వేమన పద్యాలు/వ
వాఁత నాకు మేను వలపట మెడవాఁడు
[మార్చు]వాఁత నాకు మేను వలపట మెడవాఁడు
ఒంటికాలువాఁడు నొప్పుచుండు
రాజసభలయందె రంజిల్ల మాట్లాడు
విశ్వదాభిరామ వినర వేమ!
వంటదప్పునపుడు వంటకము విషంబు
[మార్చు]వంటదప్పునపుడు వంటకము విషంబు
కంటఁ జూడఁగానె కంటగించుఁ
గంటకమునఁ దిన్నకడి గండమైవచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!
వంటవారియింట తిన్నవంటకమును
[మార్చు]వంటవారియింట తిన్నవంటకమును
వంట తినినయపుడె వెంటవచ్చు
వచ్చు నట్లగాక వరఁకు నుభయులకు
కంటకమగు వంటకమును వేమా!
వెండికొండ పసిడికొండయు తనకుండ
[మార్చు]వెండికొండ పసిడికొండయు తనకుండ
దేవు డేలబోయి తిరిపెమెత్తె?
దైవబలమేగాని, తనబల్మికాదయా!
విశ్వదాభిరామ వినురవేమ!
వండివచ్చునపుడు వంటక మమృతంబు
[మార్చు]వండివచ్చునపుడు వంటక మమృతంబు
కంటికింపుగాను కానుపించు
నొడలతినినదిండి వడిమించ గడిదేఱు
విశ్వదాభిరామ వినర వేమ!
వాక్కుచేత దప్పు వావులు వరుసలు
[మార్చు]వాక్కుచేత దప్పు వావులు వరుసలు
వాక్కుచేత దప్పు వనిత గుణము
వాక్కుచేత కలుగు వర కర్మములు భువిన్
విశ్వదాభిరామ వినురవేమ!
వాక్కునందు గురువు వాక్తత్వము గురువు
[మార్చు]వాక్కునందు గురువు వాక్తత్వము గురువు
చీఁకటింట గురువు చిక్కియుండు
అఖిలమునకు గురువె యాధార మయియుండు
విశ్వదాభిరామ వినర వేమ!
వాక్కుశుద్ధి లేనివాఁడు చండాలుండు
[మార్చు]వాక్కుశుద్ధి లేనివాఁడు చండాలుండు
ప్రేమశుద్ధిలేని పెట్టులేల
నొసలు భక్తుఁడైన నోరు తోడేలయా
విశ్వదాభిరామ వినర వేమ!
వక్షమందు గురుని వర్ణించి చూడరా
[మార్చు]వక్షమందు గురుని వర్ణించి చూడరా
రక్షకత్వమునకు రాచబాట
అక్షమాల జపమె యటవి దొంగలరీతి
విశ్వదాభిరామ వినురవేమ!
వచ్చెడిది పోయెడిది మఱి
[మార్చు]వచ్చెడిది పోయెడిది మఱి
చచ్చెడిదియుఁ గనకలేక సహజము లనుచు
విచ్చలవిడిగాఁ దిరుగుట
చిచ్చునఁబడునట్టి మిడుత చెలువము వేమా!
విటునిఁగన్నయంత విశదమై వలపుండు
[మార్చు]విటునిఁగన్నయంత విశదమై వలపుండు
బోటిఁజూడకట్టిపాటి గలదె
కంటిలోనిపాప కన నెంతవాఁడురా
విశ్వదాభిరామ వినర వేమ!
విటులకనుల కెంత విభ్రమమై యుండు
[మార్చు]విటులకనుల కెంత విభ్రమమై యుండు
సాటిలేని పొలఁతి చక్కఁదనము
కంటిలోనిపాప కుంటెనకాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!
వాడకుఱికి తిట్టు వలదన్న మొఱఁబెట్టు
[మార్చు]వాడకుఱికి తిట్టు వలదన్న మొఱఁబెట్టు
ముందు మగనిఁ దిట్టు ముసుఁగుపెట్టు
గడుసురాలు మగని గంపఁ బెట్టమ్మురా
విశ్వదాభిరామ వినర వేమ!
వేడబంబువాని వినయంబు లధికంబు
[మార్చు]వేడబంబువాని వినయంబు లధికంబు
చెడ్డముండ ముసుఁగు చెలఁగిపెట్టు
చెడిపెకొడుకు మిగులచేయు నాచారంబు
విశ్వదాభిరామ వినర వేమ!
