
తను వలచినఁదా వలచును
[మార్చు]తను వలచినఁదా వలచును
దను వలవక యున్నఁదన్ను దా వలవడిల
దనదు పటాటోపంబులు
తనమాయలు పనికిరావు ధరలో వేమా!
తాను సకలమైనఁ దనలోన సకలంబు
[మార్చు]తాను సకలమైనఁ దనలోన సకలంబు
తనదులోని వెలుఁగు తానెఱింగి
యున్నమానవునకు నొనరంగ ముక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ!
తనుఁదాఁ దెలియుట తత్వ్తము
[మార్చు]తనుఁదాఁ దెలియుట తత్వ్తము
తన కన్యులు బోధసేయ ధరలోఁ గలరే
తనుఁదాఁ దెలియక యుండినఁ
దన కెవరుం దెలుపలేరు తథ్యము వేమ!
తానును సమస్తభువనము
[మార్చు]తానును సమస్తభువనము
లోనసువుల యంగఁదెలిసి లోనను వెలయు
దానై వెలుఁగఁగ నేర్చిన
మానవునకు ముక్తి గలుగు మహిలో వేమా!
తనువ దెవరిసొమ్ము తనదని పోషింప
[మార్చు]తనువ దెవరిసొమ్ము తనదని పోషింప
ధనమదెవరిసొమ్ము దాచుకొనఁగ
ప్రాణ మెవరిసొమ్ము పాయకుండఁగ నిల్ప
విశ్వదాభిరామ వినర వేమ!
తనువు లస్థిరములు ధర్మము నిత్యము
[మార్చు]తనువు లస్థిరములు ధర్మము నిత్యము
చేయుధర్మమెల్ల చెడని పదవి
కనివిని మఱి తెలియఁ గానరు నరపశుల్
విశ్వదాభిరామ వినర వేమ!
తనువు విడిచి తాను తరలిపోయెడివేళ
[మార్చు]తనువు విడిచి తాను తరలిపోయెడివేళ
తనదు భార్య సుతులు దగినవార
లొక్కరైన నేగ రుసురు మాత్రమె కాని
తనదుమంచి తోడు తనకు వేమ!
తనువు శోధఁజేసి దైవమ్ము మొనఁజేసి
[మార్చు]తనువు శోధఁజేసి దైవమ్ము మొనఁజేసి
ముందు కర్మములను మూలఁద్రోసి
మనము నిజముఁజేసి మమతలన్నియు రోసి
మొనసి నిల్చువాఁడు మోక్షి వేమా!
తనువుఁ దా ననుకొనుఁ దనకుఁదా ననఁదగి
[మార్చు]తనువుఁ దా ననుకొనుఁ దనకుఁదా ననఁదగి
జనన మరణములను జిక్కిచిక్కి
పొలుపుపొం దెఱుఁగక పొర్లాడుచుండెడి
భ్రాంతిజీవి కేటిపరము వేమా!
తనువునందు నగ్ని దఱికొని కాల్పంగ
[మార్చు]తనువునందు నగ్ని దఱికొని కాల్పంగ
కాల్చుకొనుట యేమి కర్మమునకు
కాల్చుకొన్న యంత ఘనుఁడు తానాయెనా
విశ్వదాభిరామ వినర వేమ!
తనువులోన జీవతత్వ మెఱుంగక
[మార్చు]తనువులోన జీవతత్వ మెఱుంగక
వేఱె కలదటంచు వెదుకనేల
భానుడుండ దివ్వెఁబట్టి వెదుకు రీతి
విశ్వదాభిరామ వినర వేమ!
తనుసంరక్షణ కొఱకయి
[మార్చు]తనుసంరక్షణ కొఱకయి
మనమున కార్యములు మానుమను తత్వముచే
దినదినము తిరిగి తిరిగియు
తనువునఁ గనుగొన్న నాత్మ తత్వము వేమా!
తప్పు లెన్నువారు తండోపతండము
[మార్చు]తప్పు లెన్నువారు తండోపతండము
లుర్వి జనులకెల్ల నుండుఁ దప్పు
తప్పు లెన్నువారు తమతప్పు నెఱుఁగరు
విశ్వదాభిరామ వినర వేమ!
తప్పురూపు గట్టి ధరలోనఁ దిరిగెడు
[మార్చు]తప్పురూపు గట్టి ధరలోనఁ దిరిగెడు
సేఁతలెల్ల మిత్తిఁజేరుకొఱకె
కడుపునిండ నింత కష్టంబు లేలరా
విశ్వదాభిరామ వినర వేమ!
