వేమన పద్యాలు/మ
మంచి రుచులగోరు మంచి స్త్రీలనుగోరు
[మార్చు]మంచిరుచులను గోరు మంచిస్త్రీలను గోరు
మనుజుఁ డెంత చెడ్డమనసు చూడ
నించుకైన నేలని విడువఁడు
విశ్వదాభిరామ వినర వేమ!
మంచిగంథముగన మనసురంజిల్లును
[మార్చు]మంచిగంథముగన మనసురంజిల్లును
ఎంతో వాసననుచు నెన్ను చుంద్రు
తామెరంగలేరు తమ పూర్వ వాసన
విశ్వదాభిరామ వినురవేమ!
మంచివారు లేరు మహిమీఁద వెదకినఁ
[మార్చు]మంచివారు లేరు మహిమీఁద వెదకినఁ
గష్టు లెందరైనఁ గలరు భువిని
పసిఁడి లేదె గాని సదడెంత లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!
మంచిశకునము లని యెంచి పెండ్లియాడు
[మార్చు]మంచిశకునము లని యెంచి పెండ్లియాడు
వార లొకరు లేరు వసుధలోన
జనులకర్మములను శకునము ల్నిల్చునా
విశ్వదాభిరామ వినర వేమ!
మంటికుండవంటి మాయ శరీరంబు
[మార్చు]మంటికుండవంటి మాయ శరీరంబు
చచ్చునెన్నడైన, చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినుర వేమ!
మంటలోహమందు మ్రాకులు శిలలందు
[మార్చు]మంటలోహమందు మ్రాకులు శిలలందు
పటము గోడలందుఁ బ్రతిమలందు
తన్నుఁ దెలియుకొఱకు తగులదా పరమాత్మ
విశ్వదాభిరామ వినర వేమ!
మంటలోహమునలు మ్రాను చీలలయందు
[మార్చు]మంటలోహమునలు మ్రాను చీలలయందు
పటముగోడలందుఁ బరగ నిసుక
బెట్టనంటునట్ల పెనఁగు దేహముజీవి
విశ్వదాభిరామ వినర వేమ!
మొండివాని కేల ముంజేతి కడియాలు
[మార్చు]మొండివాని కేల ముంజేతి కడియాలు
తొఱ్ఱివాని కేల కఱ్ఱపండ్లు
గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్
విశ్వదాభిరామ వినర వేమ!
మంత్రమెల్ల మఱచి మధురాధరముఁగోరు
[మార్చు]మంత్రమెల్ల మఱచి మధురాధరముఁగోరు
నేవిధమున భక్తుఁ డెఱుఁగు నిన్ను
యోనిఁ జూచి పరమయోగంబు మఱచురా
విశ్వదాభిరామ వినర వేమ!
మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చన
[మార్చు]మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చన
చేసి తమకుగరుణచెందినదని
వేదపఠన చేసి వెఱ్ఱులై పోదురు,
విశ్వదాభిరామ వినుర వేమ!
మందుదినఁ బోటు మానును
[మార్చు]మందుదినఁ బోటు మానును
మందు దినగ జేయఁ బొలఁతి మహిలో వలచు
మందుదిన కుదురు రోగము
మందుదినం గలదు పుష్టి మహిలో వేమా!
మేకఁ జంకఁబెట్టి మెలఁగుచు మందలో
[మార్చు]మేకఁ జంకఁబెట్టి మెలఁగుచు మందలో
బ్రమసి తిరుగు గొల్లపగిది గాక
దైవ మెఱుఁగక పరదైవముల్ దలఁచును
విశ్వదాభిరామ వినర వేమ!
మగఁడు మదనుఁడైన మంచికాఁపురమైన
[మార్చు]మగఁడు మదనుఁడైన మంచికాఁపురమైన
సహజ మేల మాను జారకాంత
పాలుద్రావు కుక్క బడిబడి పోవదా
విశ్వదాభిరామ వినర వేమ!
మగనికాలమందు మగువ కష్టించిన
[మార్చు]మగనికాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖముఁ బొందు
కలిమి లేములెందుఁ గలవెంతవారికి
బలిమి పుత్రబలిమె బలిమి వేమ!
మొగముఁ జూచినపుడె మోహంబు ఘన మౌను
[మార్చు]మొగముఁ జూచినపుడె మోహంబు ఘన మౌను
ధనముఁ జూచినపుడె తగులు మనసు
కూలినప్పు డరయకుసులెల్ల విఱుగును
విశ్వదాభిరామ వినర వేమ!
మేఘ మడ్డమయిన మిహిరుని జెఱచును
[మార్చు]మేఘ మడ్డమయిన మిహిరుని జెఱచును
జిత్తమడ్డమయిన స్థిరముఁ జెఱచు
పఱుపు లడ్డమైన మఱిముక్తి జెఱచురా
విశ్వదాభిరామ వినర వేమ!
మాట దిద్దవచ్చు మఱియెగ్గు లేకుండ
[మార్చు]మాట దిద్దవచ్చు మఱియెగ్గు లేకుండ
దిద్దవచ్చు ఱాతిఁదిన్నగాను
మనసు దిద్దరాదు మహి నెంతవారికి
విశ్వదాభిరామ వినర వేమ!