వాడవదినెకేల వావివర్తనములు
[మార్చు]వాడవదినెకేల వావివర్తనములు
చాడివాని కేల జాడబుద్ధి
మూఢసతులకేల ముదముతో జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ!
విడువ ముడువ లేక కుడువఁ గట్టఁగ లేక
[మార్చు]విడువ ముడువ లేక కుడువఁ గట్టఁగ లేక
వెఱపులేక విద్య నొరయలేక
వెడలలేనివాని నడపీనుఁ గందురో
విశ్వదాభిరామ వినర వేమ!
వాడువాడుకాడు వానిలోపలనుండు
[మార్చు]వాడువాడుకాడు వానిలోపలనుండు
వాడేవాడు వాడువాడుకాడు
వాడు వానిని గూర్చువాడేపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ!
విడువవలయు నూరు విశ్రాంతి గాకున్న
[మార్చు]విడువవలయు నూరు విశ్రాంతి గాకున్న
విడువవలయు నాలి విధముఁ దెలిసి
విడువవలయు రాజు వితరణి గాకున్న
విశ్వదాభిరామ వినర వేమ!
వాతగుణము చేత వలపున మగవాఁడు
[మార్చు]వాతగుణము చేత వలపున మగవాఁడు
లొట్టకనులదాని లోలతకును
పుట్టి జగతి నిలుచు పునరుద్భవంబగు
విశ్వదాభిరామ వినర వేమ!
విత్తనంబు గురువు విశ్వంబునకు నెల్ల
[మార్చు]విత్తనంబు గురువు విశ్వంబునకు నెల్ల
ప్రణవమంత్ర మరయ పరమ గురువు
కర్మ గురువు సుమ్ము గాయత్రిమంత్రంబు
విశ్వదాభిరామ వినురవేమ!
విత్తును నుముకయుఁ ధరలోఁ
[మార్చు]విత్తును నుముకయుఁ ధరలోఁ
బొత్తున జనియించి పొట్టుపోయినభంగి
వేత్తయగువానికర్మం
బత్తెఱగున విడిచిపోవు ననువున వేమా!
విత్తులేని వృక్షమొక్కటి పుట్టె
[మార్చు]విత్తులేని వృక్షమొక్కటి పుట్టె
ఫలము లేని పువ్వు మొదలు పత్రిలేదు
స్వాదులేదు చూడ నాపాటుకును లెస్స
దీనిభావ మేమి తెలుపు వేమా!
వెదకి కానలేఁడు వేదాంతవేద్యుని
[మార్చు]వెదకి కానలేఁడు వేదాంతవేద్యుని
తత్వవేత్తలేఁడు ధరణిలోనఁ
గలిగెనేని యతఁడు కనఁబోఁడు మఱివేఱె
విశ్వదాభిరామ వినర వేమ!
వెదకి కానలేరు వేదాంత వేద్యుని
[మార్చు]వెదకి కానలేరు వేదాంత వేద్యుని
నుత్తముండు గాంచు నుర్విమీఁదఁ
గలిగెనేని వానిఁ గానంగ లేరయా
విశ్వదాభిరామ వినర వేమ!
వెదక వెదకఁ దొఱకు వేదాంతవేద్యుండు
[మార్చు]వెదక వెదకఁ దొఱకు వేదాంతవేద్యుండు
వెదకువానిఁ దాను వెదకుచుండు
వెదకనేర్చునట్టి వెరవరుల్ గలరొకో
విశ్వదాభిరామ వినర వేమ!
విద్దెదానిపొందు విడువఁ జాలక తుల్వ
[మార్చు]విద్దెదానిపొందు విడువఁ జాలక తుల్వ
చచ్చుదాఁకమోయు చాపగుడిసె
భాగవతులపట్టు పట్టంగ నోపఁడు
విశ్వదాభిరామ వినర వేమ!
వేదవిద్య గాదు వీరవిద్యయుఁ గాదు
[మార్చు]వేదవిద్య గాదు వీరవిద్యయుఁ గాదు
బాధవిద్యయుఁగాదు పరపు గాదు
మధురమైన యట్టి మనసు నిల్పెడివిద్య
సాధువిద్య యెన్న సరస వేమా!
వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి
[మార్చు]వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి
భ్రమలపెట్టి తేటపడగ నీవు
గుప్తవిద్య యొకటె కులకాంతవంటిది
విశ్వదాభిరామ వినర వేమ!
వేదశాస్త్రములను విని యేమి కుడిచిరి
[మార్చు]వేదశాస్త్రములను విని యేమి కుడిచిరి
యరిగితిరిగి సొత్తు రందఱిల్లు
బ్రహ్మమహిమఁ దెలిసి బ్రతుకుట నిజమయా
విశ్వదాభిరామ వినర వేమ!
విధికృతములందు రన్నియు
[మార్చు]విధికృతములందు రన్నియు
విధికిని విధి లెస్సయయ్యె విష్ణు జపింప
విధియుభవురూప మందెను
విధి బ్రహ్మము సుమ్ముదలప వినరా వేమా!
వాని గననివాఁడు వాఁడు కానేకాఁడు
[మార్చు]వాని గననివాఁడు వాఁడు కానేకాఁడు
వానిలోనివాఁడు వాఁడు సుమ్మి
వాని గన్నవాఁడు వాఁడెపో యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!
వెన్న చేతఁబట్టి వివరంబు దెలియక
[మార్చు]వెన్న చేతఁబట్టి వివరంబు దెలియక
ఘృతముఁ గోరునట్టి యతనిభంగి
తాను దైవమయ్యు దైవంబుఁ దలఁచును
విశ్వదాభిరామ వినర వేమ!
విన్నవానికన్నఁ గన్నవాఁ డధికుండు
[మార్చు]విన్నవానికన్నఁ గన్నవాఁ డధికుండు
కన్నవానికన్నఁ గలియువాఁడు
ఉన్నతోన్నతుఁడయి యుర్విలోపల నుండు
విశ్వదాభిరామ వినర వేమ!
వానను దడియనివారును
[మార్చు]వానను దడియనివారును
పూనిక విడ మన్న చేఁత బొరయనివారున్
నానాదిక్కుల వెదకినఁ
గానమురా నెంతవాని గానము వేమా!
వినియు వినకయుండు వెఱ్ఱివాఁడై యుండు
[మార్చు]వినియు వినకయుండు వెఱ్ఱివాఁడై యుండు
కనియుఁ గానకుండు కడఁగి యోగి
మనుజవరులచేత మఱిపూజఁ గొనుచుండు
విశ్వదాభిరామ వినర వేమ!
వినియుండెడి జనమెల్లను
[మార్చు]వినియుండెడి జనమెల్లను
చనిపోయినవారి పుణ్యసత్కథ లెలమి
వినవలెఁ గనవలె ననవలె
ననిమిషునకునైనఁ దెలియ దంత్యము వేమ!
వానరాకడ మఱి ప్రాణంబు పోకడ
[మార్చు]వానరాకడ మఱి ప్రాణంబు పోకడ
కానఁబడదు ఘనుని కైనఁగాని
కానఁబడిన మీఁద కలి యిట్లునడుచునా
విశ్వదాభిరామ వినర వేమ!
వినరననక మెల్ల వెలిమూసి వాయువుల్
[మార్చు]వినరననక మెల్ల వెలిమూసి వాయువుల్
మనసుతోడఁ గూర్చి మర్మ మెఱిఁగి
యాత్మలింగపూజ నంటిన ముక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ!
వినవలె నెవ్వరు చెప్పిన
[మార్చు]వినవలె నెవ్వరు చెప్పిన
వినినంతనె తమకపడక వివరింపవలె
విని కని వివరము దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుడు మహిలో వేమా!
విను వివేకమనెడి వింతగొడ్డలిచేత
[మార్చు]విను వివేకమనెడి వింతగొడ్డలిచేత
వలయవిద్యయనెడు నడవి నఱికి
తెలివియనెడుగొప్ప దీపంబు చేఁబట్టి
ముక్తిఁ జూడవచ్చు మొనసి వేమ!
వినుకలి కనుకలి గోరము
[మార్చు]వినుకలి కనుకలి గోరము
కనుకలియాకాంతగూడి కవయగ గోరు
గనుగొని ప్రేమన్బొరలును
ఘనతరమోహంబుచోటు గదరా వేమా!
