వేమన పద్యాలు/ద
దొంగతనము ఱంకు దొరసియుండుర జగతి
[మార్చు]దొంగతనము ఱంకు దొరసియుండుర జగతి
ఱంకులాడికింత శంకపుట్టు
దొంగకన్న ఱేవెలుం గొప్పకానట్లు
విశ్వదాభిరామ వినర వేమ!
దొంగతనమువలన ద్రోహమెంతయుచేసి
[మార్చు]దొంగతనమువలన ద్రోహమెంతయుచేసి
ఎవ్వరెరుగకుండ నిముడుకున్న
తాఙూచేయుపనుల తగులకోకుందురా
విశ్వదాభిరామ వినురవేమ!
దొంగతెలివిచేత దొరకునా మోక్షంబు
[మార్చు]దొంగతెలివిచేత దొరకునా మోక్షంబు
చేతఁగానిపనులఁ జేయరాదు
గ్రుడ్డనంగ వలదు గుణహీనుఁడనవలె
విశ్వదాభిరామ వినర వేమ!
దొంగమాటలాడ దొరుకునె మోక్షంబు
[మార్చు]దొంగమాటలాడ దొరుకునె మోక్షంబు
చేతగానికూత చెల్ల దెపుడు
గురువుపద్దు గాదు గుణహీన మగుఁగాక
విశ్వదాభిరామ వినర వేమ!
దెందమందు దలచు తెప్పరమెప్పుడు
[మార్చు]దెందమందు దలచు తెప్పరమెప్పుడు
నోర్వలేని హీను నరునికంటె
తనకుమూడుసుమ్మి తప్పదెప్పటికైన
విశ్వదాభిరామ వినురవేమ!
దిక్కులేనిరోఁత దీనతఁ బాపిన
[మార్చు]దిక్కులేనిరోఁత దీనతఁ బాపిన
పురుషుఁడిహమునందు పూజ్యుఁడగును
పరమునందు వాని భాగ్య మేమనవచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!
దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టి
[మార్చు]దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టి
యడ్డమైన జనులనంటఁగట్టి
దోఁచుకున్న నట్టి దోష మెక్కడఁబోవు
విశ్వదాభిరామ వినర వేమ!
దొడ్డవాడననుచు దొరలదగ్గర చేరి
[మార్చు]దొడ్డవాడననుచు దొరలదగ్గర చేరి
చాడిచెప్పు పాపజాతినరుడు
చాడిచెప్పువాడు సాయుజ్యమొందునా?
విశ్వదాభిరామ వినురవేమ!
దాత లేని కొంప దయ్యాల పెనువాడ
[మార్చు]దాత లేని కొంప దయ్యాల పెనువాడ
నీతిగాని పాట వాతిచేటు
ప్రీతిలేని లంజ ఫూతియై తోఁచురా
విశ్వదాభిరామ వినర వేమ!
దాతగానివాని తఱచుగా వేఁడిన
[మార్చు]దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!
దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక
[మార్చు]దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక
మనము నమ్మెనేని మాయ గల్గు
జ్ఞానకలిక నమ్మఁ జంపును వైరుల
విశ్వదాభిరామ వినర వేమ!
దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చు
[మార్చు]దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చు
తేజ మొసఁగుకన్నఁ దెలివి హెచ్చు
తెలివికన్న నాసఁ దెగ వేయునది హెచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!
దానధర్మములను తెగ రేపు నేఁడని
[మార్చు]దానధర్మములను తెగ రేపు నేఁడని
కాలవ్యయముఁ జేయు కష్టజనుఁడు
తానునేమి యౌనొ తనబ్రతు కేమౌనొ
మాయఁదెలియ లేదు మహిని వేమా!
దానధర్మములును దయయు సత్యము నీతి
[మార్చు]దానధర్మములును దయయు సత్యము నీతి
వినయ ధైర్య శౌర్య వితరణములు
రాజుపాలిటి కివి రాజయోగంబులు
విశ్వదాభిరామ వినర వేమ!
దానమడుగువాఁడు ధరలోన నధముండు
[మార్చు]దానమడుగువాఁడు ధరలోన నధముండు
దానమడుగఁడేని దైవసముఁడు
దానమీనివాఁడు ధన్యుండు కాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!
దానములను జేయఁ దన చేతులాడక
[మార్చు]దానములను జేయఁ దన చేతులాడక
బహుధనంబుఁగూర్చి పాతిపెట్టు
తుదను దండుగ నిడు మొదలు చేర్చునరుండు
విశ్వదాభిరామ వినర వేమ!