మాట లెల్ల కల్ల, మన సెల్ల దొంగకె
[మార్చు]మాట లెల్ల కల్ల, మన సెల్ల దొంగకె
నేటి ప్రాణ మింక నేటి బ్రతుకు?
మాట సత్యమైన మఱి శతాయుష్యంబు
విశ్వదాభిరామ వినర వేమ!
మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు
[మార్చు]మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు
మంత్ర ముడుగకున్న మనసు నిలదు
మనసు నిలుపకున్న మఱి ముక్తి లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!
మాటచెఱపు మూట మర్మము కర్మము
[మార్చు]మాటచెఱపు మూట మర్మము కర్మము
ఆశయ కడగట్టు అప్పుముప్పు
బాస దోస మెన్నఁ బలుకులు ములుకులు
లేశమయినఁ దెలియలేరు వేమా!
మాటనిలుపలేని మనుజుండు చండాలుఁ
[మార్చు]మాటనిలుపలేని మనుజుండు చండాలుఁ
డాజ్ఞ లేనిరాజు ఆఁడుముండ
మహిమలేని వేల్పుమంటిఁ జేసినపులి
విశ్వదాభిరామ వినర వేమ!
మాటలాడ నేర్చి మనసు కరుఁగఁజేసి
[మార్చు]మాటలాడ నేర్చి మనసు కరుఁగఁజేసి
పరఁగ ప్రియముపుట్టఁ బలుకకున్న
నొకరిచేత సొమ్ము లూరకవచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!
మాటలాడవచ్చు మనసు నిల్పగరాదు
[మార్చు]మాటలాడవచ్చు మనసు నిల్పగరాదు
తెలుపవచ్చు దన్నుఁ దెలియరాదు
సురియఁబట్టబచ్చు శూరుండు కారాదు
విశ్వదాభిరామ వినర వేమ!
మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
[మార్చు]మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
తెలుపవచ్చు దన్ను తెలియలేదు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ !
మాటలాడవేఱె మనసుకొలఁదియువేఱె
[మార్చు]మాటలాడవేఱె మనసుకొలఁదియువేఱె
యొడలగుణమువేఱె యోజనవేఱె
యెట్లుగల్గు ముక్తి యేలాగు తనలాగు
విశ్వదాభిరామ వినర వేమ!
మాటలోనివాని మహిమఁ దాఁ దెలియక
[మార్చు]మాటలోనివాని మహిమఁ దాఁ దెలియక
మాటబయలె లేక మమతఁ జిక్కె
మాట దెలిసెనేని మఱియాత్మ యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!
మాటవిననియాలు మగనికి మృత్యువు
[మార్చు]మాటవిననియాలు మగనికి మృత్యువు
యోటిపడవ సర్ప మొంటిగృహము
తనకుఁగానియాలు దానవురాలయా
విశ్వదాభిరామ వినర వేమ!
మఠములోన యోగి మాయలన్నియు గోసి
[మార్చు]మఠములోన యోగి మాయలన్నియు గోసి
ఘటములోననున్న ఘనుని దెలిసి
మాటమాటకు గురు మరువక తలచురా
విశ్వదాభిరామ వినురవేమ!
మేడిపండు చూడ మేలిమైయుండును
[మార్చు]మేడిపండు చూడ మేలిమైయుండును
పొట్టవిచ్చి చూడఁ బురుగులుండుఁ
పిరికివాని మదిని బింక మీలాగురా
విశ్వదాభిరామ వినర వేమ!
మతము లెన్నియైన సతముగా నుండవు
[మార్చు]మతము లెన్నియైన సతముగా నుండవు
సతము కర్మముండు జగతి నొకటి
ఆమతముల విడిచి యా బ్రహ్మమరయుము
విశ్వదాభిరామ వినర వేమ!
మతముదారి యగుచు మధురాధరముఁ జూచి
[మార్చు]మతముదారి యగుచు మధురాధరముఁ జూచి
మగువరూపుఁ జూచి మనసు మఱచు
యోనిఁజూచి సర్వయోగముల్ మఱచురా
విశ్వదాభిరామ వినర వేమ!
మత్సరంబు మదము మమకార మనియెడి
[మార్చు]మత్సరంబు మదము మమకార మనియెడి
వ్యసనములను దగిలి మసలఁబోక
పరుల కుపకరించి పరము నమ్మిక నుండ
నొనరుచుండు రాజయోగి వేమ!
మాదిగ చెవులను మనసులోఁ బెట్టుక
[మార్చు]మాదిగ చెవులను మనసులోఁ బెట్టుక
మాదిగలను దెగడు మాదిగపుడు
మంచిగుణములేక మఱిద్విజుఁ డెట్లగు
విశ్వదాభిరామ వినర వేమ!
మాదిగయనవద్దు మీదిగుణమొనరింప
[మార్చు]మాదిగయనవద్దు మీదిగుణమొనరింప
మాదిగది వసిష్టు మగువలేదె
మాదిగె గుణమున్న మరి ద్విజుడగునయా!
