వేమన పద్యాలు/ఓ
Appearance
ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
[మార్చు]ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావ మిచ్చి మెచ్చు పరమ లుబ్ధు
పంది బురద మెచ్చుఁ బన్నీరు మెచ్చునా?
విశ్వదాభిరామ వినర వేమ!
ఓగుబాగెఱుఁగని యుత్తమూఢజనంబు
[మార్చు]ఓగుబాగెఱుఁగని యుత్తమూఢజనంబు
లిలను ధీ జనముల నెంచుటెల్ల
కరినిజూచి కుక్క మొఱిగిన సామ్యమౌ
విశ్వదాభిరామ వినర వేమ!
ఓజమాలుపొలతి యోలిమాడలు చేటు
[మార్చు]ఓజమాలుపొలతి యోలిమాడలు చేటు
పోటికెడలుబంటు కూటి చేటు
పనికిమాలినతొత్తు బత్తెంబు చేటురా
విశ్వదాభిరామ వినర వేమ!