దానములలో నన్నదానము దొడ్డది
[మార్చు]దానములలో నన్నదానము దొడ్డది
గానములను సామగాన మెచ్చు
ధ్యానములను శివునిధ్యానము శ్రేష్ఠము
విశ్వదాభిరామ వినర వేమ!
దీపంబు లేని యింటను
[మార్చు]దీపంబు లేని యింటను
రూపంబును దెలియలేరు రూఢిగఁ దమలో
దీపమగు తెలివి గలిగియు
పాపంబుల మఱుగుత్రోవఁ బడుదురు వేమా!
దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాత
[మార్చు]దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాత
దోఁచుకొన్నవాఁడు ద్రోహి యయ్యె
ప్రాపుఁ జూపువాఁడు పరమపుణ్యుం డయ్యె
ప్రాపుఁజెఱచువాఁడు పశువు వేమ!
దొమ్మరీనిలంజతోఁ గూడ దోషంబు
[మార్చు]దొమ్మరీనిలంజతోఁ గూడ దోషంబు
పాపియైన మనసుఁ బట్టరాదు
వీడు గదలిపోవ వెళ్లుదు రెటులనో
విశ్వదాభిరామ వినర వేమ!
దర్శనంబులందు ధర షణ్మతములందు
[మార్చు]దర్శనంబులందు ధర షణ్మతములందు
వర్ణకాశ్రమముల వదల కెపుడు
తిరుగుచున్నవాఁడు ధరలోన నధముండు
విశ్వదాభిరామ వినర వేమ!
ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
[మార్చు]ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
నటననైన సాహసముననైన
సంపదధికునుండి సాధించి ధనమును
బడుగు కిచ్చి బాగుపడును వేమ!
ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి
[మార్చు]ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి
స్నేహితునికినైనఁ జెరపుచేయు
నూహకలిగియుండు నోగుబాగులులేక
విశ్వదాభిరామ వినురవేమ!
ద్విజకులంబునందు తేజరిల్లుచు బుట్టి
[మార్చు]ద్విజకులంబునందు తేజరిల్లుచు బుట్టి
తా తరించి యెరుల దాట జేయ
లేని యాత డున్న లేకున్న నొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ!
ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె
[మార్చు]ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె
పేరటాలు మురువు పెండ్లిమొనసె
కులము మొదలుఁ బోయెఁ గూలెఁబో మానంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ద్విజుల ఖేదబెట్టి తిట్ట దొడగువాడు
[మార్చు]ద్విజుల ఖేదబెట్టి తిట్ట దొడగువాడు
మృతిని బొంది తాను వెతల బడగ
కాలు దరిని చేరు గడతేర లేడయా
విశ్వదాభిరామ వినురవేమ!
దేవపూజ సేయ దివ్యభోగము గల్గు
[మార్చు]దేవపూజ సేయ దివ్యభోగము గల్గు
తత్వ మెఱింగెనేని దైవసముఁడె
యేమిలేనినరున కేగతిలేదురా
విశ్వదాభిరామ వినర వేమ!
దేవభూములందు దేవాలయములందు
[మార్చు]దేవభూములందు దేవాలయములందు
దేవుఁడంచుఁ జెప్పి తెరువుఁజూపె
తెలియ విశ్వమెల్ల దేవాది దేవుఁడౌ
విశ్వదాభిరామ వినర వేమ!
దైవమతుల నరులు తమవంటివా రని
[మార్చు]దైవమతుల నరులు తమవంటివా రని
యరసి గూఢతత్వ మరయ లేరు
ఇల్లు మూయఁబడిన నెట్లు మర్మ మెఱుఁగు
విశ్వదాభిరామ వినర వేమ!
ద్వార బంధమునను తనయులు సంపద
[మార్చు]ద్వార బంధమునను తనయులు సంపద
బంధువర్గ మెల్ల ప్రహరిగోడ
మూఢులైన నరులు మొక్కలి కాండ్రయా
విశ్వదాభిరామ వినర వేమ!
దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె
[మార్చు]దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె
దేహితోడ నెపుడు దేహమందె
వాహనముల నెక్కి వడిఁదోలు మన్నాఁడు
విశ్వదాభిరామ వినర వేమ!
దేశదేశములను దిరిగిగాసిలినొంద
[మార్చు]దేశదేశములను దిరిగిగాసిలినొంద
నాత్మయందు ధ్యాన మంటుకొనునె
కాసులకును దిరుగఁ గలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!
దశయనంగ మెండుధన ముండుటే యండ్రు
[మార్చు]దశయనంగ మెండుధన ముండుటే యండ్రు
కూడు నిద్రలేక కుందుటయెకద!
రాగముంషబోవ బాగుగ నేడ్పించు
విశ్వదాభిరామ వినురవేమ!