విశ్వదాభిరామ వినురవేమ!
మాదిగయనవద్దు మఱిగుణ మొనసిన
[మార్చు]మాదిగయనవద్దు మఱిగుణ మొనసిన
మాదిగది వసిష్ఠుమగువ చేడె
మాదిగ గుణమున్న మఱి ద్విజుఁడగునయా
విశ్వదాభిరామ వినర వేమ!
మొదట నతఁడు జ్ఞాన ముద్రాంకితుఁడు గాక
[మార్చు]మొదట నతఁడు జ్ఞాన ముద్రాంకితుఁడు గాక
యావిధమును దెలియ సజ్ఞుఁ డగును
నడుమ జ్ఞాన మొదవ నగుఁబాటు గాదయా
విశ్వదాభిరామ వినర వేమ!
మొదట నాశపెట్టి తుదిలేదు పొమ్మను
[మార్చు]మొదట నాశపెట్టి తుదిలేదు పొమ్మను
పరమలోభులైన పాపులకును
వారి యుసురుదాకి వగచెడిపోవరా
విశ్వదాభిరామ వినురవేమ!
మొదటఁ బోయునీవు మొగిబీజముల కెక్కి
[మార్చు]మొదటఁ బోయునీవు మొగిబీజముల కెక్కి
మొదటి కుఱుకువేగ మొలక లెత్తు
మొలక పృథివిఁ బెరిగి వెలయును వృక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!
మొదటను మతమును వదలక
[మార్చు]మొదటను మతమును వదలక
తుద నెవ్వరిమతమునైన దూషింపకయు
పదిలుఁడయి కోర్కెఁగోరక
ముదమునఁ జరియించువాఁడె ముఖ్యుఁడు వేమా!
మదిని గానవలెను మఱిబ్రహ్మమూర్తిని
[మార్చు]మదిని గానవలెను మఱిబ్రహ్మమూర్తిని
మదినిగన్నవారు మహినిలేరు
వెదకి తనువులోన వేడ్కతో నెఱిఁగిన
యతఁడె యోగివరుఁడు నగును వేమా!
మదినెఱిఁగినవాని మహిఁగాన నెందును
[మార్చు]మదినెఱిఁగినవాని మహిఁగాన నెందును
మది నెఱుంగువాఁడు మహిని నరుఁడు
వెదకి తనువులోన వేడ్కతో నినుఁజూచు
విశ్వదాభిరామ వినర వేమ!
మోదమునను గురుని ముఖ్యకరుణచేతఁ
[మార్చు]మోదమునను గురుని ముఖ్యకరుణచేతఁ
దొమ్మిదిస్థలముల దొడ్డు పాయ
సర్వజీవుఁడాయె సర్వమ్ముఁ దానాయె
విశ్వదాభిరామ వినర వేమ!
మదమువలన కలుగు మాటను మరి పల్కి
[మార్చు]మదమువలన కలుగు మాటను మరి పల్కి
మ్రుచ్చు సిద్ధుల నొగి మోసపుచ్చి
కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె?
విశ్వదాభిరామ వినురవేమ!
మద్యమాంసరుచిని మాదిగె దైవాల
[మార్చు]మద్యమాంసరుచిని మాదిగె దైవాల
యెంగిలిదినువారి దెట్టికులము
భక్తిని హరిఁగొల్చి భవ్యులుగారైరి
విశ్వదాభిరామ వినర వేమ!
మొదల క్రియను దప్పి మోసంబుచేసియు
[మార్చు]మొదల క్రియను దప్పి మోసంబుచేసియు
పొట్టకొఱకు మనసుఁ బొందుపఱచి
బీద కుక్కరీతి పెరుగును మనుజుండు
విశ్వదాభిరామ వినర వేమ!
మొదలమ్రాను నగును తుద పక్షియును గాదు
[మార్చు]మొదలమ్రాను నగును తుద పక్షియును గాదు
నోరు లేదు పండ్లు నాఱు గలుగు
జీవమొకటిలేదు జీవులఁజంపురా
విశ్వదాభిరామ వినర వేమ!
మొదలు చూచిచూచి తుదిఁ జూడకుండెనా
[మార్చు]మొదలు చూచిచూచి తుదిఁ జూడకుండెనా
చూపు తప్పినపుడె సొరగవలెను
సొరగకున్నవానిఁ జులకగాఁ జూతురు
విశ్వదాభిరామ వినర వేమ!
మధురసములు గోరి మక్షికంబులు చేరి
[మార్చు]మధురసములు గోరి మక్షికంబులు చేరి
చొచ్చి వెడలలేక చచ్చున్నట్లు
మునిగిఁ వెడల లేఁడు మోహంబు రాశిలో
విశ్వదాభిరామ వినర వేమ!
మానినీమనోజమంది రానందైక
[మార్చు]మానినీమనోజమంది రానందైక
లోలురెల్ల రూర్వ్ధలోకసుఖము
మాలవాడకుక్క మధురాన్న మెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!