తపముజపములెన్నొ ధాత్రిజనుల కెల్ల
[మార్చు]తపముజపములెన్నొ ధాత్రిజనుల కెల్ల
నొనర శివునిఁజూడ నుపమగలదు
మనసుఁజెదరనీక మదిలోనఁజూడరో
విశ్వదాభిరామ వినర వేమ!
తీపులోన తీపు తెలియంగఁ బ్రాణంబు
[మార్చు]తీపులోన తీపు తెలియంగఁ బ్రాణంబు
ప్రాణవితతికన్నఁ బసిడి తీపు
పసిడికన్న మిగులఁ బడతిమాటలు తీపు
విశ్వదాభిరామ వినర వేమ!
తొమ్మిది క్రంతపత్తికి
[మార్చు]తొమ్మిది క్రంతపత్తికి
నిమ్మగు సొమ్ములును గులము నేటికిఁ జెపుమా
నమ్మకు దేహము నాదని
నెమ్మది బ్రహ్మంబు దెలియునే నని వేమా!
తామరపాకున నీర్వలె
[మార్చు]తామరపాకున నీర్వలె
వేమన చరియించుచుండు వెదకుచు శివుని
నీమాయ నమ్మరాఁగా
దీమనమునఁ దెలియరాదు నీశుని వేమా!
తామసించి సేయఁదగ దెట్టి కార్యంబు
[మార్చు]తామసించి సేయఁదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమ మగును
పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె?
విశ్వదాభిరామ వినర వేమ!
తామసేంద్రియములఁ దనర జయించిన
[మార్చు]తామసేంద్రియములఁ దనర జయించిన
తత్వ మరసి చూడఁ దాన యగును
రాజయోగి యిట్లు తేజరిల్లుచు నుండు
విశ్వదాభిరామ వినర వేమ!
తాము గడనసేయు ధనము తమదియని
[మార్చు]తాము గడనసేయు ధనము తమదియని
నమ్మియుండ్రు వెఱ్ఱి నరులు భువిని
తాము నొకరి కిచ్చుధన మింతియేకాక
కడమది తనకేల గలుగు వేమ!
తాము గన్న వారు తముఁ గన్న వారును
[మార్చు]తాము గన్న వారు తముఁ గన్న వారును
చచ్చు టెల్ల, తమకు సాక్షి గాదె?
బ్రతుకు టెల్ల తమకు బ్రహ్మ కల్పంబులా?
విశ్వదాభిరామ వినర వేమ!
తాము నిలుచుచోట దైవములేదని
[మార్చు]తాము నిలుచుచోట దైవములేదని
పామర జనులు తిరుపతులు దిరిగి
జోకవీడి చేతిసొమ్మెలఁ బోఁజేసి
చెడిగృహంబు తాను జేరు వేమ!
తాము బలిమిఁబెట్ట తమకు తామే కల్గు
[మార్చు]తాము బలిమిఁబెట్ట తమకు తామే కల్గు
నడుగనిడినఁ దాము నడుగఁగలుగు
విందునీనివాని కెందునులేదయా
విశ్వదాభిరామ వినర వేమ!
తారకంబుఁ జూచుదారి వేఱుగఁగల్గు
[మార్చు]తారకంబుఁ జూచుదారి వేఱుగఁగల్గు
సమముగాను జూడఁ జక్కఁబడును
వెఱ్ఱిగాను జూడ వెలుగెల్ల బాఱురా
విశ్వదాభిరామ వినర వేమ!
తిరిగి తిరిగి నరుఁడు మరులుకొనుటేగాక
[మార్చు]తిరిగి తిరిగి నరుఁడు మరులుకొనుటేగాక
అందువలన నేమి యాసలేదు
అంతరాత్మ నిలుపునతఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!
త్రాడు మెడనువేసి తనదు శూద్రత్వంబు
[మార్చు]త్రాడు మెడనువేసి తనదు శూద్రత్వంబు
పోయె ననెడి దెల్ల బుద్ధి కొదువ
మనసులకును త్రాడు మఱివన్నెఁ దెచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!