విప్రవరుల మనుచు వేదంబుఁ జదువక
[మార్చు]విప్రవరుల మనుచు వేదంబుఁ జదువక
ప్రాకృతులను జూచి పరిహసించు
ధరణిసురులకన్న దాసరిమత మెచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!
వేమన చెప్పిన మాటలు
[మార్చు]వేమన చెప్పిన మాటలు
సామంబున సకలవేద సారంబుగదా
సామెత పంచాక్షరిలో
నీమహిమలఁ దెలియకున్న నింపా వేమా!
వేమన పద్యము లన్నిటి
[మార్చు]వేమన పద్యము లన్నిటి
సామంబునఁ జదివినట్టి సజ్జను లెల్ల
సోమనతల సుందరు కడు
నేమంబునఁ జూడరయ్య నేర్పున వేమ!
వేమన్నా నీమహిమలు
[మార్చు]వేమన్నా నీమహిమలు
నేమన్నా తెలియ దింక నెటువలె నన్నా
వేమన్నా నీచిత్త మ
దేమన్నా నీవె మాకు నెఱుక గదన్నా!
వేమననగ యోగి వెలసె లోకములోనఁ
[మార్చు]వేమననగ యోగి వెలసె లోకములోనఁ
బూజలిడుఁడు, పుణ్య పురుషులార
పూజలిడిన యంత, భుక్తి ముక్తుల నిచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!
వేము పాలఁబోసి వెయ్యేండ్లు పెంచిన
[మార్చు]వేము పాలఁబోసి వెయ్యేండ్లు పెంచిన
చేదువిడిచి తీపు చెందదెపుడు
నోగుగుణము విడిచి యుచితజ్ఞుఁ డగునట్లు
విశ్వదాభిరామ వినర వేమ!
వేముఁడిట్లు చెప్పె వేల పద్యంబులు
[మార్చు]వేముఁడిట్లు చెప్పె వేల పద్యంబులు
తప్పు లెన్నియున్న నొప్పియుండు
తత్తఱపడ కందుఁ జిత్తము నిల్పుము
విశ్వదాభిరామ వినర వేమ!
వెయ్యారుగతుల జలనిధి
[మార్చు]వెయ్యారుగతుల జలనిధి
తియ్యగ ననిశంబు గలయ దిప్పుట యరుదౌ
కొయ్యకుఁదా సుజ్ఞానము
వెయ్యి విధంబులను జెప్ప వృథరా వేమా!
వేయుపద్యముల వివేకియై భక్తితోఁ
[మార్చు]వేయుపద్యముల వివేకియై భక్తితోఁ
బఠనఁ జేసినట్టి భక్తులకును
బాయకుండు మోక్షపద మరచేతిదై
విశ్వదాభిరామ వినర వేమ!
వాయువందె పుట్టి వాయువందె పెఱిగి
[మార్చు]వాయువందె పుట్టి వాయువందె పెఱిగి
వాయువందు మేలు వరుసఁ దెలియ
వాయువందు ప్రాణవాయువు తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!
వేయువిధము లమర వేమనపద్యంబు
[మార్చు]వేయువిధము లమర వేమనపద్యంబు
లర్థ మిచ్చువాని నరసి చూడ
చూడఁజూడఁ గలుగుచోద్యమౌ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ!
వ్రాఁత వెంటఁగాని వరమీడు దైవంబు
[మార్చు]వ్రాఁత వెంటఁగాని వరమీడు దైవంబు
సేఁతకొలదిగాని వ్రాఁతగాదు
వ్రాఁతకజుఁడు కర్త చేఁతకుఁ దాఁగర్త
విశ్వదాభిరామ వినర వేమ!
వారకాంత లెల్ల వలచి యేతెంతురా
[మార్చు]వారకాంత లెల్ల వలచి యేతెంతురా
పొందుఁజేసి ధనము పుచ్చుకొఱకు
మాచలమ్మ వచ్చి మఱి యిల్లువెళ్లురా
విశ్వదాభిరామ వినర వేమ!
వ్రతము లెన్నియైన వట్టిచిక్కులె కాని
[మార్చు]వ్రతము లెన్నియైన వట్టిచిక్కులె కాని
యాత్మచిక్కుఁ గాన నలవిగాదు
ఆత్మచిక్కుఁ బాపునతఁడెపో ఘనయోగి
విశ్వదాభిరామ వినర వేమ!