మన్ను మిన్ను నంటి మహిమీఁద నొకకోట
[మార్చు]మన్ను మిన్ను నంటి మహిమీఁద నొకకోట
కొమ్మ లమరియుండు కొనలుసాగి
దివ్వెలేని వెలుఁగు తేజరిల్లుచు నుండు
విశ్వదాభిరామ వినర వేమ!
మన్నును దినమన్న మండేరు జనులార
[మార్చు]మన్నును దినమన్న మండేరు జనులార
మంటిలోనిమేలు మఱువనేల
నీళ్లలోనిమేలు నిఖిలమై యుండురా
విశ్వదాభిరామ వినర వేమ!
మన్నుమెత్తి కడిగి మఱిరూపు గావించి
[మార్చు]మన్నుమెత్తి కడిగి మఱిరూపు గావించి
గుంతనిండఁ బూడ్చి గుఱుతు నిల్పి
మనుజులెల్లఁ గూడి మఱిదేవుఁ డందురు
విశ్వదాభిరామ వినర వేమ!
మనములోనఁ బుట్టు మఱికోర్కులన్నియు
[మార్చు]మనములోనఁ బుట్టు మఱికోర్కులన్నియు
కోర్కులందు ముక్తి కుదురుపడదు
మనము బ్రహ్మమనుచు మదినెఱుంగఁగ లేరు
విశ్వదాభిరామ వినర వేమ!
మొనసి యింద్రియముల మొదట నిల్పఁగలేక
[మార్చు]మొనసి యింద్రియముల మొదట నిల్పఁగలేక
సమసిపోవు వేళ సన్యసించు
ఆత్మశుద్ధిలేక యంటునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!
మానసంపురక్తి మసలక యాత్మలో
[మార్చు]మానసంపురక్తి మసలక యాత్మలో
బోడితలల సొంపు పొల్పుమీఱ
కడుపుకొఱకుఁ దిరుగు కష్టంపుమతితోడ
విశ్వదాభిరామ వినర వేమ!
మానసంబు మంచిమల్లెపూవులచవికె
[మార్చు]మానసంబు మంచిమల్లెపూవులచవికె
బావితోఁటచేసి బాలఁగూడి
భోగినయ్యెద ననఁ బోయెపో కాలంబు
విశ్వదాభిరామ వినర వేమ!
మనసనలము రెంటికినిల
[మార్చు]మనసనలము రెంటికినిల
ఘనమును కొంచెంబుఁ దెలియఁగావలె సుమ్మీ
కనుమూసి తెరచినంతనె
ఘనమై విహరించుమనసుఁగానరు వేమా!
మనసు గెలచి పూని మన్నసుజ్ఞానులు
[మార్చు]మనసు గెలచి పూని మన్నసుజ్ఞానులు
కడఁక మోక్షపదముఁ గనుచునుండ్రు
చెట్టుఁబెట్ట ఫలము చేకూర కుండునా
విశ్వదాభిరామ వినర వేమ!
మనసు నిల్పినట్టి మర్మజ్ఞులగువారు
[మార్చు]మనసు నిల్పినట్టి మర్మజ్ఞులగువారు
గరిమ మోక్షపదముఁ గన్నవారు
చెట్టుఁబెట్ట ఫలము చేకొనఁడాతాను
విశ్వదాభిరామ వినర వేమ!
మనసు నిల్పలేని మాయావిరక్తులు
[మార్చు]మనసు నిల్పలేని మాయావిరక్తులు
మనసుపడుదు రొక్క మగువమీదఁ
నిట్టివ్యర్థజన్మ మీ బ్రతుకేటికి
విశ్వదాభిరామ వినర వేమ!
మనసు ముక్తియనుచు మది నెఱుంగఁగలేరు
[మార్చు]మనసు ముక్తియనుచు మది నెఱుంగఁగలేరు
మనసుచేతఁ దగిలి మాయమైరి
మనసు తానయైన మర్మజ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ వినర వేమ!
మనసు హక్కు కర్మ మదియేమి లేకయ
[మార్చు]మనసు వాక్కు కర్మ మరి యేమి లేకయు
రాకపోకలేని రాజవీధి
పరగ హాని గలదె పరతత్వయోగికి
విశ్వదాభిరామ వినర వేమ!
మనసుఁ బాఱవీడి మనసుఁ దా మగుడించి
[మార్చు]మనసుఁ బాఱవీడి మనసుఁ దా మగుడించి
మనసులోనఁగలుగు మర్మమెఱిగి
మనసు తాను నిల్ప మఱియుఁదా బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!
మనసున నెఱుకను మరుపునఁ
[మార్చు]మనసున నెఱుకను మరుపునఁ
గని విని చూడంగలేరు కదిసినపిదప
పెనగొని పట్టినచోనది
మనచోటను మాయమౌను మహిలో వేమా!
మనసునందు ముక్తిమలయుచు నుండంగ
[మార్చు]మనసునందు ముక్తిమలయుచు నుండంగ
మనసు లెఱుఁగలేక మనుజులెల్ల
మనసు నంటలేక మాయమై పోదురు
విశ్వదాభిరామ వినర వేమ!