త్రాడుపామతంచుఁ దాఁజూచి భయపడి
[మార్చు]త్రాడుపామతంచుఁ దాఁజూచి భయపడి
తెలిసి త్రాడటన్నఁ దీఱు భయము
భయము దీఱినపుడె బ్రహ్మంబు నంగురా
విశ్వదాభిరామ వినర వేమ!
తీర్ప నార్ప లేని తీర్పరితన మేల?
[మార్చు]తీర్ప నార్ప లేని తీర్పరితన మేల?
కూర్ప విప్ప లేని నేర్ప దేల?
పెట్టి పొయ్య లేని వట్టి బీరము లేల?
విశ్వదాభిరామ వినర వేమ!
తిరిపెగాఁ డయినను దిరిపెమెత్తిన యట్టి
[మార్చు]తిరిపెగాఁ డయినను దిరిపెమెత్తిన యట్టి
తిరిపెమందుఁ దాను దిరిపె మిడినఁ
దిరిపెము తిరిపమున దిగఁబడిపోవురా
విశ్వదాభిరామ వినర వేమ!
తిరిపెగాని మిగుల దీపించఁ గనరాదు
[మార్చు]తిరిపెగాని మిగుల దీపించఁ గనరాదు
వెఱ్ఱివానిమాట వినఁగ రాదు
వెఱ్ఱికుక్కఁ బట్టి వేటాడ వచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!
త్రాసును పడియును లంజయు
[మార్చు]త్రాసును పడియును లంజయు
భాసురగతి నొక్కరూపు పరికింపంగా
వీసంబధికంబిచ్చిన
వాసరమున నొక్కవంక వారలు వేమా!
తరుణి సొగసుఁగన్న తనయుని గన్నను
[మార్చు]తరుణి సొగసుఁగన్న తనయుని గన్నను
మరునికళల మించి మనము పాఱు
పాపజాతి మనము పట్టంగ రాదయా
విశ్వదాభిరామ వినర వేమ!
తిరుమలకును బోవఁ దుఱక దాసరి గాఁడు
[మార్చు]తిరుమలకును బోవఁ దుఱక దాసరి గాఁడు
కాశిబోవ లంజ గరిత గాదు
గుక్క సింహ మగునె గోదావరికిఁ బోవ
విశ్వదాభిరామ వినర వేమ!
తరువఁ దరువఁ బుట్టు దరువున ననలంబు
[మార్చు]తరువఁ దరువఁ బుట్టు దరువున ననలంబు
తరువఁ దరువఁ బుట్టు దధిని ఘృతము
తలఁప దలపఁ బుట్టు తనువునఁ దత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!
తరువున నెడియింటఁ దనశత్రుమిత్రులఁ
[మార్చు]తరువున నెడియింటఁ దనశత్రుమిత్రులఁ
దెలియ లేనివాని తెలివదేల
తెలిసిన మనుజునకు దివ్యామృతమ్మురా
విశ్వదాభిరామ వినర వేమ!
తలఁచిన దత్వంబగునా
[మార్చు]తలఁచిన దత్వంబగునా
తలఁపక తా నూరకున్నఁ దత్వంబగునా
తలఁచుట తలఁపమి రెండును
దలఁపక తానుండెనేని దత్వము వేమా!
తలఁచినను శూన్యతత్వము
[మార్చు]తలఁచినను శూన్యతత్వము
తలఁపక యుండినను శూన్యతత్వం బదియౌ
తలఁచిన తలఁపీడేఱును
దలఁచకయుండినను దానె తత్వము వేమా!
తలఁప వశముగాదు తత్వంబు బ్రహ్మంబు
[మార్చు]తలఁప వశముగాదు తత్వంబు బ్రహ్మంబు తెలియలేఁడు బ్రహ్మదేవుఁడైన ఇసుక బావి త్రవ్వ నెవ్వరి వశమయా విశ్వదాభిరామ వినర వేమ!
తలఁపుచేతఁగల్గు తారక బ్రహ్మంబు
[మార్చు]తలఁపుచేతఁగల్గు తారక బ్రహ్మంబు
తలచిఁచూడఁదానె తత్వమగును
తలఁపులోనె తలఁపు తానె తానెఱిఁగిన
విశ్వదాభిరామ వినర వేమ!
తలను పాగ పైని తగుపచ్చడము బొజ్జ
[మార్చు]తలను పాగ పైని తగుపచ్చడము బొజ్జ
చెవులపోగు లరసి చేరు నర్థి
శుద్ధపశువు లౌట బుద్ధిలో నెఱుగురా
విశ్వదాభిరామ వినర వేమ!
