వేమన పద్యాలు/ధ
ధనమే మూలము జగతికి
[మార్చు]ధనమే మూలము జగతికి
ధనమే మూలంబు సకలధర్మంబులకు
గొనమే మూలము సిరులకు
మనమే మూలంబు ముక్తి మహిమకు వేమా!
ధనమెచ్చిన మదమెచ్చును
[మార్చు]ధనమెచ్చిన మదమెచ్చును
మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు
ధనముడిగిన మదముడుగును
మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!
ధనము గూడఁబెట్టి ధర్మంబు సేయక
[మార్చు]ధనము గూడఁబెట్టి ధర్మంబు సేయక
తాను దినకలెస్స దాచుగాఁక
తేనె నీఁగె కూర్చి తెరువర్ల కియ్యదా
విశ్వదాభిరామ వినర వేమ!
ధనము లేకయున్న ధైర్యంబు నిలువదు
[మార్చు]ధనము లేకయున్న ధైర్యంబు నిలువదు
ధైర్య మొదవలేని ధనము లేదు
ధనము ధైర్య మరయ ధర భూమిపతులకు
విశ్వదాభిరామ వినర వేమ!
ధనము లేమి యనెడు దావానలం బది
[మార్చు]ధనము లేమి యనెడు దావానలం బది
తన్నుఁ జెఱచును దరిదాపుఁ జెఱచు
ధనములేమి చూడఁదలఁచగా పాపంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ధనములేమి కులము తక్కువపడవచ్చు
[మార్చు]ధనములేమి కులము తక్కువపడవచ్చు
ధనములేమి కీర్తి దలఁగిపోవు
ధనములేమి శుచిని దగఁబుట్టనియ్యదు
ధనములేమి ఘనత తప్పు వేమ!
ధనములేమి సుతులు తప్పుల నిడుదురు
[మార్చు]ధనములేమి సుతులు తప్పుల నిడుదురు
ధనములేమి పత్నిఁ దాకరాదు
ధనములే మెవరికి తాళిక యుండదు
విశ్వదాభిరామ వినర వేమ!
ధనవిహీనుఁడైన తండ్రి గర్భంబున
[మార్చు]ధనవిహీనుఁడైన తండ్రి గర్భంబున
భాగ్యపురుషుఁ డొకఁడు పరఁగఁబుట్టి
బహుళధనము గూర్చి భద్రమార్గంబున
పరుల కుపకరించి పరఁగు వేమ!
ధ్యానివలెనె యుండు మౌనివలనె యుండు
[మార్చు]ధ్యానివలెనె యుండు మౌనివలనె యుండు
భోగివలెనె యుండు రోగివలెనె
సకలము దెలిసినను సర్వజ్ఞుఁడై యుండు
బరమయోగివలెనె పరగ వేమా!
ధర గిరులు జలధు లన్నియు
[మార్చు]ధర గిరులు జలధు లన్నియు
పరికింపగఁ బ్రళయమునను భస్మావృతులౌ
సురలును మునులును జనఁగా
నెరయోగులు నుండఁగలరె నేర్పున వేమా!
ధర, గ్రహములు రాశి చరియించుచుండిన
[మార్చు]ధర, గ్రహములు రాశి చరియించుచుండిన
మంచిచెడుగు కానిపించుచున్న
పురుషయత్నమనుచు పొంగుదురేలరా
విశ్వదాభిరామ వినురవేమ!
ధారదత్తమైన తామ్రపుఁబలకను
[మార్చు]ధారదత్తమైన తామ్రపుఁబలకను
లావుటుంగరమున లంకెజేసి
యరయ మీఁదముద్ర యమరియుండంగను
నదియ శాసనంబు నవని వేమ!
ధర్మకంటకుండు ధనముచే గర్వించి
[మార్చు]ధర్మకంటకుండు ధనముచే గర్వించి
సకలసంపదలను జాలఁ బొరసి
కడకు తాను మేలు గానక చెడిపోవు
విశ్వదాభిరామ వినర వేమ!
ధార్మికునకుఁ గాని ధర్మంబుఁ గనరాదు
[మార్చు]ధార్మికునకుఁ గాని ధర్మంబుఁ గనరాదు
కష్టజీవి కెట్లు కానఁబడును
నీరుచొరకలోతు నిజముగాఁ దెలియదు
విశ్వదాభిరామ వినర వేమ!
ధర్మమన్న వినరు తము నమ్మి భూనరుల్
[మార్చు]ధర్మమన్న వినరు తము నమ్మి భూనరుల్
యమునివారు వచ్చి యడలు నించి
చొచ్చి కట్టఁదారు చొరఁబారఁ గలరొకో
విశ్వదాభిరామ వినర వేమ!
ధర్మమరసి పూని ధర్మరాజాదులు
[మార్చు]ధర్మమరసి పూని ధర్మరాజాదులు
నిర్మలంపు ప్రౌఢి నిలుపుకొనిరి
ధర్మమే నృపులకు తారకయోగంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ధర్మమునకుఁ గీడు తలఁచినవాఁడు తా
[మార్చు]ధర్మమునకుఁ గీడు తలఁచినవాఁడు తా
దుష్టమార్గుఁ డవును ద్రోవ చెడును
గురువుపత్నిగవయఁ గోరెడువాఁడు తా
మొదలెచెడును ముప్పు మొనసి వేమ!
ధర్మసత్యములను దప్పకచేయని
[మార్చు]ధర్మసత్యములను దప్పకచేయని
కర్మజీవి మేలుఁ గానఁలేఁడు
నిర్మలహృదయుండు నీరూపమున నుండు
విశ్వదాభిరామ వినర వేమ!
ధైర్యయుతుని కితరధనమైన నదురేమి
[మార్చు]ధైర్యయుతుని కితరధనమైన నదురేమి
దాన మిచ్చునపుడె తనకుఁదక్కె
నెలమి మించుపనికినెవ రేమిసేయుదు
రడుగుదప్ప తప్పు పిడుగు వేమ!
ధూమాదుల నావృతమై
[మార్చు]ధూమాదుల నావృతమై
వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో
శ్రీమించు శివుని జేరును
గామాదుల గలియడతడు ఘనముగ వేమా !