మనసులోన నున్న మమత లన్నియుఁ గోసి
[మార్చు]మనసులోన నున్న మమత లన్నియుఁ గోసి
దృఢముఁ జేసి మనసు తేటఁబఱచి
ఘటము నిల్పువాఁడు ఘనతరయోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!
మనసులోని ముక్తి మఱియొక్క చోటను
[మార్చు]మనసులోని ముక్తి మఱియొక్క చోటను
వెదుకఁబోవువాఁడు వెఱ్ఱివాఁడు
గొఱ్ఱెఁ జింకఁ బెట్టి గొల్ల వెదుకురీతి
విశ్వదాభిరామ వినర వేమ!
మనసులోని శివుని మానుగాఁ దెలిసిన
[మార్చు]మనసులోని శివుని మానుగాఁ దెలిసిన
యోగియండ్రు వాని యుర్విజనులు
జీవునిన్నెఱుఁగ నీవెపో శివుఁడవు
విశ్వదాభిరామ వినర వేమ!
మనసులోనఁ దెలిసి మనసులోనే కలిసి
[మార్చు]మనసులోనఁ దెలిసి మనసులోనే కలిసి
మనసులోనివాని మరలఁదిగిచి
మనసునిల్పువాఁడు మర్మజ్ఞుఁడగు యోగి
విశ్వదాభిరామ వినర వేమ!
మనసులోనివాని మానుగాఁ దెలిసిన
[మార్చు]మనసులోనివాని మానుగాఁ దెలిసిన
నుర్విజనులువాని యోగి యండ్రు
నీవె నిన్నెఱుంగ నీవెపో శివుఁడవు
విశ్వదాభిరామ వినర వేమ!
మనసుసూచి గెల్చి మనసులో సుఖియించి
[మార్చు]మనసుసూచి గెల్చి మనసులో సుఖియించి
కడకు మోక్షపదము గనునువాఁడు
చెట్టుఁబెట్టు ఫలము చేకూర కుండునా
విశ్వదాభిరామ వినర వేమ!
మాయ జగమటంచు మనుజులు చెప్పేరు
[మార్చు]మాయ జగమటంచు మనుజులు చెప్పేరు
మాయగాదు కర్మ మయముగాని
మాయమైన జగము మరియేడ నున్నదో
విశ్వదాభిరామ వినురవేమ!
మాయ నరకమనుచు మాయ రోయకసాటి
[మార్చు]మాయ నరకమనుచు మాయ రోయకసాటి
సమముగ నరదేవసభలయందు
నందఱు ఘనులయిన హరునకుఁ దావేది
విశ్వదాభిరామ వినర వేమ!
మాయను చెఱసాల మనమను గొలుసును
[మార్చు]మాయను చెఱసాల మనమను గొలుసును
భేదమనెడుబొండ బెరసియుండు
ఇట్టిబద్ధజీవి కెన్నడు మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!
మాయరూపు రూపు మాయ తాఁజేసియు
[మార్చు]మాయరూపు రూపు మాయ తాఁజేసియు
మాయరూపులఁ బెనుమాయఁజేసి
మాయలోని మాయమహిమ నెఱుంగురా
విశ్వదాభిరామ వినర వేమ!
మాయల సంసారమునకు
[మార్చు]మాయల సంసారమునకు
మాయలనే తిరుగుచుండు మనుజుఁడులోనై
మాయలఁ దెలిసిన యంతట
మాయలనే ముక్తి గలుగు మహిలో వేమా!
మాయలోక మన్న మర్మంబు దెలియక
[మార్చు]మాయలోక మన్న మర్మంబు దెలియక
మాయఁజిక్కి యంత మాయఁబడిరి
మాయ దెలియ దివ్వె మాయదా జన్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!
మాయలోనఁ బుట్టి మాయలోననె పెరిగి
[మార్చు]మాయలోనఁ బుట్టి మాయలోననె పెరిగి
మాయఁ దెలియలేని మనుజుఁడేల
మాయఁ దెలియువాఁడు మహిమీఁద ధన్యుండు
విశ్వదాభిరామ వినర వేమ!
మ్రాకున ననలము పుట్టును
[మార్చు]మ్రాకున ననలము పుట్టును
మ్రాకెదుగును ననలమునకు మనుజునిలోన
మ్రాకుననలముల క్రియఁ జీ
జా కుడి నయోగి నెవరు గానరు వేమా!
మ్రానుఁ గాలవేసి మహిమీఁద నొకజాణ
[మార్చు]మ్రానుఁ గాలవేసి మహిమీఁద నొకజాణ
పూని తిరుగుచుండుఁ బొందుగాను
కాలవేయు మ్రాను కడురమ్యమైయుండు
విశ్వదాభిరామ వినర వేమ!
మ్రానులోన నగ్ని మఱియుండఁగా వచ్చు
[మార్చు]మ్రానులోన నగ్ని మఱియుండఁగా వచ్చు
నగ్ని నుండ మ్రాను కలవిగాదు
మ్రానులోనియగ్ని మర్యాద సంసారి
విశ్వదాభిరామ వినర వేమ!