తలను వ్రేలవేసి తాలిమి నిలుచుక
[మార్చు]తలను వ్రేలవేసి తాలిమి నిలుచుక
మూసి తెఱచు గన్ను మూగి యగును
జ్ఞాన మదియుఁగాదు కష్టము శేషంబు
విశ్వదాభిరామ వినర వేమ!
తలపఁగ మూలమందు పరతత్వ్తము దెల్పఁగ పాటుగాదు లో
[మార్చు]తలపఁగ మూలమందు పరతత్వ్తము దెల్పఁగ పాటుగాదు లో బలిమిని నాత్మగుట్టు మది భావననెంచగ బ్రహ్మకల్పము గలుగును ముక్తి జీవులకుఁ గావున నాత్మవిధానదృశ్య మీ సలలిత శక్తిరూపు నిను సన్నుతి వేమన చేసె కల్పమున్!
తలపులోని తలఁపు దలఁపోసి తెలియకా
[మార్చు]తలపులోని తలఁపు దలఁపోసి తెలియకా
తలఁపులెల్ల విడిచి తగినభంగి
తలఁపులోనితలఁపె తత్వంబు నాత్మరా
విశ్వదాభిరామ వినర వేమ!
తల్లి కెదురుకొనుట తండ్రి కెదురుకొనుట
[మార్చు]తల్లి కెదురుకొనుట తండ్రి కెదురుకొనుట
యన్న కెదురుకొనుట యనఁగ మూఁడు
పాతకముల నెఱిఁగి వర్తింపఁగావలె
విశ్వదాభిరామ వినర వేమ!
తల్లి గర్భమందుఁ దాఁబుట్టి నప్పుడు
[మార్చు]తల్లి గర్భమందుఁ దాఁబుట్టి నప్పుడు
మొదల బట్ట లేదు తుదను లేదు
నడుమ బట్టగట్ట నగుఁబాటు గాదటో
విశ్వదాభిరామ వినర వేమ!
తల్లి గౌరి తనకు దండ్రియే శంభుండు
[మార్చు]తల్లి గౌరి తనకు దండ్రియే శంభుండు
ప్రమథగణము లఖిలబాంధవులు
తనకుఁ బుట్టినిల్లు తనరుఁ గైలాసంబు
విశ్వదాభిరామ వినర వేమ!
తల్లిగర్భమందు తాను వెడలువేళ
[మార్చు]తల్లిగర్భమందు తాను వెడలువేళ
నఱుత లింగముండ దరసిచూడ
నడుమ లింగమూన నగుఁబాటు గాదటో
విశ్వదాభిరామ వినర వేమ!
తల్లిదండ్రి చావఁ దనయుఁడు తానేడ్చు
[మార్చు]తల్లిదండ్రి చావఁ దనయుఁడు తానేడ్చు
మగఁడు చావ నాలు వగచుచుండు
కార్యవశము గాని కలుగదు మోహంబు
విశ్వదాభిరామ వినర వేమ!
తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు
[మార్చు]తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు
పుట్టనేమివాఁడు గిట్టనేమి
పుట్టలోనఁ జెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినర వేమ!
తల్లిదండ్రులందు దారిద్య్రయుతులందు
[మార్చు]తల్లిదండ్రులందు దారిద్య్రయుతులందు
నమ్మని నిరుపేద నరులయందు
ప్రభువులందుఁ జూడ భయభక్తు లమరిన
నిహముఫలము కల్గు నెసఁగు వేమ!
తల్లిదండ్రులనెడి తత్వంబు నెఱుఁగరు
[మార్చు]తల్లిదండ్రులనెడి తత్వంబు నెఱుఁగరు
యోనిలింగములను నుద్భవించి
విష్ణువరయఁదల్లి వెలయరుద్రుఁడె తండ్రి
విశ్వదాభిరామ వినర వేమ!
తల్లిదండ్రులెన్నఁ దనతొలి గురులు
[మార్చు]తల్లిదండ్రులెన్నఁ దనతొలి గురులు
పార్వతీభవులును పరమగురువులు
కూలివాండ్ర జగతి గురు లన ద్రోహంబు
విశ్వదాభిరామ వినర వేమ!
