చిన్ననాటి ముచ్చట్లు
చిన్ననాటి ముచ్చట్లు
డాక్టర్ కె. యన్. కేసరి
కేసరి కుటీరం
(ప్రై) లిమిటడ్
చెన్నయ్ - 600014
మొదటి ముద్రణ : 1953
1989 నవంబరు నుంచి 1991 జులైదాకా 'జగతి'లో
రెండవ ముద్రణ : 1999 : కేసరీ కుటీరం శతజయంతి సందర్బంగా
ముఖచిత్రం : బాపు
Kesari Kuteeram (P) Ltd.
Chennai - 600 014.
వెల : రు. 75-00
Laser typesetting at ː
Sri Maruthy Laser Printers
174, Peters Road, Royapettah, Chennai - 600 014. Phone ː 8524256 ప్రశస్థి
మహనీయుల స్వీయచరిత్ర నావకు చుక్కానివలె మార్గదర్శి కాగలదు. సులభశైలి, తేటతెలుగు, చదువుట ప్రారంభించిన ముగియు వరకు వీడుటకు మనసురాని విషయములు గలవు.
ఆనాటి చెన్న నగరము ఎట్లుండెనో, అప్పటి విద్యార్థులెట్లు కాలము గడిపిరో, రోడ్లు, కాఫీహోటల్లు భవనములు ఏరీతిన ఉండెడివో తెలుసు కొనుటకు అనువగు వర్ణనలు కలవు. కేవలము వైద్యవృత్తిలోనేగాక, శిల్పమందు, లలితకళలయందు, సనాతన ధర్మరక్షణయందు వారికిగల నైపుణ్యము ఈ గ్రంథము చదివిన తెలియనగును. మానవసేవయే మాధవసేవ అని డాక్టరుగారి ఆదర్శము.
ప్రత్తిపాటి సత్యనారాయణరావు
మద్రాసు హైకోర్టు జడ్జి
9 - 3 - 53
తొలి పలుకు
పేదరికమునపుట్టి, అసహాయులై, స్వయంకృషిచే విశేషధనము నార్జించి అనేక సంఖ్యాకులకు పలువిధముల సహాయ్యముచేసి, విద్యాసంస్థలకు లక్షల కొలది విరాళము లొసంగి, స్నేహపాత్రులై, ఆంధ్రదేశమునకు మాసిపోని వన్నె తెచ్చిన ధన్యజీవులు శ్రీయుతులు కేసరిగారు.
శ్రీ కేసరిగారు వైద్యశాస్త్రములో మిక్కిలి ప్రతిభను గడించి వ్యాపారము పెద్దచేయుటతోనే తృప్తి చెందలేదు. రాజకీయ విషయములలో పాల్గొనకపోయినను వారికి సంఘసంస్కరణములో అత్యంతమైన ఉత్సాహము. సాంఘికోద్యమములకు వారు చేసిన సహాయ్యములు ఈ పుస్తకము చదివినవారికి తేటతెల్లము కాగలవు.
హాస్యముగ విషయములను వర్ణింపగల శక్తి వారికి గలదు. అందుకు తార్కాణముగా అరవ కాపురము - తెలుగు కాపురమును పేర్కొనవలెను.
రసము వెలితికాకుండ ఆత్మ అనుభవములను సాదృశ్యము చేయగల నేర్పు గొప్ప రచయితులకు మాత్రము సాధ్యము. శ్రీ కేసరిగారి శైలి, వర్ణించు ధోరణి మిక్కిలి రుచికరములు. ఇది శ్రీ కేసరిగారు ఆంధ్రవాణికి యిచ్చిన కానుక. చిరకాలము ఈ పుస్తకము ఆంధ్ర సారస్వతము నలంకరించగలదని నా నమ్మకము.
7-3-53
మైదవోలు శేషాచలపతి
అడ్వకేటు, మద్రాసు.
1
బాల్యము - విద్యాభ్యాసము
మా తల్లికి నేనొక్కడనే సంతానము. ఆమె తనకు ఆడబిడ్డలులేని ముచ్చట తీర్చుకొనుటకై నాకు ఆడపిల్ల వేషమువేసి ఇరుగుపొరుగిండ్లచూపి ఆనందించుట నాకిప్పటికిని జ్ఞాపకమున్నది. నా 5వ ఏటనే మా అమ్మ నన్ను మా ఊరిలో బడికి చదువ పంపినది. ఆ బడిపంతులు పేరు పిచ్చయ్యగారు. వారికి పిల్లకాయలకు చదువు చెప్పగల సామర్థ్యము లేకపోయినను చీటికి మాటికి వారిని చావగొట్టేవారు. అందుచేత వారిని చూస్తే పిల్లకాయలందరికి చాలా భయముగా ఉండేది. ఆకాలములో బడిపంతుళ్లకు నెలజీతములు లేక నెలకింతని జీతముగానిచ్చుట లేకపోయినను భోజనపదార్థములగు వరిగలను, కాయధాన్యములను, వంకాయలు, గోంగూర పచ్చిమిరప కాయలు మొదలగు కాయగూరలను, రైతుల పిల్లకాయలు తెచ్చి ఇచ్చేవారు. అందుచే వారు పంతులు దయకు పాత్రులై యుండేవారు. అట్టివారికి దెబ్బలుండవు. ఏమీ తేలేని వారికి మాత్రము, పంతులు బెత్తముతో కావలసినన్ని పేముపండ్లను ప్రసాదించేవారు. బడిలో పిల్లకాయల సంఖ్యను బట్టి ప్రభుత్వమువారు అప్పటికి కొంతకాలమునుండి, సాలీనా రొఖ రూపమున గ్రాంటు నిచ్చుచుండిరి. ఆ సర్కారు గ్రాంటుకై ఆయన తంటాలుపడి పిల్లకాయలను బడికి చేరదీసేవారు.
కొత్త పిల్లకాయలను బడిలోనికి చేర్చేనాడు, బడిలో చదివే పిల్లలందరికి పప్పుబెల్లాలు పంచి పెట్టేవారు. పంతులుకు వరహా (4 రూIIలు)
పూర్తి విషయసూచిక
[మార్చు]విషయ సూచిక
1 |
6 |
13 |
19 |
24 |
32 |
35 |
50 |
63 |
70 |
77 |
97 |
101 |
109 |
126 |
138 |
148 |
151 |
154 |
158 |
160 |
167 |
171 |
179 |
185 |
190 |
మూల ప్రతులు
[మార్చు]This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.