మర్మ మెఱుఁగలేక మతములఁ గల్పించి
[మార్చు]మర్మ మెఱుఁగలేక మతములఁ గల్పించి
యుర్విదుఃఖు లగుదు రొకరి కొకరు
గాజువంటిఁ గుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ వినర వేమ!
మర్మమంతగొనకు మనసైన్యమేగాన
[మార్చు]మర్మమంతగొనకు మనసైన్యమేగాన
పరరహస్య మంత బయలుపడదు
పడినమనస దెన్న బయలుపడినరీతి
విశ్వదాభిరామ వినర వేమ!
మ్రుచ్చు తీర్థమేగి ముల్లె విడుచును గాని
[మార్చు]మ్రుచ్చు తీర్థమేగి ముల్లె విడుచును గాని
మ్రొక్కఁబ్రొద్దు లేదు మొనసి యెపుడు
కుక్క యిల్లుచొచ్చి కుండలు వెతుకదా
విశ్వదాభిరామ వినర వేమ!
మిఱపగింజఁ జూడ మీఁద నల్లగనుండుఁ
[మార్చు]పర్వత వనవాసి పరిణామ వర్తన
కూపవాసి కెట్టు గుఱుతుపడును
బ్రహ్మవిష్ణువెంటఁ బ్రాకృతుఁ డరుగునా
విశ్వదాభిరామ వినర వేమ!
మఱవవలె భావసంగతి
[మార్చు]మఱవవలె భావసంగతి
మఱవంగావలెను దురము మఱి విశ్వములో
మఱవవలెఁ బరులనేరము
మఱవంగా వలదు మేలు మహిలో వేమా!
మాల మాలకాడు మహిమీద నేప్రొద్దు
[మార్చు]మాల మాలకాడు మహిమీద నేప్రొద్దు
మాటతిరుగువాఁడు మాలగాక
వాని మాలయన్నవాఁడెపో పెనుమాల
విశ్వదాభిరామ వినర వేమ!
మాల మేలుగుణము మంచిది కల్గిన
[మార్చు]మాల మేలుగుణము మంచిది కల్గిన
మాలకూడుగుడుచు మనుజుకంటె
గుణము మేలుగాని, కులమేమి మేలురా!
విశ్వదాభిరామ వినురవేమ!
మొలక చనులనాఁడు మూఁడు కోటులు చేయు
[మార్చు]మొలక చనులనాఁడు మూఁడు కోటులు చేయు
కులుకు చనులనాఁడు కోటిసేయు
తటుకుచనులనాఁడు దమ్మిడి చేయదో
విశ్వదాభిరామ వినర వేమ!
మెలత నడవినుంచి మృగమువెంటనె పోయె
[మార్చు]మెలత నడవినుంచి మృగమువెంటనె పోయె
రామచంద్రుకన్న రసికుఁడేడి
చేటుకాలమునకు చెడుబుద్ధి పుట్టును
విశ్వదాభిరామ వినర వేమ!
మాలవాఁడయినను మఱియాత్మమీఁదను
[మార్చు]మాలవాఁడయినను మఱియాత్మమీఁదను
మనసు నిల్పెనేని మాలగాఁడు
మనసు నిల్పకున్న మహిమీఁద మాలఁడు
విశ్వదాభిరామ వినర వేమ!
మాలవాని నంటి మఱినీళ్ళ మునిగేరు
[మార్చు]మాలవాని నంటి మఱినీళ్ళ మునిగేరు
మనుజకర్మచేత మాలఁడయ్యె
నేలతెలియలేరో యీ నరపశువులు
విశ్వదాభిరామ వినర వేమ!
మాలవానినేల మరి మరి నిందింప
[మార్చు]మాలవానినేల మరి మరి నిందింప
నొడల రక్తమాంస మొకటెగాదె
వానిలోన మెలఁగువాని కులంబేది
విశ్వదాభిరామ వినర వేమ!
మాలవానిఁ జూచి యేల నిందింపఁగ
[మార్చు]మాలవానిఁ జూచి యేల నిందింపఁగ
పాటిలేనిమాట పలుకు టొకటె
వానిలోనఁ బల్కు వానికులం బేది
విశ్వదాభిరామ వినర వేమ!
మాసిన తలతోడ మలినవస్త్రముతోడ
[మార్చు]మాసిన తలతోడ మలినవస్త్రముతోడ
నొడల జడ్డుతోడ నుండెనేని
యగ్రజన్ముఁడయిన నట్టెపొమ్మందురు
విశ్వదాభిరామ వినర వేమ!
మహిని దధిని ఘృతము మ్రానులం దనలంబు
[మార్చు]మహిని దధిని ఘృతము మ్రానులం దనలంబు
సౌరుసుమములందు సౌరభంబు
తిలలఁ దైలమట్ల తేజరిల్లుఁ జిదాత్మ
విశ్వదాభిరామ వినర వేమ!
మోహము తీఱక యుండిన
[మార్చు]మోహము తీఱక యుండిన
దాహంబై దేహమంత దల్లడపడ నీ
గేహములోఁ బోరాడక
దేహమునం దున్న శివునిఁ దెలియర వేమా!