తఱచు చదువు చదువఁ దర్కవాదమె కాని
[మార్చు]తఱచు చదువు చదువఁ దర్కవాదమె కాని
దివ్యజ్ఞాన మన్న తేటపడదు
పసిరికాయపురుగు పగిదిని చెడిపోవు
విశ్వదాభిరామ వినర వేమ!
తఱచుచీఁకటి విడి తఱితోడఁ దనుమఱచి
[మార్చు]తఱచుచీఁకటి విడి తఱితోడఁ దనుమఱచి
పరమునందు మనసుఁ బదిలపఱచి
గరిమయున్నయట్టి ఘనుఁడెందు లేదురా
విశ్వదాభిరామ వినర వేమ!
తెలివియైనలేక తిరమును తెలియక
[మార్చు]తెలివియైనలేక తిరమును తెలియక
తిరుగునస్థిరుఁ డయి దేహి జగతి
తిరుగ నేల యనుచుఁ దెలియఁడా యజ్ఞాని
విశ్వదాభిరామ వినర వేమ!
తోలుకడుపులోన దొడ్డవాఁ డుండఁగ
[మార్చు]తోలుకడుపులోన దొడ్డవాఁ డుండఁగ
రాతిగుళ్ళలోన రాశిఁబోయ
రాళ్లుదేవుఁడైన రాసుల మ్రింగవా
విశ్వదాభిరామ వినర వేమ!
తెలుపు మాపుచేసి దిట్టతనంబునఁ
[మార్చు]తెలుపు మాపుచేసి దిట్టతనంబునఁ
దెలుపు భస్మముగను దేటపఱుచు
విధముకన్నఁ బరుసవేదియు లేదురా
విశ్వదాభిరామ వినర వేమ!
తవిటి కరయఁ బోఁవ దండులంబుల గంప
[మార్చు]తవిటి కరయఁ బోఁవ దండులంబుల గంప
శ్వానమాశ్రయించు సామ్యమునకు
కోమటింటి సొమ్ము క్రూరులపా లౌను
విశ్వదాభిరామ వినర వేమ!
తివిరి లేమియుంట తిరిపెకాఁ డెఱుగునె
[మార్చు]తివిరి లేమియుంట తిరిపెకాఁ డెఱుగునె
మొఱ్ఱబెట్టి నెత్తి మొత్తుఁగాని
పతిస ధర్మ మెన్నపడుచు కత్తెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!
తావసించుచోటఁ దగనల్గు డాయెనా
[మార్చు]తావసించుచోటఁ దగనల్గు డాయెనా
సౌఖ్యభూమి కపుడు జరుగవలయు
కొలఁకు లింకెనేని కొంగ లందుండునా
విశ్వదాభిరామ వినర వేమ!
తావులేనిచోట తాను తానె యుండు
[మార్చు]తావులేనిచోట తాను తానె యుండు
తావు కలుగుచోట తానులేఁడు
తావు తానెయైన తత్వంబుఁ దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!
తుంటవింటివాని తూపుల ఫూతకు
[మార్చు]తుంటవింటివాని తూపుల ఫూతకు
మింటి మంట నడుమ మిడుకఁ దరమె
యింటియాలి విడిచి యెట్లుండవచ్చురా
విశ్వదాభిరామ వినర వేమ!
తుమ్మచెట్ల ముండ్లు తోడనెపుట్టును
[మార్చు]తుమ్మచెట్ల ముండ్లు తోడనెపుట్టును
విత్తులోననుండి వెడలినట్లు
మూర్ఖునకును బుద్ధి ముందుగాఁ బుట్టును
విశ్వదాభిరామ వినర వేమ!
తల్లిరంకు తెలుప తద్దినములు
[మార్చు]ఆలిరంకు తెలుప నఖిల యజ్ఞంబులు
తల్లిరంకు తెలుప తద్దినములు
కాని తెరువు కర్మకాండ కల్పితమాయె
విశ్వదాభిరామ వినురవేమ!
తల్లివంకవారు తగనిపాటి
[మార్చు]ఆలివంకవార లాత్మబంథువులైరి
తల్లివంకవారు తగనిపాటి
తండ్రివంకవారు దాయాదిశతకమౌ
విశ్వదాభిరామ వినురవేమ!
తనకేనాడు సుభిక్షము
[మార్చు]తనకేనాడు సుభిక్షము
తనకేనాడును భగంబు తనరవయునం
చును తన దశకై యెల్లెడ
మనసందున జివుకుచుండు మహిలో వేమా!
తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
[మార్చు]తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
మిగిలి వెడలవేక మిణుకుచున్న
నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ
విశ్వదాభిరామ వినుర వేమ!
తనదు మనసుచేత దర్కించి జ్యోతిష
[మార్చు]తనదు మనసుచేత దర్కించి జ్యోతిష
మెంత చేసే ననుచు నెంచి చూచు,
తన యదృష్టమంత దైవ మెఱుంగడా?
విశ్వదాభిరామ వినుర వేమ!
తనగుణము తనకు నుండగ
[మార్చు]తనగుణము తనకు నుండగ
నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో
దన గుణము తెలియ కన్యుని
బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమ!
తను వలచిన దావలచును తను
[మార్చు]తను వలచిన దావలచును తను
వలవక యున్ననెనడు తావలవ డిలన్
తనదు పటాటోపంబులు తన
మాయలు పనికిరావు ధరలోన వేమా!
తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల
[మార్చు]తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల
నొనర శివుని జూడ నుపమ గలదు
మనసు చదరనీక మహిలోన జూడరా
విశ్వదాభిరామ వినుర వేమ!
తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
[మార్చు]తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
తలచి చూడనతకు తత్వమగును
వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినుర వేమ!
తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులు
[మార్చు]తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులు
పార్వతీభవు లిలబరమగురులు
కూలివాండ్ర జగతి గురులన ద్రోహము
విశ్వదాభిరామ వినుర వేమ!
తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి
[మార్చు]తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చునని గడింత్రు
కాని యెల్లయెడల ఘన దుఃఖన్‌దమది
విశ్వదాభిరామ వినుర వేమ!
తామసించి చేయదగ దెట్టి కార్యంబు
[మార్చు]తామసించి చేయదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినుర వేమ!
తామును జనులేమను కొన
[మార్చు]తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
రాని పధంబున నడిచిన
దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమా!
తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ
[మార్చు]తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ
వెంట దేరు ధనము వంటబోరు
తొనెటకు జనునొ ధనమెందు బోవునో
విశ్వదాభిరామ వినుర వేమ!
తండ్రిమాటలువిని తల్లిని తెగటార్చి
[మార్చు]తండ్రిమాటలువిని తల్లిని తెగటార్చి
పరశురాముడేమి ఫలముగనెను
నిలువనీడలేక కులగిరిచేరడా!
విశ్వదాభిరామ వినురవేమ!
తగవు తీర్చువేళ ధర్మంబుదప్పిన
[మార్చు]తగవు తీర్చువేళ ధర్మంబుదప్పిన
మానవుండు ముక్తి మానియుండు
ధర్మమునె పలికిన దైవంబు తోడగున్
విశ్వదాభిరామ వినురవేమ!
తోటకూరకైన దొగ్గలికైనను
[మార్చు]తోటకూరకైన దొగ్గలికైనను
తవిటికుడుముకైన తవిటికైన
కావ్యమ్మునను చెప్ప కవుల కర్మమ్మురా!
విశ్వదాభిరామ వినురవేమ!
తిత్తిలోన శివుని స్థిరముగా తెలియక
[మార్చు]తిత్తిలోన శివుని స్థిరముగా తెలియక
తిక్కపట్టి నరుడు తిరుగుచుండు
దిక్కదీర్ప గురుడు యొక్కడే దిక్కురా
విశ్వదాభిరామ వినురవేమ!
తనకు భాగ్యమున్నఁ దక్కువ లేకుండ
[మార్చు]తనకు భాగ్యమున్నఁ దక్కువ లేకుండ
కలుగు భాగ్యమెల్ల కల్లయనుచు
నమ్మకముగఁజూచు నరుడగు యోగిరా
విశ్వదాభిరామ వినురవేమ!
తనివితీర గురుని ధ్యానించి మదిలోని
[మార్చు]తనివితీర గురుని ధ్యానించి మదిలోని
తనువు మరచి గురుని తాకినపుడె
తనరుచుండు బ్రహ్మతత్త్వం మందురు దాని
విశ్వదాభిరామ వినురవేమ!
తమ్ముడొనరచేయు దానమ్ములనుజూచి
[మార్చు]తమ్ముడొనరచేయు దానమ్ములనుజూచి
తనకు ఫలమటంచు మిణుకరాదు
తనదు కాలు గోయ దనతమ్ము డేడ్చునా?
విశ్వదాభిరామ వినురవేమ!