హరి నీవే బుద్ధిచెప్పి
ప|| హరి నీవే బుద్ధిచెప్పి యాదరించు నామనసు | హరి నీవే నాయంతర్యామివిగాన ||
చ|| వసముగానికరివంటిది నామనసు | యెసగి సారెకు మదియించీగాన |
పొసగ బాదరసము బోలిననామనసు | అసము దించక సదా అల్లాడీగాన ||
చ|| వడి నడవుల చింకవంటిది నామనసు | బడిబడి బట్టబట్ట బారీగాన |
కడగి విసరుపెనుగాలివంటిది మనసు | విడువక కన్నచోట విహరించీగాన ||
చ|| వరుస నిండుజలనిధివంటిది నామనసు | వొరసి సర్వము లోనై వుండీగాన |
గరిమ శ్రీవేంకటేశ కావవే నామనసు | సరి నీయానతి నీకే శరణనిగాక ||
pa|| hari nIvE buddhiceppi yAdariMcu nAmanasu | hari nIvE nAyaMtaryAmivigAna ||
ca|| vasamugAnikarivaMTidi nAmanasu | yesagi sAreku madiyiMcIgAna |
posaga bAdarasamu bOlinanAmanasu | asamu diMcaka sadA allADIgAna ||
ca|| vaDi naDavula ciMkavaMTidi nAmanasu | baDibaDi baTTabaTTa bArIgAna |
kaDagi visarupenugAlivaMTidi manasu | viDuvaka kannacOTa vihariMcIgAna ||
ca|| varusa niMDujalanidhivaMTidi nAmanasu | vorasi sarvamu lOnai vuMDIgAna |
garima SrIvEMkaTESa kAvavE nAmanasu | sari nIyAnati nIkE SaraNanigAka ||
బయటి లింకులు
[మార్చు]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|