ముండమోపితోడ మునుఁగుచుఁ దేలుచు
[మార్చు]ముండమోపితోడ మునుఁగుచుఁ దేలుచు
నుండఁగానె మోహ ముండెఁ గాక
అండఁబాయు వెనుక నాయాసలే లేవు
విశ్వదాభిరామ వినర వేమ!
ముందరి పోటుల మాన్పను
[మార్చు]ముందరి పోటుల మాన్పను మందెందును గలదుగాని మహిలోపల నే నిందల పోటులు మాన్పెడు మందెచ్చట నైనఁ గలదె మహిలో వేమా!
ముక్కు గోరును సద్గంధములను జెలఁగి
[మార్చు]చెవులు గోరును మంచి జిలిబిలిపాటలఁ - దియ్యని మాటల తెఱఁగు వినఁగ
జన్మంబు గోఱును సరవితోడుత శీత - పృథుల సంస్పర్శ సంపదల నెపుడు
కన్నులు గోరును గమలయవర్ణంబు - లయినట్టి రూపంబు లనువుతోడ
నాలుక గోరును నయముతోడ తీపు - నొగరు కారమ్ము చేదుప్పు పులుసు
ముక్కు గోరును సద్గంధములను జెలఁగి
చెవులు చర్మంబు కన్నులు జిహ్వ ముక్కు
నిన్నియుం చాడినటువంటి యిల్లురోసి
తన్ను గనుగొని సుఖియింపఁ దగును వేమ!
ముక్కుత్రాళ్ళ గ్రుచ్చి ముఱికిపోవఁగఁ దోమి
[మార్చు]ముక్కుత్రాళ్ళ గ్రుచ్చి ముఱికిపోవఁగఁ దోమి
కచ్చనీరు నించి కడిగి కడిగి
డొక్క దోమినంత దొరకునా తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ముక్కుతుదను దృష్టి ముదముతోడుత నిల్పి
[మార్చు]ముక్కుతుదను దృష్టి ముదముతోడుత నిల్పి
హృదయమందుఁజూడ నొసగుముక్తి
పదవులెరుగకున్న పరమాత్మ యోగియౌ
విశ్వదాభిరామ వినర వేమ!
ముక్తి యెవరిసొమ్ము ముక్కుమీదుగ జూడ!
[మార్చు]ముక్తి యెవరిసొమ్ము ముక్కుమీదుగ జూడ!
భక్తి యెవరిసొమ్ము భజనసేయ
శక్తి యెవరిసొమ్ము యుక్తిచే సాధింప
విశ్వదాభిరామ వినురవేమ!
ముగ్గురి నెఱుఁగునట్టి మూలంబు నెఱిఁగియు
[మార్చు]ముగ్గురి నెఱుఁగునట్టి మూలంబు నెఱిఁగియు
ముగ్గురిమీఁద నొకటి మునుపు తెలిసి
పరగఁజిహ్వచేతఁ బ్రస్తుతి చేయరా
విశ్వదాభిరామ వినర వేమ!
ముగ్గురిలోన హెచ్చు ముందుగా కనలేక
[మార్చు]ముగ్గురిలోన హెచ్చు ముందుగా కనలేక
నరకమునకుఁ బోవు నరులు గలరు
ముగ్గురికిందనట్టి మూలమూర్తి యొకండు
విశ్వదాభిరామ వినర వేమ!
ముట్టుముట్టనుచును ముట్టరా దందురు
[మార్చు]ముట్టుముట్టనుచును ముట్టరా దందురు
ముట్టుకు దరి యేమి మూలమేమి
నవబిలములముఱికి నరుల కందఱకును
విశ్వదాభిరామ వినర వేమ!
మునిఁగి బ్రాహ్మణుండు ముందుఁగానకపోయె
[మార్చు]మునిఁగి బ్రాహ్మణుండు ముందుఁగానకపోయె
తిరిగి తిరిగి యతఁడు ద్రిమ్మ రాయె
కూసికూసితుదకు కుక్కయై పోయెరా
విశ్వదాభిరామ వినర వేమ!
మునిఁగి మునిఁగి మునిఁగి ముద్దయై ముద్దయై
[మార్చు]మునిఁగి మునిఁగి మునిఁగి ముద్దయై ముద్దయై
వనరి వనరి వనరి వక్కి వక్కి
తిరిగి తిరిగి తిరిగి దిమ్మరై యుండును
విశ్వదాభిరామ వినర వేమ!
మునిజనములు కలఁగ మునిఁగి వెళ్ళిన బావి
[మార్చు]మునిజనములు కలఁగ మునిఁగి వెళ్ళిన బావి
బ్రహ్మకుఁ దలయెత్తరాని బావి
మొలల బంటిగానుముంచు నెవ్వరినైన
విశ్వదాభిరామ వినర వేమ!
మురియు వాఁ డెవఁడు? మురియని దెవ్వఁడు?
[మార్చు]మురియు వాఁ డెవఁడు? మురియని దెవ్వఁడు?