వ్రేయవ్రేయనదియ విత్తన మనిపించు
[మార్చు]వ్రేయవ్రేయనదియ విత్తన మనిపించు
వ్రేయవ్రేయఁ బ్రబల వృక్షమగును
తెలియఁ దెలియవాఁడు దేవుఁడనందగు
విశ్వదాభిరామ వినర వేమ!
వరలు రత్నసమితివలెఁ గూర్చుధాన్యంబుఁ
[మార్చు]వరలు రత్నసమితివలెఁ గూర్చుధాన్యంబుఁ
జక్కదంచి వండి మిక్కుటముగ
సుష్టుభోజనములఁ జూరగా నిడువాఁడు
చెప్పనేల వాఁడు శివుఁడు వేమ!
వేరు పురుగు చేరి వృక్షంబు జెఱుచును
[మార్చు]వేరు పురుగు చేరి వృక్షంబు జెఱుచును
చీడ పురుగు చేరి చెట్టుఁ జెఱుచు
కుత్సితుండు చేరి, గుణవంతుఁ జెఱచురా
విశ్వదాభిరామ వినర వేమ!
వెఱ్ఱినక్కలవలె వేదముల్ చదివెద
[మార్చు]వెఱ్ఱినక్కలవలె వేదముల్ చదివెద
రాశయంబు లెఱుఁగరయ్య వారు
వేదసారమంత వేమన యెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ!
వెఱ్ఱిమొద్దు కేల వేదశాస్త్రంబులు
[మార్చు]వెఱ్ఱిమొద్దు కేల వేదశాస్త్రంబులు
ముద్దులాడి కేల ముసలిమగఁడు
చద్ది మిగులనింట సంసార మేలరా
విశ్వదాభిరామ వినర వేమ!
వెఱ్ఱివాని కయిన వేషధారికయిన
[మార్చు]వెఱ్ఱివాని కయిన వేషధారికయిన
రోగికైన పరమయోగికైన
స్త్రీలఁజూచినపుడె చిత్తంబు రంజిల్లు
విశ్వదాభిరామ వినర వేమ!
వెఱవవలెఁ బామునకు నిల
[మార్చు]వెఱవవలెఁ బామునకు నిల
వెఱవఁగవలె మరణమునకు విశ్వములోన
మఱవగవలె సంగమముల
మఱి మఱువగ వలదు మేలు మహిలో వేమా!
వెలఁది చక్కఁదనము వెరపైన యీడును
[మార్చు]వెలఁది చక్కఁదనము వెరపైన యీడును
విభుని కరుణలేక వితగనుండు
నీదుకరుణలేక నేర్పులు కొఱగావు
విశ్వదాభిరామ వినర వేమ!
వలపు తీఱువెనుక వనజాక్షి యధరంబు
[మార్చు]వలపు తీఱువెనుక వనజాక్షి యధరంబు
ములకపంటిగిజరు ముష్టిరసము
చింతలేనివేళ జీడిసమానమౌ
విశ్వదాభిరామ వినర వేమ!
వెలయ పరమతత్వ విభవంబు దెలియక
[మార్చు]వెలయ పరమతత్వ విభవంబు దెలియక
బాహ్యవిద్యచేత బరఁగు టెల్ల
పూరి మెసవఁగ హరి పోయినచందంబు
విశ్వదాభిరామ వినర వేమ!
వెలయాలి వలనఁ గూరిమి
[మార్చు]వెలయాలి వలనఁ గూరిమి
కలుగదు, మఱి కలిగెనేని కడతేరదురా
పలువురు నడిచెడి తెరువున
పులు మొలవదు, మొలిచెనేని పొదలదు వేమా!
వెల్లకుక్కల యెంగిలి విశదమాయె
[మార్చు]వెల్లకుక్కల యెంగిలి విశదమాయె
పడుచువేశ్యల యెంగిలి ప్రాప్తమాయె
చెడుగు నెంగిలి యెంతకు శ్రేష్ఠమాయె
ఇష్టమగువారి యెంగిలి యెగ్గు వేమ!
వల్లవైపులేక వాగ్దత్త మటుచేసి
[మార్చు]వల్లవైపులేక వాగ్దత్త మటుచేసి
యదిగొయిదిగొ యనుచు నాసఁబెట్టి
గడువుఁ బెట్టి రేపు గడియ కానిమ్మని
గడియలోనఁ బడియెఁ గదర వేమ!
వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల
[మార్చు]వలలుపన్ని దుష్ట వన్యమృగంబుల
పట్టవచ్చుగాని, పాడుకర్మ
గురునిబోధ లేక కుదురు చెందదు సుమీ
విశ్వదాభిరామ వినురవేమ!
వెళ్లి వచ్చు నాఁడు మళ్లి పోయెడు నాఁడు
[మార్చు]వెళ్లి వచ్చు నాఁడు మళ్లి పోయెడు నాఁడు
వెంట రాదు; ధనము కొంచఁ బోఁడు;
తానదేడఁ బోనొ ధన మేడఁ బోవునో?
విశ్వదాభిరామ వినర వేమ!
వావివర్తనలును వరుసలు మర్యాద
[మార్చు]వావివర్తనలును వరుసలు మర్యాద
దప్పి నడచెనేని తగులుఁ గీడు
వదల దపుడు తాకు నది దప్పినం దుది
ముసలిముప్పునైన మునుగు వేమా!
విశ్వము నడుపంగ విశ్వేశ్వరుం డుండ
[మార్చు]విశ్వము నడుపంగ విశ్వేశ్వరుం డుండ
బ్రహ్మలకునునేల పాటిదక్కె
వనములోని క్రోతి వసుమతి నడుపునా
విశ్వదాభిరామ వినర వేమ!
వేష మొనరఁగట్టి వెలయ శూద్రత్వంబు
[మార్చు]వేష మొనరఁగట్టి వెలయ శూద్రత్వంబు
తనకు లేదనుకొను ధరణి ద్విజుఁడు
అరిది గిట్టువేళ నడఁగు ద్విజత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!
వైష్ణవుల మటంచు వార్తమాత్రమె కాని
[మార్చు]వైష్ణవుల మటంచు వార్తమాత్రమె కాని
భ్రష్టు లంతకన్న వేఱులేరు
చారు బలమదైన నీరుగాఁ బోవునా
విశ్వదాభిరామ వినర వేమ!
విష్ణుభక్తులెల్ల వెలిబూదిపాలైరి
[మార్చు]విష్ణుభక్తులెల్ల వెలిబూదిపాలైరి
వాదమేల మతవిభేదమేల
తెలియ లింగధారులు తిరుమణిపాలైరి
విశ్వదాభిరామ వినర వేమ!
విషయము లొరసిన నొరయఁడు
[మార్చు]విషయము లొరసిన నొరయఁడు
విషయేంద్రియ పరదళంబు సేయగ మఱిదా
విషమాది షట్కమను దు
ర్విషయములను బొందకుండ వేమన నేర్చు!
విషయములఁ బొరలి రోయక
[మార్చు]విషయములఁ బొరలి రోయక
విషమంటినగతిని జూచి విముఖత ధరలో
విష సమమాయా సుఖముల
విషయముల గూడకుండ్రు వేత్తలు వేమా!
విషయములు తెరలపొలుపున
[మార్చు]విషయములు తెరలపొలుపున
విషయము లంటక మహాత్ము విధమున ధరలో
విషసంసారము లన్నియు
విషయము లన్నియును గెల్వ వేమన నేర్చు!
విషసహితులు నరులు విషధరు లెన్నఁగ
[మార్చు]విషసహితులు నరులు విషధరు లెన్నఁగ
విష విషధరములను విరియఁగొట్ట
నఘము వచ్చుకడకు నాయువుకొదువగు
విశ్వదాభిరామ వినర వేమ!
వినియు వినకయుండు కనియు గనక యుండు
[మార్చు]వినియు వినకయుండు కనియు గనక యుండు
తలచి తలపకుండు తాను యోగి
మనుజవరులచేత మణిపూజ గొనుచుండు
విశ్వదాభిరామ వినురవేమ!
వెన్న చేతబట్టి వివరంబు తెలియక
[మార్చు]వెన్న చేతబట్టి వివరంబు తెలియక
ఘృతము కోరునట్టి యతని భండి
తాను దైవమయ్యు దైవంబు దలచును
విశ్వదాభిరామ వినురవేమ!
వేషధారినెపుడు విశ్వసింపగరాదు
[మార్చు]వేషధారినెపుడు విశ్వసింపగరాదు
వేషదోషములొక విధయె యగును
రట్టుకాదె మునుపు రావణు వేషంబు
విశ్వదాభిరామ వినురవేమ!