దశరధుడు రామధరణీశు పట్టంబు
[మార్చు]దశరధుడు రామధరణీశు పట్టంబు
కట్టచేయదలప, గట్టెజడలు
తలపు మనదిగాని దైవిక మది వేరు
విశ్వదాభిరామ వినురవేమ!
దేశవేషములను తేటసేయక దేవుఁ
[మార్చు]దేశవేషములను తేటసేయక దేవుఁ
డాత్మలోన నుండ ననగిపెనగి
వేషమరసిచూడ గ్రాసంబు కొఱకయా
విశ్వదాభిరామ వినర వేమ!
దోసకారియైన దూసరియైనను
[మార్చు]దోసకారియైన దూసరియైనను
పగతుడైన వేదబాహ్యుడైన
వట్టిలేని పేదవాని కీదగు నీవి
విశ్వదాభిరామ వినురవేమ!
దోసముల్లువంటి తుర్యమం దాత్మను
[మార్చు]దోసముల్లువంటి తుర్యమం దాత్మను
జూచి యాసలనటుతోచివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!
దేహ యాత్మరూపు తేట తెల్లము జేసి
[మార్చు]దేహ యాత్మరూపు తేట తెల్లము జేసి
ఆవలి చూపుచూచు నతడె గురువు
భ్రమరము తనరూపు క్రిముల కిచ్చినరీతి
విశ్వదాభిరామ వినురవేమ!
దేహ సంకటమును దెగితేరకాండ్రకు
[మార్చు]దేహ సంకటమును దెగితేరకాండ్రకు
మోహదృష్టి విడిచి మూల మెఱిఁగి
వ్యూహ మొక్కటిపన్ని యుల్లంబు సంధించి
స్నేహ మెఱుఁగ యోగ సిద్ధి వేమ!
దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి
[మార్చు]దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి
మోహమందుఁ జిక్కి మోసపోఁడు
ఇంద్రజాలకుండు నెందుకుఁ జిక్కురా
విశ్వదాభిరామ వినర వేమ!
దేహాభిమాన ముండఁగ
[మార్చు]దేహాభిమాన ముండఁగ
మోహాదులు జననవార్ధిముంచును కలగా
నీహా విషయభావన
కూహాదులు పోవు మేలుకొన్నను వేమా!
దేహము లెస్సగ నుండిన
[మార్చు]దేహము లెస్సగ నుండిన
పోషణ తత్వంబులన్ని పొందుగఁ దెలియు
దేహము బడలికఁ బడినను
పోషణ తత్వములు వచ్చి పొందవు వేమా!
దేహియు జ్ఞానానలమున
[మార్చు]దేహియు జ్ఞానానలమున
దాహంబై దేహ మెల్లఁ దల్లడపడ నా
దేహములోఁ బొర్లాడుచు
మోహమడచి శివునిఁ జూడ ముక్తిర వేమా!
దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు
[మార్చు]దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు
బండరాజునకును బడుగుమంత్రి
కొండముచ్చునకును గోఁతియు సరియౌను
విశ్వదాభిరామ వినర వేమ!
దుష్టజనులగూడి తుంటరిపనులను
[మార్చు]దుష్టజనులగూడి తుంటరిపనులను
శిష్టకార్యములుగ చేయుచుంద్రు
కూడదనెడివారిగూడ నిందింతురు!
విశ్వదాభిరామ వినురవేమ!
దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక
[మార్చు]దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక
బారప ట్టెఱుగరు పడినదనుక
దండసాధ్యు లయిరి ధర్మసాధ్యులుగాక
భూమిజనులు వెఱ్ఱిబుద్ధి వేమ!
దూరదృష్టిగనరు తూగినదనుకను
[మార్చు]దూరదృష్టిగనరు తూగినదనుకను
పారుపట్టెరుగరు పడినదనుక
దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు!
విశ్వదాభిరామ వినురవేమ!
దూలములనుబోలు దురవస్థలనునెల్ల
[మార్చు]దూలములనుబోలు దురవస్థలనునెల్ల
రోసి యాసలన్ని గోసివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!
దూలాలు టెంకినుండిన
[మార్చు]దూలాలు టెంకినుండిన
వాలాయము చేటు వచ్చు వసుమతిలోన
లోలాక్ష విడిచిపెట్టిన
మేలిమిగా బ్రతుకవచ్చు మేదిని వేమా!
దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
[మార్చు]దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
దశయలేమి నెంత్రు తక్కువగను
దశయన గమ ధన దశమొక్కటే దశ
విశ్వదాభిరామ వినుర వేమ!
ద్వారంబంధమునకు దలుపులు గడియలు
[మార్చు]ద్వారంబంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
విశ్వదాభిరామ వినురవేమ !