పాటు జేసి చూడ బట్ట బయలు;
సొరిది జల ఘటమున సూర్యుని చందంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ముఱికికొంపలోన నిఱికించి జీవుని
[మార్చు]ముఱికికొంపలోన నిఱికించి జీవుని
కర్మపాశములను గట్టివేసి
నిట్టికర్మజీవి కెట్లొకో మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ముఱికిలోనఁ బుట్టి ముఱికిలోనఁ బెరిగి
[మార్చు]ముఱికిలోనఁ బుట్టి ముఱికిలోనఁ బెరిగి
ముఱికితనువు కింత మురిప మేల
ముఱికి తెలియు నరుఁడు ముఱుగునఁ బుట్టునా
విశ్వదాభిరామ వినర వేమ!
ముష్టి వేపచెట్టు మొదలుగా ప్రజలకు
[మార్చు]ముష్టి వేపచెట్టు మొదలుగా ప్రజలకు
పరఁగ మూలికలకు పనికివచ్చు
నిర్దయాత్మకుండు నీచుఁడెందునకును
పనికిరాఁడు గదర పరఁగ వేమ!
మూఁడులోకములను మొనసి యొక్కటిఁజేసి
[మార్చు]మూఁడులోకములను మొనసి యొక్కటిఁజేసి
యారులోకములను నట్లగూర్చి
స్థిరముగాను నుండు శివమూర్తి గురుఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!
మూఁడువేళలందు ముదముతో శివు నాత్మఁ
[మార్చు]మూఁడువేళలందు ముదముతో శివు నాత్మఁ
బూజచేయువాఁడు పుణ్యమూర్తి
పూజలేక మోక్షభోగంబు దొరకునా
విశ్వదాభిరామ వినర వేమ!
మూఢ భక్తిచేత ముక్కంటి బూజింప
[మార్చు]మూఢ భక్తిచేత ముక్కంటి బూజింప
మున్ను బోయవరుడు ముక్తుడాయె
పూజలేమి? తనదు బుద్ధిప్రధానము
విశ్వదాభిరామ వినురవేమ!
మూఢకోపములను మోహలాభంబులు
[మార్చు]మూఢకోపములను మోహలాభంబులు
నక్కజంపు క్రూర మధిక మయ్యె
కక్కసంబుచేతఁ గాలునిచేతను
మొక్కఁబోదురు తుది మొనసి వేమ!
మూల మెవ్వ రనుచు ముగ్గురిలోపల
[మార్చు]మూల మెవ్వ రనుచు ముగ్గురిలోపల
మూల మెఱుఁగలేరు మూఢజనులు
మూలమందఱకును ముఖ్యమౌఁ గర్మము
విశ్వదాభిరామ వినర వేమ!
మూల విద్యయందు ముఖ్యతేజములోన
[మార్చు]మూల విద్యయందు ముఖ్యతేజములోన
మెలగు చిత్పరుండు మిహిరు పగిది
కాలకర్మములకు కాలుండె సాక్షిరా
విశ్వదాభిరామ వినురవేమ!
మూలచక్ర మట్టె మొనసి గట్టిఁగ బట్టి
[మార్చు]మూలచక్ర మట్టె మొనసి గట్టిఁగ బట్టి
శోధఁజేసి శక్తి చొరవ దెలిసి
భేదపరచి మనసు బాధించి మోక్షము
సాధ్యమైన యోగి సరణి వేమా!
మృగములను, నరులకు మేలుగా పశువులు
[మార్చు]మృగములను, నరులకు మేలుగా పశువులు
తినగ, దున్న, పాలుకొనగ బుట్టి
కష్టపడును గాని కర్మ మీడేరదే!
విశ్వదాభిరామ వినురవేమ!
మఠములోనియోగి మాయలన్నియుగోసి
[మార్చు]మఠములోనియోగి మాయలన్నియుగోసి
ఘటములోన నున్న ఘనునిదెలిసి
మాట మాటకుగురు మరువక తెలుపురా,
విశ్వదాభిరామ వినుర వేమ!
మదము వలన గలుగు మాటలు మఱిపల్కి
[మార్చు]మదము వలన గలుగు మాటలు మఱిపల్కి
మ్రుచ్చు సద్దులనొగి మోసపుచ్చి
కాసురాబెనగెడు కష్ఠుండు గురుడౌనే?
విశ్వదాభిరామ వినుర వేమ!
మది గలిగిన పూజ మదనారి మెచ్చును
[మార్చు]మది గలిగిన పూజ మదనారి మెచ్చును
మనసు నిల్సినంత మహితుడగును
మనసులేని పూజ మట్టి సమానము
విశ్వదాభిరామ వినుర వేమ!
మనసే మాయా మృగమౌ
[మార్చు]మనసే మాయా మృగమౌ
మననేమిటి పైకిగానీ మణిపోనీకా
మనసున మనసును జంపిన
మనందే ముక్తిగలదు మహిలో వేమా!
మంట లోహమందు మ్రాకుల శిలలందు
[మార్చు]మంట లోహమందు మ్రాకుల శిలలందు
పటములందు గోడప్రతిమలందు
తన్నుదెలియు కొఱకుదగులదా పరమాత్మ
విశ్వదాభిరామ వినుర వేమ!